F3 Movie: ఎఫ్ 3 విజయంపై ప్రేక్షకులకు ప్రత్యేక కృతజ్ఞతలు, టీమ్ ఎఫ్ 3

F3 Movie: విక్టరీ వెంకటేశ్, వరుణ్ తేజ్ నటించిన ఎఫ్ 2 సీక్వెల్ ఎఫ్ 3 బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. మొదటి షో నుంచే పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతోంది. మూవీ సక్సెస్‌పై ప్రేక్షకులకు వెంకటేశ్ సహా చిత్ర యూనిట్ కృతజ్ఞతలు తెలిపింది.

Written by - Md. Abdul Rehaman | Last Updated : May 28, 2022, 09:16 AM IST
F3 Movie: ఎఫ్ 3 విజయంపై ప్రేక్షకులకు ప్రత్యేక కృతజ్ఞతలు, టీమ్ ఎఫ్ 3

F3 Movie: విక్టరీ వెంకటేశ్, వరుణ్ తేజ్ నటించిన ఎఫ్ 2 సీక్వెల్ ఎఫ్ 3 బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. మొదటి షో నుంచే పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతోంది. మూవీ సక్సెస్‌పై ప్రేక్షకులకు వెంకటేశ్ సహా చిత్ర యూనిట్ కృతజ్ఞతలు తెలిపింది.

అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఎఫ్ 3 సినిమా ఊహించినట్టే బిగ్ ఎంటర్‌టైనర్‌గా నిలుస్తోంది. తొలి షో నుంచే సక్సెస్ టాక్ తెచ్చుకుంది. ఎఫ్ 2 ని మించి ఎంటర్‌టైన్‌మెంట్ ఉందంటున్నారు. సినిమా విజయంపై చిత్ర యూనిట్ ఆనందం వ్యక్తం చేసింది. వెంకటేశ్,దిల్‌రాజు, అనిల్ రావిపూడి, వరుణ్ తేజ్‌లు ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు. సినిమాను అన్ని వర్గాల ప్రేక్షకులు ఆదరిస్తున్నారని చెప్పారు. అంతా కుటుంబసమేతంగా ఎఫ్ 3 సినిమాను ఎంజాయ్ చేస్తున్నారని చెప్పారు. ఎఫ్ 3 సినిమాను థియేటర్లలో చూస్తున్న ప్రేక్షకుల స్పందన చాలా ఆనందం కల్గిస్తుందన్నాడు వెంకటేశ్. అనిల్ రావిపూడికి, చిత్ర యూనిట్‌కు వెంకటేశ్ అభినందనలు తెలిపాడు.

ఎఫ్ 3 సినిమా విషయంలో ప్రతిచోటా బ్లాక్ బస్టర్ మాటే విన్పిస్తోందని..ఇంతటి విజయాన్ని అందిస్తున్న ప్రేక్షకులకు దర్శకుడు అనిల్ రావిపూడి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపాడు. ఎఫ్ 3 సినిమా రెండేళ్ల సుదీర్ఘ ప్రయాణమని..స్టార్ ఇమేజ్ కలిగి వెంకటేశ్ ఇంత కామెడీ పండించడం చాలా గొప్ప విషయమని ప్రశంసించాడు. అటు వరుణ్ తేజ్ నటన అద్భుతంగా ఉందన్నాడు. వెంకటేశ్ తో ఇంతకుముందు సీతమ వాకిట్లో సిరిమల్లె చెట్టు కాగా..ఇప్పుడు ఎఫ్ 3తో హ్యాట్రిక్ విజయమని దిల్‌రాజు గుర్తు చేసుకున్నాడు. 

Also read: SVP Movie On OTT: సర్కారు వారి పాట ముందుగానే ఓటీటీలో స్ట్రీమింగ్, అమెజాన్ ప్రైమ్ సన్నాహాలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News