Drushyam 2 trailer is out: మలయాళంలో హిట్టయైన దృశ్యం-2ను.. తెలుగులో అదే పేరుతో విక్టరీ వెంకటేష్, మిన జంటగా రిమేక్ చేశారు. ఈ సినిమా ట్రైలర్‌ను చిత్ర యూనిట్ సోమవారం విడుదల చేసింది.
దృశ్యం మొదటి భాగానికి కొనసాగింపుగా ఈ సినిమా కొనసాగున్నట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. ఆరేళ్ల క్రితం ఓ హత్య కేసు నుంచి బయట పడ్డ రాంబాబు ఫ్యామిలీని మళ్లీ అదే టెన్షన్ వెంటాడుతున్నట్లు ట్రైలర్లో చూపించారు.
ఓ వైపు రాంబాబు (వెంకటేష్) సినిమా తీసే బిజీలో ఉంటాడు.. మరో వైపు పాత కేసును ఓపెన్ చేసి పోలీసులు ఎంక్వైరీ స్టార్ట్ చేస్తున్నట్లు ఇందులో ట్రేలర్ ద్వారా తెలుస్తోంది.
రాంబాబు కేస్ ఏమైంది? రాంబాబును పోలీసులు ఏం చేయలేరంటూ.. రాంబాబు చట్టుపక్కల వాళ్లు మాట్లాడుకోవడం ట్రైలర్లో కనిపిస్తుంది.
Also read: Gangubai Kathiawadi Release: ‘ఆర్ఆర్ఆర్’ మూవీ కోసం సంక్రాంతి రేసు నుంచి తప్పుకున్న ‘గంగూబాయి’
ఆసక్తి రేపుతున్న రీ ఇన్వెస్టిగేషన్ డైలాగ్స్..
ఇదే సమయంలో రాంబాబు సినిమా తీసే బిజీలో ఉన్నాడు.. పోలీసులకు దొరకనన్న ఓవర్ కాన్ఫడెన్స్‌తో ఉన్నాడు. సినిమా తీసేలోపు మనమే వాడికి సినిమా చూపిద్ధాం అంటూన్న డైలాగ్స్ సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి.
మరోవైపు రాంబాబు.. భయపడకు మీ ముగ్గురికి ఏం జరగనివ్వను (భార్య, ఇద్దరు కూతుళ్లను ఉద్దేశించి) అంటాడు. ఈ డైలాగ్స్ అన్నీ సినిమాపై హైప్ పెంచుతున్నాయి.
మరి పాత కేసు విచారణలో మళ్లీ రాంబాబు ఫ్యామిలీకి ఎలాంటి చిక్కులు ఎదురయ్యాయి. వాటిని కుటుంబం అంతా ఎలా ఎదుర్కొంది? ఈ సారి రాంబాబు మర్డర్ చేసిన యువకుడిని ఎక్కడ పాతిపెట్టింది చెప్పేస్తాడా? ఈ ప్రశ్నలన్నిటికి సమాధానం తెలియాలంటే.. నవంబర్ 25 వరకు ఆగాల్సిందే. ఆ రోజు ఈ సినిమా అమెజాన్ ప్రైమ్‌లో రిలీజ్ చేయనున్నారు.
మళయాలంలో మోహన్‌లాల్ ప్రధాన పాత్రదారుగా ఈ సినిమాను తెరకెక్కించారు. మాతృకకు దర్శకత్వం వహించిన జీతూ జోసెఫ్ ఈ సినిమానూ రూపొందించారు.
Also read: Suriya: హీరో సూర్య పెద్ద మనస్సు- అమెకు రూ.10 లక్షల ఫిక్స్డ్ డిపాజిట్!
Also read: Natu natu song dance viral videos: నాటు నాటు పాటకు ట్రాఫిక్ సిగ్నల్‌లో నాటు స్టెప్పులు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook