Kalki2898AD: కల్కి విషయంలో మొత్తం రివర్స్.. ఇన్ని సంవత్సరాలలో ప్రభాస్ కి ఇదే మొదటిసారి!

Kalki Trailer: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న కల్కి2898AD ..సినిమాపై అంచనాలు నెక్స్ట్ లెవెల్ లో ఉన్నాయి. చిత్ర బృందం కూడా సినిమాని.. అదే రేంజ్ లో ప్రమోట్ చేస్తోంది. ఇప్పటికే సినిమాకి సంబంధించి చాలా ప్రమోషనల్ కంటెంట్.. బయటకు వచ్చింది కానీ అన్ని మంచి రెస్పాన్స్ ని మాత్రమే అందుకున్నాయి. సినిమా మీద ఇంకా ఎటువంటి ట్రోల్స్ మొదలవలేదు.. మరి సినిమా విడుదలయ్యాక పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలి. 

Written by - Vishnupriya Chowdhary | Last Updated : Jun 12, 2024, 05:42 PM IST
Kalki2898AD: కల్కి విషయంలో మొత్తం రివర్స్.. ఇన్ని సంవత్సరాలలో ప్రభాస్ కి ఇదే మొదటిసారి!

Kalki 2898AD Update: కొన్ని సినిమాల విషయంలో మొదటి నుంచి అంచనాలు భారీగా ఉంటాయి. కానీ ప్రమోషనల్ కంటెంట్ బయటకు వచ్చే కొద్ది.. సినిమాపై అంచనాలు తగ్గిపోతూ ఉంటాయి. ఉదాహరణకి ప్రభాస్ ఆది పురుష్ సినిమా.. విషయంలో రామాయణం ఆధారంగా సినిమా అనగానే భారీ అంచనాలు నెలకొన్నాయి. కానీ చిత్ర పోస్టర్లు, టీజర్లు, ట్రైలర్ ఇలా ఒకదాని తర్వాత ఒకటి.. బయటకు వచ్చే కొద్ది సినిమా ఎలా ఉండబోతుందో అని ఆసక్తి కంటే ఆందోళన ఎక్కువైంది. 

కానీ తాజాగా ప్రభాస్ హీరోగా నటిస్తున్న కల్కి సినిమా విషయంలో మాత్రం అంతా రివర్స్ లో జరుగుతుంది. మొదట ప్రభాస్ హీరోగా మహానటి ఫేమ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్.. దర్శకత్వంలో సినిమా అనగానే అభిమానులు సరే అనుకున్నారు. సినిమాకి ప్రాజెక్ట్ కే.. అనే టైటిల్ ఫిక్స్ అయ్యాక అందులో కే అంటే కల్కి.. అని రివీల్ అయ్యాక సినిమా ఎలా ఉండబోతుందో.. అని ఆసక్తి మొదలైంది. 

సినిమాకి సంబంధించిన మొదటి పోస్టర్ విడుదలైనప్పుడు.. ఈ సినిమా కూడా ఆది పురుష్ లాగా.. ఫ్లాప్ అవుతుందేమోనని అభిమానులు కంగారుపడ్డారు. కానీ సినిమాకి సంబంధించిన ప్రమోషనల్ కంటెంట్ బయటకు వచ్చే కొద్ది.. సినిమాపై అంచనాలు కూడా భారీ స్థాయిలో పెరిగిపోతూ వచ్చాయి. చిత్ర బృందం కూడా సినిమాని భారీ లెవెల్ లోనే.. ప్రమోట్ చేసింది. 

సినిమా టీజర్, సినిమలో అమితాబ్ బచ్చన్.. పోషిస్తున్న అశ్వత్థామ పాత్ర, సినిమా ప్రమోషన్స్ లో భాగంగా విడుదలైన బుజ్జి అండ్ భైరవ అనే చిన్న వెబ్ సిరీస్, సినిమాలో కనిపించనున్న బుజ్జి అనే రోబోటిక్ కార్, కీర్తి సురేష్ ఆ కార్ కి డబ్బింగ్ చెప్పడం, చిత్ర బృందం నిజంగానే ఆ కార్ ను హైదరాబాద్, చెన్నై, ముంబై లలో ఎగ్జిబిషన్ లాగా పెట్టడం, నిన్నగాక మొన్న విడుదలైన చిత్ర ట్రైలర్ ఇలా ఒకదాని తర్వాత మరొకటి సినిమాపై అంచనాలను తారాస్థాయికి తీసుకువెళ్లాయి. 

ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా సినిమా గురించి అంచనాలు ఎక్కువగానే ఉన్నాయి. అందరూ సినిమా.. అద్భుతంగా ఉండబోతోంది అని గట్టిగా నమ్ముతున్నారు. సినిమాకి సంబంధించి ట్రోల్స్ మాత్రం. కనిపించకపోవడం చాలా మంచి సంకేతం.. అని కొందరు చెబుతున్నారు. ఆఖరికి తమిళనాడు నుంచి కూడా ఈ సినిమా మీద ట్రోల్స్ రావడం లేదు. 

ఆర్ఆర్ఆర్, పుష్ప వంటి సినిమాలు కూడా తమిళ్ ఇండస్ట్రీ నుంచి ట్రోల్స్ ఎదుర్కున్నాయి. చాలా వరకు తెలుగు ప్యాన్ ఇండియా సినిమాలు తమిళనాడులో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించలేకపోయాయి. కానీ అక్కడి ప్రేక్షకులు కూడా ఇప్పుడు.. కల్కి సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. దానికి మరొక కారణం లోకనాయకుడు కమల్ హాసన్ సినిమాలో విలన్ పాత్రలో కనిపించడం అని కూడా చెప్పుకోవచ్చు.

ఏదేమైనా సినిమా మీద ట్రోల్స్ పెద్దగా లేవు. అంతేకాకుండా బాహుబలి తరువాత ప్రభాస్ నుంచి వచ్చిన సినిమాలలో.. ప్రమోషనల్ కంటెంట్ వచ్చిన తర్వాత.. ఈ సినిమా ఒక్కదానిపైనే అస్సలు ట్రోల్స్ రాకపోవడం విశేషం. పైగా అన్ని భాషల నుంచి స్టార్ నటీనటులు.. ఈ సినిమాలో కీలక పాత్రలలో కనిపించబోతున్నారు కాబట్టి అందరూ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు తప్ప.. కామెంట్లు చేయడం లేదు. ఇది ఒక రకంగా చిత్ర బృందం ముందుగానే ప్లాన్ చేసి తీసుకున్న నిర్ణయం కూడా అయి ఉండొచ్చు. 

భారీ అంచనాల మధ్య ఈ సినిమా ఈనెల 27వ తేదీన విడుదల కి సిద్ధమవుతోంది. సలార్ సినిమాతో హిట్ అందుకున్న ప్రభాస్ కల్కి సినిమాతో తన ముందు రికార్డులను తిరగ రాస్తారు అని అభిమానులు బలంగా నమ్ముతున్నారు.

Read more: Video viral: వామ్మో... ప్రైవేటు పార్ట్ ను కరిచిన పాము.. షాకింగ్ వీడియో వైరల్..

Read more: Viral video: ఒరేయ్.. ఎవర్రా మీరంతా.. వర్షం బురద నీళ్లను వదలరా.. వైరల్ గా మారిన వీడియో..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News