ఆసక్తి రేపుతున్న 'గోల్డ్' టీజర్

ఇండియన్ హాకీ టీమ్ కోచ్ పాత్రలో అక్షయ్ కుమార్

Last Updated : Feb 6, 2018, 04:38 PM IST
ఆసక్తి రేపుతున్న 'గోల్డ్' టీజర్

బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలో నటిస్తున్న గోల్డ్ సినిమా టీజర్ సోమవారం రిలీజైంది. 1948లో స్వతంత్ర దేశంగా భారత్ ఒలంపిక్స్‌లో గోల్డ్ మెడల్ గెలిచిన తీరు, అప్పటి పరిస్థితులు, అంతకుముందు చోటుచేసుకున్న నాటకీయ పరిణామాల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో అక్షయ్ కుమార్ ఇండియన్ హాకీ టీమ్ కోచ్ పాత్ర పోషిస్తున్నాడు. 

 

హాకీ క్రీడ అంటే పడిచచ్చేంత ఇష్టం వున్న క్రీడాకారుడిగా, ఇండియన్ హాకీ టీమ్ కోచ్‌గా అక్షయ్ కుమార్ ఎంత పవర్‌ఫుల్ పాత్ర పోషిస్తున్నాడు అనే సంగతి టీజర్ చూస్తేనే అర్థమవుతుంది. రీమా కగ్తి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాను మరో ప్రముఖ బాలీవుడ్ నటుడు ఫరాన్ అక్తర్, రితేష్ సిధ్వాని సంయుక్తంగా కలిసి నిర్మిస్తున్నారు. హిందీ టీవీ సీరియల్స్‌లో ప్రముఖ నటిగా పేరున్న మౌని రాయ్ ఈ సినిమాతో హీరోయిన్‌గా బాలీవుడ్ పరిశ్రమకు పరిచయం అవుతోంది. నిర్మాణం దశలోనే బాలీవుడ్ దృష్టిని ఆకర్షిస్తున్న ఈ సినిమా స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఈ ఏడాది ఆగస్టు 15న రిలీజ్ కానుంది.

Trending News