పవన్ కళ్యాణ్ పేరు ఎందుకు మారింది..?

Last Updated : Oct 3, 2017, 01:19 PM IST
పవన్ కళ్యాణ్ పేరు ఎందుకు మారింది..?

ఇంటర్నెట్ సెర్చ్‌లో చలనచిత్ర నటుడు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పేరు ఉన్నట్టుండి మార్పుకు గురైంది. ఎవరైనా పవన్ కళ్యాణ్ పేరుతో గూగుల్ సెర్చ్ చేస్తున్నప్పుడు అతని పేరుకు బదులు మరో పేరు కనిపిస్తోంది. ఆ పేరే కుషాల్ బాబు. అయితే దీనికి కారణం ఏమై ఉంటుందో తెలియదు. గతంలో కల్యాణ్ బాబు, పవర్ స్టార్ లాంటి పేర్లు సెర్చ్ చేస్తున్నప్పుడు తొలుత వెబ్ పేజీల్లో కనిపించేవి. కానీ ఆ పేర్లకు బదులుగా కొత్తగా ఈ కుషాల్ బాబు పేరు  తెరపైకి ఎందుకు వచ్చిందో తెలియదు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కతున్న తన 25వ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నారు.  

 

Trending News