Effect of Action Movies:ప్రస్తుతం ఎక్కడ చూసినా యాక్షన్ ఓరియంటెడ్ చిత్రాల హవా కనపడుతుంది.సినిమాలే కాదు ఓటీటీ సంస్థలు కూడా చాలావరకు థ్రిల్లర్, యాక్షన్, సైకో ఓరియంటెడ్ మూవీస్ ,వెబ్ సిరీస్ కు ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇంట్లో కూర్చుని అదే పనిగా ఇటువంటి చిత్రాలను ,వెబ్ సిరీస్ ను చూడడం వల్ల మన మానసిక ఆరోగ్యం పై చాలా చెడు ప్రభావం పడుతుంది అంటున్నారు నిపుణులు. మరి అదేమిటో తెలుసుకుందాం పదండి..
హింసాత్మకమైన చిత్రాలు.. మర్డర్ మిస్టరీలు.. సైకో థ్రిల్లర్లు.. ఇలా చాలావరకు సినిమాలు ఇదే కంటెంట్ తో వస్తున్నాయి. ఎక్కువగా ప్రజలు వీటిని ఆదరించడంతో.. ఈ కాన్సెప్ట్స్ తోనే సినిమాలు తీయడానికి మూవీ మేకర్స్ ముందుకు వస్తున్నారు. అయితే ఇటువంటి హింస ప్రవృత్తి ఎక్కువగా ఉన్న చిత్రాలు చూడడం వల్ల మనకు తెలియకుండానే మనలో దూకుడు ప్రవర్తన, హింసాత్మకమైన ఆలోచన తీరు, ఎదుటి వారి బాధను చూసి కూడా పట్టించుకోలేని ఒక నిర్లక్ష్యపు ధోరణ పెరుగుతుంది.
హింసాత్మకమైన సినిమాలు మన మానసిక ఆరోగ్యం పై ఏ రకంగా ప్రభావం చూపిస్తాయో మీకు తెలుసా? వినడానికి విచిత్రంగా ఉన్న మనం పదే పదే ఏదైతే చూస్తామో.. మనం మెదడులో అది రిజిస్టర్ అవుతుంది. ఇది మన ఆలోచన తీరుపై తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తుంది. మీరు ఎక్కువగా హింసాత్మకమైనటువంటి సినిమాలు సైకో థ్రిల్లర్లు చూడడానికి ఇష్టపడుతుంటే వెంటనే ఆ అలవాటుని ఎంత వీలైతే అంత తగ్గించుకోవడం మంచిది.
ఇటువంటి సినిమాలు చూడడం వల్ల మీ ఆరోగ్యం ఎలా దెబ్బతింటుందో తెలుసుకుందాం..
ప్రవర్తనలో మార్పు:
ఎక్కువగా థ్రిల్లర్ మూవీలు ,సైకో మూవీలు, హింసాత్మకమైన సన్నివేశాలు ఎక్కువగా కలిగిన సినిమాలు చూసేవారికి తెలియకుండానే ప్రవర్తన చాలా మారిపోతుంది. దూకుడుగా మాట్లాడడం, ప్రతిదానికి వక్రించిన అర్ధాన్ని వెతకడం.. అవతలి వారు బాధపడుతుంటే చూసి ఆనందించడం.. లాంటి ప్రవర్తనలు వీరిలో మనం గమనించవచ్చు. తినగా తినగా వేము తీయగుండు అన్నట్లుగా.. చూడగా చూడగా హింస మనకు కూడా అలవాటైపోతుంది. అందుకే వీలైనంత తక్కువగా ఇటువంటి చిత్రాలను చూడడం మంచిది.
భయం
సహజంగా కొంతమందికి ప్రమాదకరమైన సీన్స్ లేక వైలెన్స్ ఎక్కువగా ఉన్న కంటెంట్ చూసినప్పుడు భయం కలుగుతుంది. అది వాళ్లు బయటకి ఎక్స్ప్రెస్ చేయకపోయినాప్పటికీ లోపల తెలియకుండా వాళ్లలో తీవ్రమైన ఒత్తిడి, ఆత్రుత క్రియేట్ అవుతుంది. ఇది వారి మానసిక ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తుంది.
పిల్లలు ఎక్కువగా ఇటువంటి వాటి వల్ల ఎక్కువ ప్రభావితులవుతారు. అందుకే నిరంతరం పిల్లలు ఎటువంటి సినిమాలు చూస్తున్నారు, యూట్యూబ్లో ఎలాంటి వీడియోలు ఇష్టపడుతున్నారు, వాళ్ల ప్రవర్తనలో ఏదైనా మార్పు ఉందా అన్న విషయాలను ఎప్పటికప్పుడు గమనించుకుంటూ ఉండాలి. మీ ఇంట్లో వీలైనంతవరకు కుటుంబం అంతా కలిసి ఆనందంగా నవ్వుతూ చూసే కంటెంట్ ఉన్న చిత్రాలు, వెబ్ సిరీస్ లేక వీడియోస్ చూసే విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి.
Also Read: Konda Surekha: జగన్‌కు వ్యతిరేకంగా తెలంగాణ అక్క.. ఏపీ రాజకీయాల్లోకి కొండా సురేఖ
Also Read: Telangana High Court: తెలంగాణలో అనూహ్య మలుపు.. గవర్నర్ కోటా ఎమ్మెల్సీల ప్రమాణస్వీకారానికి బ్రేక్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి