RRR NTR Teaser Spoof: కుర్రాళ్లు అదరగొట్టేశారు.. RRR నిర్మాత ఫిదా

RRR NTR Teaser Spoof | రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న సినిమా ‘ఆర్ఆర్ఆర్’. యంగ్ టైగర్ ఎన్టీఆర్ తెలంగాణ గొండు ముద్దుబిడ్డ కొమురం భీమ్ పాత్రను పోషిస్తుండగా, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ విప్లవ తేజం, మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పాత్రలో కనిపించనున్నాడు.

Last Updated : Oct 27, 2020, 07:07 PM IST
RRR NTR Teaser Spoof: కుర్రాళ్లు అదరగొట్టేశారు.. RRR నిర్మాత ఫిదా

దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న సినిమా ‘ఆర్ఆర్ఆర్’. యంగ్ టైగర్ ఎన్టీఆర్ తెలంగాణ గొండు ముద్దుబిడ్డ కొమురం భీమ్ పాత్రను పోషిస్తుండగా, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ విప్లవ తేజం, మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పాత్రలో కనిపించనున్నాడు. అయితే ఈ సినిమాకు సంబంధించి కొన్ని నెలల తర్వాత అప్పుడప్పుడూ అప్‌డేట్స్ ఇస్తుంటుంది మూవీ యూనిట్. 

 

ఈ క్రమంలో ఇటీవల గొండు బెబ్బులి కొమురం భీమ్ జయంతిని పురస్కరించుకుని RRR సినిమాలో ఎన్టీఆర్ భీమ్ లుక్‌కు సంబంధించిన (Ramaraju For Bheem) ఓ వీడియోను రిలీజ్ చేయడం అది సోషల్ మీడియాలో ట్రెండ్ క్రియేట్ చేసింది. రామ్ చరణ్ వాయిస్ ఓవర్‌తో తెలుగుతో పాటు సినిమా డబ్బింగ్ చేస్తున్న అన్ని భాషలలో రిలీజ్ చేశారు. ఎన్టీఆర్ భీమ్ లుక్ నెటిజన్లను ఎంతలా ఆకట్టుకుందంటే.. కొందరు టీనేజ్ కుర్రాళ్లు ఆర్ఆర్ఆర్ సినిమాలోని భీమ్ లుక్ వీడియోను తమదైన రేంజ్‌లో రిక్రియేట్ చేశారు. సినిమాలో చూపించినట్లుగా వీడియో తయారుచేయడంతో నిర్మాణ సంస్థ డీవీవీ ఎంటర్‌టైన్మెంట్ దీనిపై స్పందించింది.   RRR Movie NTR teaser: ‘వాడి పొగరు ఎగిరే జెండా’.. గర్జించిన కొమరం భీమ్‌

 

 

ఎన్టీఆర్ టీజర్ స్పూఫ్ అద్భుతంగా చేశారంటూ కుర్రాళ్లను ప్రశంసించారు. రామరాజు, భీమ్ వీడియోలు మరిన్ని చేయాలని కోరుతూ ప్రోత్సహించడం విశేషం. ఇలాంటి మరెన్నో సూపర్ వీడియోలు తమకు కనిపిస్తే మా ఛానల్‌లో ఇలా షేర్ చేసి అందరికీ చూపిస్తామని ట్వీట్‌లో పేర్కొన్నారు.  

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

Trending News