Alia Bhatt Marriage: మా పెళ్లి ఎప్పుడో అయిపొయింది.. బాంబు పేల్చిన ఆలియా భట్‌!!

Alia Bhatt Marriage:ఆలియా భట్‌ తొలిసారిగా తన పెళ్లి విషయంపై స్పందించారు. చాలా కాలం క్రితమే తన మైండ్‌లో రణ్‌బీర్‌ కపూర్‌ను పెళ్లి చేసేసుకున్నానని తెలిపింది. 

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 11, 2022, 03:12 PM IST
  • పీకల్లోతు ప్రేమలో రణ్‌బీర్‌-అలియా
  • రణ్‌బీర్‌తో నా పెళ్లి అప్పుడే జరిగింది
  • బాంబు పేల్చిన ఆలియా భట్‌
Alia Bhatt Marriage: మా పెళ్లి ఎప్పుడో అయిపొయింది.. బాంబు పేల్చిన ఆలియా భట్‌!!

Alia Bhatt says Iam already married Ranbir Kapoor: బాలీవుడ్‌ లవ్‌ బర్డ్స్‌ రణ్‌బీర్‌ కపూర్‌, ఆలియా భట్‌ పీకల్లోతు ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే. వీరి పెళ్లి కోసం బాలీవుడ్‌ పెద్దలతో పాటు ప్రతిఒక్కరు ఎదురుచూస్తునారు. ప్రేమికులు విక్కీ కౌశల్‌, కత్రినా కైఫ్‌లు పెళ్లి చేసుకుని వైవాహిక బంధంలోకి అడుగుపెట్టడంతో రణ్‌బీర్‌-అలియా ఎప్పుడు పెళ్లి పీటలు ఎక్కుతారాని అందరూ వారిని ఆడుగుతున్నారు. వీరిద్దరి పెళ్లి అంటూ గతేడాది నుంచి ప్రచారం జరుగుతూనే ఉన్నా.. వివాహ ముహుర్తం మాత్రం ఫిక్స్‌ అవ్వడం లేదు. డిసెంబర్‌లో​ పెళ్లి అంటూ గతంలో వార్తలు వచ్చాయి. కానీ అది కూడా పుకారుగానే మిగిపోయింది.

తాజాగా 'గంగూబాయ్‌ కతియావాడి' ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్న ఆలియా భట్‌ తొలిసారిగా తన పెళ్లి విషయంపై స్పందించారు. లాక్‌డౌన్‌ లేకపోతే ఈపాటికి పెళ్లి అయిపోయి ఉండేదని రణ్‌బీర్‌ కపూర్ గతంలో అన్నారు కదా నిజమేనా? అని ఓ రిపోర్టర్ ఆలియాను ప్రశ్నించగా.. 'నా దృష్టిలో మా పెళ్లి ఎప్పుడో అయిపోయింది. చాలా కాలం క్రితమే నా మైండ్‌లో అతన్ని పెళ్లి చేసేసుకున్నాను (నవ్వుతూ). రణ్‌బీర్‌ చెప్పింది నిజమే. లాక్‌డౌన్‌ కారణంగా అప్పుడు పెళ్లి వాయిదా పడింది. మంచి సమయం వచ్చినప్పుడు తప్పకుండా మా పెళ్లి జరుగుతుంది' అని పేర్కొన్నారు.

అనంతరం తన ఇష్టాయిష్టాలపై స్పందించిన గంగూబాయ్‌.. 'షూటింగ్ నుంచి ఏ మాత్రం ఖాళీ దొరికినా.. ఏదో ఒక కొత్త పని నేర్చుకోవడానికి ప్రయత్నిస్తా. సమయాన్ని అసలు వృథా చేయను. అది నాకు నచ్చదు. కరోనా కారణంగా షూటింగ్స్‌ వాయిదా పడిన సమయంలో మ్యూజిక్‌పై దృష్టిపెట్టాలనుకున్నా. ఆ సమయంలో గిటార్‌ నేర్చుకున్నా. స్క్రీన్‌ రైటింగ్‌లో శిక్షణ తీసుకున్నా. చాలానే చేశా' అని చెప్పారు. 

చిన్ననాటి నుంచి స్నేహితులైన రణ్‌బీర్‌ కపూర్‌, ఆలియా భట్‌.. 'బ్రహ్మాస్త్ర' షూటింగ్‌ సమయంలో ప్రేమలో పడ్డారు. అప్పటినుంచి చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారు. తమ సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా.. ఖాళీ దొరికితే పబ్, పార్టీ, పెళ్లిళ్లకు జంటగా హాజరవుతున్నారు. ఇక ప్రస్తుతం ఆలియా గంగూబాయ్‌ కతియావాడి సినిమా ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నారు. ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాతో ఆలియా టాలీవుడ్‌ ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్​తో ఆలియా మరో సినిమా కూడా చేస్తున్నట్లు తెలుస్తోంది. 

Also Read: Drawing Eyes On Painting: బొమ్మకు కళ్లు గీసినందుకు.. మొదటి రోజే ఉద్యోగం పోయింది!!

Also Read: DJ Tillu: విజయ్ దేవరకొండను కాపీ కొడుతున్నారా.. హీరో సిద్ధు జొన్నలగడ్డ రియాక్షన్ ఇదే..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook 

Trending News