Balakrishna - Chiranjeevi: బాలయ్య- చిరు ఫాన్స్ కు అదిరే న్యూస్.. ఇక ఆ టెన్షన్ పడక్కర్లేదు!

Good News for Balakrishna and Chiranjeevi: అదేంటి అనుకుంటున్నారా? అవును నిజమే, ఇప్పుడు బాలకృష్ణ వీర సింహా రెడ్డి, చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమాలకు మంచి టైం వచ్చింది. ఆ వివరాల్లోకి వెళితే 

Written by - Chaganti Bhargav | Last Updated : Nov 6, 2022, 08:29 PM IST
Balakrishna - Chiranjeevi: బాలయ్య- చిరు ఫాన్స్ కు అదిరే న్యూస్.. ఇక ఆ టెన్షన్ పడక్కర్లేదు!

Good News for Balakrishna and Chiranjeevi: సాధారణంగా సినిమాలకు సంక్రాంతి మంచి సీజన్. 3 రోజులపాటు ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు ఉంటుంది అలాగే దాదాపుగా అన్ని వ్యాపార సంస్థలకు సెలవులు ప్రకటిస్తారు. స్కూల్ పిల్లలకైతే దాదాపు పది రోజులు పాటు సెలవు ప్రకటిస్తారు. దీంతో సినిమాలకు ఇది మంచి సీజన్ గా భావిస్తూ ఉంటారు. వచ్చే ఏడాది సంక్రాంతికి బాలకృష్ణ, చిరంజీవి, ప్రభాస్, తమిళ హీరో విజయ్, అక్కినేని అఖిల్ వంటి వారు నటించిన సినిమాలు విడుదలవుతాయని ఇప్పటికే అధికారికంగా ప్రకటన వచ్చింది.

నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్న వీర సింహారెడ్డి, మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న వాల్తేరు వీరయ్య, అక్కినేని అఖిల్ హీరోగా నటిస్తున్న ఏజెంట్, ప్రభాస్ హీరోగా నటిస్తున్న ఆది పురుష్, విజయ్ హీరోగా నటిస్తున్న వారసుడు సినిమాలు సంక్రాంతికి విడుదల చేస్తామని అధికారికంగా ప్రకటించారు. అయితే ఇందులో ఆది పురుష్ సినిమా గ్రాఫిక్స్ వర్క్ ఇంకా పూర్తి కాకపోడంతో ఆ సినిమా సంక్రాంతి రేసు నుంచి తప్పుకున్నట్లు ప్రచారం జరుగుతోంది.

ప్రస్తుతానికి ఈ విషయం మీద అధికారికంగా ఎలాంటి ప్రకటన రాలేదు కానీ తప్పుకోవడం అయితే ఖాయం అని తెలుస్తోంది. ఆదిపురుష్ ఎలా అయినా తప్పుకుంటుంది కాబట్టి తాము లైన్లోకి దిగటానికి అఖిల్ ఏజెంట్ టీమ్ సిద్ధమైంది. దాదాపుగా సంక్రాంతికి రిలీజ్ చేస్తారని అందరూ భావించారు అయితే సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందించిన ఈ ఏజెంట్ సినిమా సంక్రాంతికి రావడం లేదని తెలుస్తోంది. ఒక రకంగా ఇది అటు మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్య, నందమూరి బాలకృష్ణ వీరసింహారెడ్డి సినిమాలకు మంచి ప్లస్ పాయింట్ అనే చెప్పాలి.

ఎందుకంటే ఏజెంట్ సినిమా రిలీజ్ అయితే కొన్ని థియేటర్లను దానికి కేటాయించాల్సి ఉంటుంది. అది రిలీజ్ అవ్వడం లేదు కాబట్టి ఆ ధియేటర్లలో కొన్ని వాల్తేరు వీరయ్య మరికొన్ని వీరసింహారెడ్డి ఇంకా మిగిలినవి వారసుడు సినిమా పంచుకునే అవకాశం ఉంటుంది. వాస్తవానికి బాలకృష్ణ, చిరంజీవి మధ్య పోటీ గట్టిగా ఉంటుంది.

ఈ సంక్రాంతికి వీరిద్దరి మధ్య ఎలాంటి పోటీ ఉండబోతోంది? వీరిద్దరిలో ఎవరి సినిమా బాగా ఆడబోతోంది? అంటూ ఇప్పటినుంచే అభిమానులైతే లెక్కలు కట్టుకుంటున్నారు. ఇలాంటి తరుణంలో ఏజెంట్ సినిమా వెనకడుగు వేయడం, రెండు సినిమా యూనిట్లకు ఒక శుభ పరిణామం అనే చెప్పాలి. అయితే ఆది పురుష్ అలాగే ఏజెంట్ సినిమాలు సంక్రాంతికి రావడం లేదనే విషయాన్ని మాత్రం ఇంకా సినిమా యూనిట్లు అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.

Also Read: Ram Gopal Varma: మునుగోడుపై బాంబుల వర్షం.. రంగంలోకి ఐఎస్ఐఎస్, అల్ ఖైదా!

Also Read: Naga Chaitanya Calls Samantha: పుట్టెడు దుఃఖంలో సమంత.. అభయమిచ్చిన చైతూ!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News