Gunasekhar Daughter Engagement : డైరెక్టర్ గుణ శేఖర్ కూతురి ఎంగేజ్మెంట్.. నీలిమ ఫోటో వైరల్

Director Gunasekhar Daughter డైరెక్టర్ గుణ శేఖర్ కూతురు నీలిమ గుణ ఎంగేజ్మెంట్ జరిగింది. ఎక్కువ హడావిడి లేకుండా బంధుమిత్రుల సమక్షంలో ఈ నిశ్చితార్థం జరిగినట్టుంది.

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 8, 2022, 03:54 PM IST
  • శాకుంతలంతో నిర్మాతగా నీలిమ గుణ
  • దర్శకుడి కూతురు నిర్మాతగా
  • నీలిమ గుణ ఎంగేజ్మెంట్ పిక్ వైరల్
Gunasekhar Daughter Engagement : డైరెక్టర్ గుణ శేఖర్ కూతురి ఎంగేజ్మెంట్.. నీలిమ ఫోటో వైరల్

Neelima Guna Engagement : టాలీవుడ్ దర్శకుడు గుణశేఖర్‌ (Guna Sekhar) ఇంట్లో శుభకార్యం జరిగింది. గుణ శేఖర్ కుమార్తె నీలిమ గుణకు నిశ్చితార్థం జరిగింది. త్వరలోనే వివాహాం చేసుకోబోతోంది. ఈక్రమంలోనే కొత్త జీవితంలోకి అడుగుతుపెడుతున్నట్టుగా, ఏడడుగుల బంధంలోకి అడుగుపెడుతున్నట్టుగ నీలిమ గుణ పోస్ట్ వేసింది. ప్రస్తుతం నీలిమ గుణ ఫోటో నెట్టింట్లో వైరల్ అవుతోంది.

 హైదరాబాద్‌లోని ఓ ఫంక్షన్‌ హాల్‌లో రవి ప్రక్యాతో నీలిమ నిశ్చితార్థం వేడుకగా జరిగినట్టు తెలుస్తోంది. ఈ వేడుకకు కుటుంబసభ్యులు, సినీ ప్రముఖులు హాజరయ్యారు. కాబోయే భర్తను పరిచయం చేస్తూ నీలిమ సోషల్‌ మీడియాలో ఓ పోస్ట్‌ పెట్టింది. ‘‘నా జీవితకాల ప్రయాణం మొదలైంది’’ అని చెప్పుకొచ్చింది.

 

దీంతో ఆమెకు నెటిజన్లు అభినందనలు తెలుపుతున్నారు. డైరెక్టర్ మెహర్ రమేష్ కూడా ట్వీట్ వేశాడు. కంగ్రాట్స్ చెప్పాడు. దీంతో సినిమా రిలేటెడ్ పీఆర్వోలు కూడా నీలిమకు కంగ్రాట్స్ చెబుతున్నారు. సినిమాలపై ఉన్న ఆసక్తితో తండ్రిబాటలోనే అడుగులు వేసిన నీలిమ నిర్మాతగా మారింది. గుణశేఖర్‌ తెరకెక్కించిన ‘రుద్రమ దేవి’కి సహ నిర్మాతగా వ్యవహరించిన నీలిమ.. ఇప్పుడు ‘శాకుంతలం’ చిత్రానికి నిర్మాతగా ఎంట్రీ ఇవ్వబోతోంది.

శాకుంతలం సినిమాకు నీలిమే అంతా తానై చూసుకుందట. మెయిన్ లీడ్ కారెక్టర్లను ఎంచుకోవడంలో నీలిమ పాత్రే ఉందట. ఈ మూవీ షూటింగ్ ఎప్పుడో ముగిసినా కూడా ఇంకా విడుదల అవ్వడం లేదు. విజువల్స్, వీఎఫ్‌ఎక్స్ కోసం భారీగానే టైం కేటాయిస్తున్నట్టు తెలుస్తోంది.

Also Read: Godfather Collections: మూడు రోజులైనా ఖైదీ నెం.150 మొదటి రోజు కలెక్షన్స్ బీట్ చేయలేకపోయిన గాడ్ ఫాదర్!

Also Read: Sreeleela Mother: కుమార్తెకు తలనొప్పిగా మారిన శ్రీలీల తల్లి.. వరుస కేసులతో !

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook 

Trending News