Waltair Veerayya Review : వాల్తేరు వీరయ్యపై చిరంజీవి రివ్యూ.. సినిమా చూసి ఆ ఒక్క మాట చెప్పేశాడట!

Waltair Veerayya Review వాల్తేరు వీరయ్య సినిమాను రెండ్రోజుల క్రితమే చిరంజీవి చూశాడట. ఈ విషయాన్ని దర్శకుడు తాజాగా బయటపెట్టేశాడు. సినిమా చూసిన చిరంజీవి డబుల్ బ్లాక్ బస్టర్ అని రివ్యూ ఇచ్చేశాడట. మరి చిరు మాటలు నిజం అవుతాయో లేదో చూడాలి.

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 25, 2022, 06:34 PM IST
  • జనవరి 13న రాబోతోన్న వాల్తేరు వీరయ్య
  • మూడో పాట కోసం సిద్దమైన చిత్రయూనిట్
  • వాల్తేరు వీరయ్యను చూసిన చిరు రియాక్షన్ ఇదే
Waltair Veerayya Review : వాల్తేరు వీరయ్యపై చిరంజీవి రివ్యూ.. సినిమా చూసి ఆ ఒక్క మాట చెప్పేశాడట!

Chiranjeevi Review on Waltair Veerayya చిరంజీవి హీరోగా రాబోతోన్న వాల్తేరు వీరయ్య మంచి అంచనాలే ఉన్నాయి. వాల్తేరు వీరయ్య అనే టైటిల్ మీద చిరు ఒకప్పుడు అసంతృప్తిని చేసినట్టుగా టాక్ వచ్చిన సంగతి తెలిసిందే. ఏమైందో ఏమో గానీ అదే టైటిల్‌ను చిరంజీవి ఓకే చేశాడు. ఇక ఇప్పుడు అయితే వాల్తేరు వీరయ్య టైటిల్ అందరికీ అలవాటైంది. వాల్తేరు వీరయ్య నుంచి చిరంజీవి, రవితేజ గ్లింప్స్ వచ్చాయి. వాటికి నెట్టింట్లో మంచి స్పందన వచ్చింది. ఇప్పటి వరకు విడుదల చేసిన రెండు పాటలు కూడా బాగానే క్లిక్ అయ్యాయి.

వాల్తేరు వీరయ్య నుంచి వచ్చిన బాస్ పార్టీ, చిరంజీవి శ్రీదేవీ పాటలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. మూడో పాట కోసం ముహూర్తాన్ని ఫిక్స్ చేశారు. రేపు వీరయ్య టైటిల్ సాంగ్ రాబోతోంది. అయితే వాల్తేరు వీరయ్య టీం తాజాగా మీడియాతో మాట్లాడింది. వీరయ్యకు సంబంధించిన విశేషాలను పంచుకున్నారు. ఈ క్రమంలో దర్శకుడు మాట్లాడుతూ అనేక విషయాలను చెప్పుకొచ్చాడు.

ఈ సినిమాను హిందీలోనూ రిలీజ్ చేయబోతోన్నట్టుగా చెప్పుకొచ్చాడు. అయితే ఈ సినిమాను చిరంజీవి రెండ్రోజుల క్రితం చూశాడట. సినిమాను చూసిన అనంతరం చిరంజీవి ఒకే ఒక మాట చెప్పేశాడట. ఇది కచ్చితంగా డబుల్ బ్లాక్ బస్టర్ హిట్ అని అనేశాడట. మరి ఇదే తీర్పును జనాలు ఇస్తారో లేదో చూడాలి. అయితే చిరంజీవి సినిమాలకు నష్టాలు మాత్రం తప్పడం లేదన్న సంగతి తెలిసిందే.

ఆచార్య ఈ ఏడాదికి బిగ్గెస్ట్ డిజాస్టర్‌గా నిలిచింది. గాడ్ ఫాదర్ సినిమా కూడా డిజాస్టర్‌గానే నిలిచింది. కాకపోతే ఆచార్య కంటే తక్కువ నష్టాలనే మిగిల్చింది. మరి వాల్తేరు వీరయ్య అయినా నిర్మాతలకు లాభాలను అందిస్తుందా? లేదా? అన్నది చూడాలి. అసలే బరిలోకి బాలయ్య వీర సింహా రెడ్డి అంటూ దిగుతున్నాడు. ఈ సంక్రాంతి పోటీలో చిరు, బాలయ్యలో ఎవరు గెలుస్తారా? అని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Also Read : Rakul Preet Lover : సాంటా ఇచ్చిన గిఫ్ట్ అదే.. లవర్‌కు రకుల్ ప్రీత్ స్పెషల్ విషెస్

Also Read : Sekhar Master : శేఖర్ మాస్టర్ ప్రయోగం.. సిరి, శ్రీహాన్‌లపై డబ్బులు పెడితే వస్తాయా?

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News