Oscar Awards 2022: లాస్ ఏంజిల్స్‌లో ఘనంగా ఆస్కార్ అవార్డుల ప్రదానం, ఆస్కార్ అవార్డు విజేతల జాబితా ఇదే

Oscar Awards 2022: ప్రపంచ ప్రఖ్యాత ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం అత్యంత ఘనంగా జరిగింది. 94వ ఆస్కార్ అకాడమీ అవార్డ్స్ విజేతలకు లాస్ ఏంజెల్స్‌లోని ఐకానిక్ డోల్బీ ధియేటర్ సాక్షిగా అందించారు. ఆస్కార్ విజేతలో జాబితాలో..

Written by - Md. Abdul Rehaman | Last Updated : Mar 28, 2022, 11:47 AM IST
Oscar Awards 2022: లాస్ ఏంజిల్స్‌లో ఘనంగా ఆస్కార్ అవార్డుల ప్రదానం, ఆస్కార్ అవార్డు విజేతల జాబితా ఇదే

Oscar Awards 2022: ప్రపంచ ప్రఖ్యాత ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం అత్యంత ఘనంగా జరిగింది. 94వ ఆస్కార్ అకాడమీ అవార్డ్స్ విజేతలకు లాస్ ఏంజెల్స్‌లోని ఐకానిక్ డోల్బీ ధియేటర్ సాక్షిగా అందించారు. ఆస్కార్ విజేతలో జాబితాలో..

హాలీవుడ్ సుప్రసిద్ధ గ్రాండ్ నైట్, 94వ అకాడమీ అవార్డ్స్ ఆస్కార్ అవార్డ్స్ 2022 కార్యక్రమం లాస్ ఏంజెల్స్‌లోని ఐకానిక్ డోల్బీ థియేటర్‌లో అత్యంత ఘనంగా నిన్న ముగిసింది. ఈ కార్యక్రమానికి అమెరికా సినీ పరిశ్రమకు చెందిన అతిరథ మహారధులంతా హాజరయ్యారు. 

కింగ్ రిచర్డ్ సినిమాలో బెస్ట్ లీడింగ్ రోల్‌గా విల్‌స్మిత్ ఆస్కార్ అవార్డు గెల్చుకున్నాడు. అటు జెస్సికా  చెస్టైన్..ది ఐస్ ఆఫ్ ట్యామీ ఫాయేలో నటనకు బెస్ట్ యాక్ట్రెస్ అవార్డు గెల్చుకుంది. మరోవైపు కోడా సినిమా బెస్ట్ పిక్చర్‌గా, జేన్ క్యాంపియన్ బెస్ట్ డైరెక్టర్‌గా ఆస్కార్ అవార్డులు గెల్చుకున్నారు. 

ఆస్కార్ అవార్డు గ్రహీతల పూర్తి జాబితా

బెస్ట్ పిక్చర్ కేటగరీలో కోడా, బెల్‌ఫాస్ట్, డోన్ట్ లుక్‌అప్, డ్రైవ్ మై కార్, డ్యూన్, కింగ్ రిచర్డ్, లికోరిస్ పిజ్జా, నైట్‌మేర్ యాలీ, ది పవర్ ఆఫ్ ది డాగ్, వెస్ట్‌సైడ్ స్టోరీ సినిమాలు ఆస్కార్ అవార్డులు గెల్చుకున్నాయి. 

బెస్ట్ యాక్టర్ కేటగరీలో కింగ్ రిచర్డ్ సినిమాలో విల్‌స్మిత్, బీయింగ్ ది రికార్డోస్ సినిమాలో జేవియర్ బార్డెమ్, ది పవర్ ఆఫ్ ది డాగ్ సినిమాలో బెనెడిక్ట్ కంబర్ బ్యాచ్, టిక్ టిక్ బూమ్ సినిమాలో ఆండ్రూ గార్‌ఫ్రెండ్, ది ట్రాజెడీ ఆఫ్ మ్యాక్‌బెత్ సినిమాలో డెంజెల్ వాషింగ్టన్‌లు ఆస్కార్ అవార్డులు గెల్చుకున్నారు. 

ఇక బెస్ట్ యాక్ట్రెస్ కేటగరీలో ది ఐస్ ఆప్ ట్యామీ ఫాయేలో జెస్సికా ఛెస్టైన్, ది లాస్ట్ డాటర్ సినిమాలో ఒలివియా కోల్మన్, ప్యారెలల్ మదర్స్ సినిమాలో పెనెలోప్ క్రూజ్, బీయింగ్ రికార్డోస్ సినిమాలో నికోల్ కిడ్మాన్, స్పెన్సర్ సినిమాలో క్రిస్టెన్ స్టూవర్ట్‌‌లు ఆస్కార్ అవార్డులు గెల్చుకున్నారు. 

బెస్ట్ డైరెక్టర్ కేటగరీలో ది పవర్ ఆఫ్ ది డాగ్ సినిమాకు జేన్ క్యాంపియన్, లికోరిస్ పిజ్జా సినిమాకు పాల్ థామస్ యాండర్సన్, బెల్ ఫాస్ట్ సినిమాలో కెన్నెత్ బ్రానఘ్, డ్రైవ్ మై కార్ సినిమాకు ర్యూసుక్ హమగూచి, వెస్ట్ సైడ్ స్టోరీ సినిమాకు స్టీవెన్ స్పీల్‌బర్గ్‌లు ఆస్కార్ అవార్డులు గెల్చుకున్నారు. 

ఇక బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ కేటగరీలో..కోడా సినిమాకు ట్రోయ్ కోట్సర్, బెల్ ఫాస్ట్ సినిమాకు సియారన్ హిండ్స్, ది పవర్ ఆఫ్ ది డాగ్ సినిమాకు జెస్సీ ప్లెమ్మన్స్, బీయింగ్ రిచర్డ్స్ సినిమాకు జేకే సిమ్మన్స్, ది పవర్ ఆఫ్ ది డాగ్ సినిమాకు కోడి స్మిత్ మెక్ ఫీలు ఆస్కార్ అవార్డులు గెల్చుకున్నారు. 

Also read: Video: రామ్ చరణ్ బర్త్ డే వేడుకల్లో ఎన్టీఆర్, రాజమౌళి... ఎంతలా ఎంజాయ్ చేశారో చూడండి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News