Gangubai Kathiawadi Movie in Controversy: బాలీవుడ్ మూవీ 'గంగూబాయి కతియావాడి' విడుదలకు సిద్ధమవుతున్న వేళ వివాదాలు చుట్టుముడుతున్నాయి. ముంబై మాఫియా క్వీన్ 'గంగూబాయి' జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రంపై గంగూబాయి కుటుంబ సభ్యులు తిరగబడుతున్నారు. ఇటీవల విడుదలైన సినిమా ట్రైలర్లో తన తల్లిని ఒక వేశ్యలా చూపించారని గంగూబాయి దత్తపుత్రుడు బాబు రావ్జీ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
నిజానికి 'గంగూబాయి' సినిమా చిత్రీకరణను నిలిపివేయాలంటూ గతేడాదే బాబు రావ్జీ ముంబై కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీంతో 'గంగూబాయి' చిత్ర దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీతో పాటు హీరోయిన్ అలియా భట్‌లకు కోర్టు సమన్లు జారీ చేసింది. అయితే ఆ తర్వాత.. సినిమా విడుదలపై స్టే ఇవ్వడానికి కోర్టు నిరాకరించింది. అంతేకాదు, గంగూబాయి మేకర్స్‌పై దాఖలైన పరువునష్టం దావా కేసుకు సంబంధించిన ప్రొసీడింగ్స్‌పై కూడా స్టే ఇచ్చింది. ప్రస్తుతం ఈ కేసు విచారణ పెండింగ్‌లో ఉండగా.. గంగూబాయి కుటుంబ సభ్యులు మాత్రం సినిమా విడుదలపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
తాజాగా గంగూబాయి ఫ్యామిలీ లాయర్ నరేంద్ర మీడియాతో మాట్లాడుతూ.. 'గంగూబాయి కతియావాడి' ట్రైలర్ విడుదలైనప్పటి నుంచి గంగూబాయి కుటుంబ సభ్యులు షాక్‌లో ఉన్నారని చెప్పారు. సినిమాలో గంగూబాయి పాత్రను వల్గర్‌గా చూపించారని.. ఒక సోషల్ యాక్టివిస్టును వేశ్యగా చూపించడమేంటని మండిపడ్డారు. ఏ కుటుంబమైనా ఇలాంటి చర్యలను సమ్మతించదని అన్నారు. 2020 నుంచి బాబు రావ్జీ ఈ సినిమాపై ఫైట్ చేస్తున్నారని.. కేవలం ఈ సినిమా కారణంగా వారు సమాజంలో తలెత్తుకోలేని స్థితిలోకి నెట్టబడ్డారని.. తరచూ ఇళ్లు మారుతూ అజ్ఞాతంలో బతకాల్సిన పరిస్థితి ఏర్పడిందని పేర్కొన్నారు.
గంగూబాయి మనవరాలు భారతి మాట్లాడుతూ.. డబ్బు కోసం సినిమావాళ్లు మా కుటుంబ ప్రతిష్ఠను దిగజార్చారు. దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదు. అసలు ఈ ప్రాజెక్టు మొదలుపెట్టే ముందు మా అనుమతి కూడా తీసుకోలేదు. తన నానమ్మ కామటిపురాలో జీవించేదని.. అంతమాత్రాన అక్కడ నివసించే ప్రతీ మహిళ వేశ్య అవుతుందా అని ప్రశ్నించారు. గంగూబాయి గురించి తాము ఎంతో గొప్పగా చెప్పుకునేవాళ్లమని.. కానీ ఈ సినిమా ట్రైలర్ విడుదలయ్యాక.. అంతా ఆమెను ఒక వేశ్యలా మాట్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
Also Read: Bappi Lahri Passes away: బ్రేకింగ్ న్యూస్.. ప్రముఖ సింగర్ బప్పి లహరి కన్నుమూత
Bappi Lahiri: బప్పి లహిరి మెడ నిండా బంగారం.. ఎందుకలా కనిపించేవాడో తెలుసా..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook