ఆర్జీవీ నెక్ట్స్ మూవీ ‘Allu’.. మళ్లీ రచ్చ రచ్చే!

పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌ను లక్ష్యంగా చేసుకుని పవర్ స్టార్ మూవీని తెరకెక్కించి రామ్ గోపాల్ వర్మ (RGV).. తన లేటెస్ట్ మూవీ పేరు అల్లు (RGV Movie Titled As Allu) అని ప్రకటించి మరో వివాదానికి ఆజ్యం పోస్తున్నాడు.

Last Updated : Aug 2, 2020, 12:03 PM IST
ఆర్జీవీ నెక్ట్స్ మూవీ ‘Allu’.. మళ్లీ రచ్చ రచ్చే!

దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma) మరో వివాదానికి కేంద్ర బిందువు అవుతున్నాడు. లాక్‌డౌన్ సమయంలో క్లైమాక్స్, నగ్నం సినిమాలు అందించిన ఆర్జీవీ(RGV)... పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌ను లక్ష్యంగా చేసుకుని పవర్ స్టార్ మూవీని తెరకెక్కించి తన ఆర్జీవీ వరల్డ్ థియేటర్‌ (Rgv World Theatre)లో విడుదల చేయడం తెలిసిందే. అప్సరా రాణితో థ్రిల్లర్, మరోవైపు మర్డర్ మూవీతో బిజీగా ఉన్న వర్మ తన కొత్త ప్రాజెక్ట్ పేరు అల్లు (Movie Name Allu) అని ప్రకటించాడు. Sushant Case: రియా చక్రవర్తి జాడ దొరకడం లేదు: బిహార్ డీజీపీ

ఈ మేరకు సినిమా వివరాలపై వరుస ట్వీట్లు చేశాడు. ఓ స్టార్ హీరో కుటుంబానికి ఆయన బామ్మర్ది ఏం చేశాడన్న ఫిక్షన్ స్టోరీనే అల్లు (RGV's New Film Titled as Allu) అంటున్నాడు. జన రాజ్యం పార్టీ పేరు ప్రకటించడంతో సినిమా కథ మొదలంటూ మరో బాంబు పేల్చాడు వర్మ. సినిమాకు అల్లు అనే టైటిల్ పెట్టడానికి గల కారణాలు వెల్లడించాడు. పెళ్లికి ముందే గర్భం దాల్చిన నటీమణులు వీరే..

‘“అల్లు” అనే టైటిల్  ఎందుకు పెట్టామంటే ఇందులోని మెయిన్ క్యారెక్టర్ రకరకాల ప్లాన్స్ “అల్లు”తూ వుంటాడు. తనకి మంచి జరగాలి అంటే ప్లాన్ అల్లు, మరొకడికి చెడు జరగాలి అంటే ప్లాన్ అల్లు అనే స్ట్రాటర్జీ తో ప్లాన్ ల అల్లుడు లో ఆరితేరిపోయి, పెద్ద స్టార్ అయిన తన బావ  పక్కనే ఉంటూ తన మైలేజీ పడిపోకుండా ఉండటానికి తమ ఇంటి “అల్లు”డు అని కూడా మర్చిపోయి ఎప్పటికప్పుడు ప్లాన్లు అల్లుతూ వుంటాడని’ వర్మ ట్వీట్ చేశాడు.  వర్మ సెక్సీ హీరోయిన్ Apsara Rani Hot Stills వైరల్ 

‘అందరితో తనని "ఆహా" అనిపించుకోవటానికి తనకి కావాల్సిన వాళ్ళకే  మంచి జరిగేలా చెప్పి ప్లాన్ ల మీద ప్లాన్ అల్లుకుపోతూ ఉండే  ఒక పెద్ద అల్లికల మాస్టర్ కథే ఈ "అల్లు" అంటూ సినిమా కథాంశం ఏంటి, ఎలా ఉంటుందో చెప్పకనే చెప్పేశాడు దర్శకుడు వర్మ. అల్లు సినిమాలోని క్యారెక్టర్స్ పేర్లను సైతం వెల్లడించాడు. ఆ పేర్లు వింటే మైండ్ బ్లాంక్ అవ్వడం ఖాయమంటున్నారు సినీ విశ్లేషకులు.
RGV ‘నగ్నం’ హీరోయిన్ స్వీటీ Hot Photo

Trending News