హ్యాపీ బర్త్‌డే.. పరిణీతి చోప్రా..!

  

Last Updated : Oct 22, 2017, 02:00 PM IST
హ్యాపీ బర్త్‌డే.. పరిణీతి చోప్రా..!

ఆమె ప్రముఖ బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రాకి స్వయానా సోదరి..  బ్యాంకింగ్ రంగమంటే అమితమైన ఆసక్తి ఉన్నా అనుకోకుండా సినీ రంగంలోకి ప్రవేశించిందామె.. క్యూట్ లుక్స్‌తో, స్టైలిష్ యాక్టింగ్‌తో అచ్చమైన ఈ కాలం మోడరన్ అమ్మాయి ఎలా ఉంటుందో.. అలా నటించడం ఆమెకు అలవాటు. ఆ నటనా శైలితో బాలీవుడ్‌లోనే ఒక ట్రెండ్ క్రియట్ చేసిన బబ్లీ హీరోయిన్ "పరిణీతి చోప్రా". ఈమె పుట్టినరోజు సందర్భంగా తన గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు మీకోసం

  • 22 అక్టోబరు1988 తేదీన హర్యానాలో పవన్ చోప్రా, రీనా దంపతులకు జన్మించిన పరిణీతి చోప్రా చిన్నప్పటి నుండీ మంచి విద్యార్థిని. 17వ ఏటనే మాంచెస్టర్ బిజినెస్ స్కూల్‌లో సీటు సంపాదించిన ఆమె తొలుత ఇన్వెస్ట్ మెంట్ బ్యాంకర్ అవ్వాలని భావించారట. అయితే అనుకోకుండా సినిమా అవకాశాలు ఆమె తలుపు తట్టాయి. ప్రముఖ బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా ఈమెకు కజిన్. 
  • చదువుకుంటున్న రోజుల్లోనే పాకెట్ మనీ కోసం ఈమె మాంచెస్టర్ ఫుట్‌బాల్ క్లబ్‌‌లో క్యాటరింగ్ టీమ్ లీడర్‌గా పనిచేసేవారట.
  • యశ్‌రాజ్ ఫిలిమ్స్‌లో తొలుత పబ్లిక్ రిలేషన్స్ కన్సల్టెంట్‌గా కెరీర్ ప్రారంభించిన పరిణీతి చోప్రా, ఆ తర్వాత అదే కంపెనీకి నటిగా సైన్ చేయడం విశేషం.
  • బ్యాండ్ బాజా బారాత్‌ సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్ లో పాల్గొన్నప్పుడు తొలిసారిగా తనకూ యాక్టింగ్ అంటే ఇష్టమని గుర్తించిందామె. అందుకే వెంటనే తన జాబ్‌కు రిజైన్ చేసి యాక్టింగ్ స్కూల్‌లో చేరిందామె. 
  • పరిణీతికి సంగీతమంటే కూడా ఎంతో ఇష్టం. ఆమె హిందూస్తానీ సంగీతం నేర్చుకోవడంతో పాటు అందులో బిఏ (హానర్స్) డిగ్రీ కూడా చేశారు.
  • 2011లో "లేడీస్ అండ్ రిక్కీస్ బల్" చిత్రం ద్వారా తెరంగేట్రం చేసిన పరిణీతి అందులో సహాయనటిగానే నటించాల్సి వచ్చింది. అదే సినిమా ఆమెకు ఫిల్మ్‌‌ఫేర్ అవార్డు కూడా సంపాదించిపెట్టింది
  • పరిణీతి కెరీర్‌ను మలుపుతిప్పిన సినిమా ఏదైనా ఉందంటే, అది "ఇష్క్ జాదే" అని చెప్పుకోవచ్చు. 2012లో విడుదలైన ఆ సినిమా ఆమెకు జాతీయ అవార్డును కట్టబెట్టింది
  • ఆ తర్వాత షుద్ దేశీ రొమాన్స్, హసీ తో ఫసీ, దావత్ ఏ ఇష్క్, కిల్ దిల్ లాంటి సినిమాలు ఆమెలోని మరో నటిని బాలీవుడ్‌కి పరిచయం చేశాయి. ప్రస్తుతం గోల్‌మాల్ ఏగైన్ ద్వారా తిరిగి తన లక్‌ను పరీక్షించుకోవడానికి సిద్ధమవుతోంది పరిణీతి.
  • ఈ అందాల నటికి మనమూ చెప్పేద్దామా.. జన్మదిన శుభాకాంక్షలు

 

 

 

 

 

 

Trending News