Faria Abdullah in SSMB28: మహేష్ బాబుతో చిట్టి.. అసలు క్లారిటీ వచ్చేసిందిగా!

Faria ABdullah in SSMB28: Sources Close to Team Says its Just a Gossip: మహేష్ బాబు సినిమాలో ఫరియా అబ్దుల్లా సెకండ్ హీరోయిన్ అనే ప్రచారం జరుగుతోంది. అయితే అది నిజం కాదని అంటున్నారు. ఆ వివరాల్లోకి వెళితే

Written by - Chaganti Bhargav | Last Updated : Sep 27, 2022, 09:50 AM IST
Faria Abdullah in SSMB28: మహేష్ బాబుతో చిట్టి.. అసలు క్లారిటీ వచ్చేసిందిగా!

Faria ABdullah in SSMB28: Sources Close to Team Says its Just a Gossip: పరశురామ్ డైరెక్షన్లో సర్కారు వారి పాట సినిమాతో సూపర్ హిట్ అందుకున్న మహేష్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ డైరెక్షన్లో సినిమా చేస్తున్నాడు. సూపర్ స్టార్ మహేష్ 28వ సినిమాగా రుపొందుతున్న ఈ సినిమాకి సంబంధించిన మొదటి షెడ్యూల్ ఇప్పటికే పూర్తయింది. అన్నపూర్ణ స్టూడియోస్ అలాగే రామోజీ ఫిలిం సిటీలో కొన్ని యాక్షన్ సీక్వెన్స్ లను ఈ షెడ్యూల్ లో షూట్ చేశారు.

దీంతో మొదటి షెడ్యూల్ పూర్తయినట్లు సినిమా నిర్మాత నాగవంశీ ప్రకటించారు. కండ్ షెడ్యూల్ కూడా అక్టోబర్ రెండో వారంలో ప్రారంభమయ్యే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. నిజానికి ఈ సినిమా షూట్ కూడా మొదలు కాకముందే ఈ సినిమాలో పూజా హెగ్డేనుకే హీరోయిన్గా ఫైనల్ చేశారు. అయితే సాధారణంగా త్రివిక్రమ్ సినిమా అంటే ఇద్దరు హీరోయిన్లు ఉంటారు అని అంచనాలు ఉంటాయి. ఎందుకంటే గతం నుంచి ఆయన చేస్తున్న అన్ని సినిమాలను పరిశీలిస్తే సెకండ్ హీరోయిన్ గా మరో భామకు ఆయన అవకాశం కల్పిస్తూ ఉంటారు.

దీంతో ఈ సినిమాలో కూడా సెకండ్ హీరోయిన్ ఉందని ఆ హీరోయిన్ గా జాతి రత్నాలు భామ ఫరియా అబ్దుల్లాని తీసుకునే అవకాశం ఉందని ప్రచారం జరిగింది. త్వరలోనే ఆమె షూట్ లో పాల్గొంటారని కూడా ప్రచారం జరుగుతున్న క్రమంలో నిజం కాదని సూపర్ స్టార్ మహేష్ బాబు 28 సినిమా వర్గాల నుంచి సమాచారం. అసలు సెకండ్ హీరోయిన్ అనే అవకాశం ఈ సినిమా కథలో లేదని, త్రివిక్రమ్ గత సినిమాలతో ఈ సినిమాను పోల్చే అవసరం లేదని వారు చెబుతున్నారు.

ఫరియా  అబ్దుల్లాను అసలు తీసుకునే ఆలోచన లేదని, సెకండ్ హీరోయిన్ కి అవకాశమే లేనప్పుడు ఆమె పేరు ఎందుకు వచ్చిందో అర్థం కావడం లేదని వారు అంటున్నారు. ఇక ఈ సినిమాను భారీ బడ్జెట్ తో హారిక హాసిని క్రియేషన్స్ రాధాకృష్ణ, సితార ఎంటర్ టైన్మెంట్స్  నాగ వంశీ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమా 2023 వేసవిలో తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇప్పటికే దీనికి సంబంధించిన అధికారిక రిలీజ్ డేట్ కూడా ప్రకటించారు చూడాలి మరి ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను ఏమేరకు ఆకట్టుకుంటుంది అనేది. 

Also Read : Jr NTR as Villain: ప్రశాంత్ నీల్ సరికొత్త ప్లాన్.. హీరో-విలనూ ఎన్టీఆరే.. మాములుగా ఉండదు మరి!

Also Read : Karthikeya 2 OTT: ఓటీటీకి సిద్దమైన 'కార్తికేయ‌ 2'.. స్ట్రీమింగ్ ఆరోజు నుంచే!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News