Vishal and Arya: గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొన్న తమిళ స్టార్ హీరోలు...'పునీత్' పేరుతో మొక్క నాటిన విశాల్

'ఎనిమీ' సినిమా ప్రమోషన్ లో భాగంగా..హైదరాబాద్ వచ్చిన తమిళ స్టార్ హీరోలు విశాల్, ఆర్య.. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొని..మెుక్కలు నాటారు. తాను నాటిన మెుక్కకు పునీత్ పేరు పెట్టాడు హీరో విశాల్.  

Edited by - ZH Telugu Desk | Last Updated : Nov 1, 2021, 07:42 PM IST
Vishal and Arya: గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొన్న తమిళ స్టార్ హీరోలు...'పునీత్' పేరుతో మొక్క నాటిన విశాల్

Green India Challenge: తెలంగాణలో మెుక్కలు పెంచడం కోసం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్యక్రమం 'గ్రీన్ ఇండియా ఛాలెంజ్'. రాష్ట్రవ్యాప్తంగా ఈ కార్యక్రమం నిర్విరామంగా కొనసాగుతోంది. ఇందులో పలువురు రాజకీయ నాయకులు, సెలబ్రెటీలు పాల్గొని మెుక్కలు నాటుతున్నారు. తాజాగా ఈ రోజు 'ఎనిమీ' సినిమా(Enemy Movie) ప్రమోషన్ కోసం హైదరాబాద్ వచ్చిన హీరోలు విశాల్, ఆర్య, నటి మిర్నాళిని రవి 'గ్రీన్ ఇండియా ఛాలెంజ్'లో పాల్గొని హైటెక్స్ ప్రాంగణంలో మొక్కలు నాటారు.

అనంతరం విశాల్ మాట్లాడుతూ.. రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రభుత్వ మానసపుత్రిక 'హరితహారం'స్పూర్తితో ప్రారంభించిన 'గ్రీన్ ఇండియా చాలెంజ్'(Green India Challenge) కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటడం సంతోషంగా ఉంది. ప్రకృతి, సమాజం పట్ల బాధ్యతతో వారు ప్రారంభించిన ఈ “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” గ్లోబల్ వార్మింగ్(Global Warming)ని అరికట్టడానికి దోహదపడుతుందని చెప్పారు. భవిష్యత్ తరాల మనుగడకు అవకాశం కల్పిస్తుందని అన్నారు. అందుకే ప్రతి ఒక్కరు బాధ్యతగా “గ్రీన్ ఇండియా చాలెంజ్”లో పాల్గొని మొక్కలు నాటాలని విశాల్(Hero Vishal) కోరారు. అంతేకాదు తన స్నేహితుడు 'పునీత్ రాజ్ కుమార్'(Puneeth Rajkumar) గుర్తుగా ఈరోజు మొక్కని నాటుతున్నానని.. ఈ మొక్క తన స్నేహితునికి గుర్తుగా ఉంటుందని తెలిపారు.

Also read: Hero Vishal: 'పునీత్​కు మాటిస్తున్నా..ఇకపై ఆ బాధ్యత నాది': విశాల్

ఆర్య(Arya) మాట్లాడుతూ.. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగస్వామ్యం అయి మొక్కలు నాటడం ఆనందంగా ఉందని అన్నారు. భవిష్యత్ తరాలకు మంచి పర్యవరణాన్ని అందించాలంటే ప్రతి ఒక్కరు విధిగా మొక్కలు నాటాలని కోరారు. ఇంత మంచి కార్యక్రమం చేపట్టిన ఎంపీ సంతోష్ కుమార్‌(MP Santosh Kumar)కి నటుడు ఆర్య ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటడం సంతోషాన్నిచ్చిందని నటి మిర్నాళిని అన్నారు. అనంతరం “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” కో ఫౌండర్ రాఘవ 'వృక్షవేదం' పుస్తకాన్ని ‘ఎనిమీ’ చిత్ర బృందానికి అందజేశారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News