Ashu Reddy Dubai Visit: అషు రెడ్డి వెనకున్న ఆ బాలీవుడ్ హీరో ఎవరో గుర్తుపట్టారా?

Ashu Reddy Dubai Visit: బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షోతో ఫేమస్ అయిన అషు రెడ్డి.. ఆ తర్వాత అనేక సినిమాల్లో నటించడం సహా టెలివిజన్ షోలలో బిజీగా గడుపుతుంది. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే అషు రెడ్డి.. తనకు సంబంధించిన ఫొటోలను తరచూ పోస్ట్ చేస్తుంటుంది. ఇటీవలే దుబాయి వెళ్లిన అషు రెడ్డి.. ఓ బాలీవుడ్ హీరోను కలిసింది. ఇంతకీ ఆ హీరో ఎవరో తెలుసుకోవాలనుందా?  

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 25, 2022, 12:30 PM IST
    • హాలీ డే ట్రిప్ కోసం దుబాయి వెళ్లిన అషు రెడ్డి
    • మేడమ్ టూసాడ్స్ ను సందర్శించిన నటి
    • బాలీవుడ్ హీరో రణ్ బీర్ కపూర్ తో పోజులిచ్చిన బ్యూటీ
Ashu Reddy Dubai Visit: అషు రెడ్డి వెనకున్న ఆ బాలీవుడ్ హీరో ఎవరో గుర్తుపట్టారా?

Ashu Reddy Dubai Visit: సోషల్ మీడియా ద్వారా పాపులారిటీ పెంచుకున్న అషు రెడ్డి.. ఆ తర్వాత బిగ్ బాస్ హౌస్‌లో అడుగుపెట్టి తన ఫాలోయింగ్ అమాంతం పెంచుకుంది. ఈ మధ్యకాలంలో అదే సోషల్ మీడియా వేదికగా నిత్యం అభిమానులకు రొమాంటిక్ టచ్ ఇస్తోంది. జూనియర్ సమంతగా పేరొందిన ఈ బ్యూటీ డిఫరెంట్ డిఫరెంట్ ఫోజులతో కుర్రకారును అట్రాక్ట్ చేస్తోంది. 

ఫొటో షూట్స్‌లో కూడా తన వైవిధ్యాన్ని చూపెడుతూ దానికి యాప్ట్ అయ్యేలా ట్యాగ్ లైన్స్ రాసేస్తోంది అషు రెడ్డి. మొన్నటికి మొన్న ఓ డిఫరెంట్ పోజుతో ట్రోలింగ్‌కి గురైన అషు.. నిన్న తన థైస్ గ్లామర్‌పై నెటిజన్ల కన్ను పడేలా చేసుకుంది. 'వేడి నీ కళ్లలో ఉంది, నా తొడల్లో కాదు' అంటూనే గ్లామర్ ట్రీట్ ఇచ్చింది.

దుబాయి వెకేషన్

ఇటీవలే వెకేషన్ కోసం దుబాయి వెళ్లిన అషు రెడ్డి.. సరదాగా సమయాన్ని గడుపుతోంది. ఈ క్రమంలో దుబాయిలోని మేడమ్ టూసాడ్స్ కు వెళ్లిన అషు రెడ్డి.. సెలెబ్రిటీల మైనపు బొమ్మలను సందర్శించిన ఈ భామ.. అక్కడ కొన్ని ఫొటోలను దిగింది.

 

ఈ క్రమంలో తాను ఎంతో అభిమానించే బాలీవుడ్ హీరో రణ్ బీర్ కపూర్ తో పోజులిచ్చింది. ఈ ఫొటోలను ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తూ.. సారీ అలియా భట్ అని రాసుకొచ్చింది. దీనిపై నెటిజన్లు సరదాగా కామెంట్స్ చేస్తున్నారు. 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Ashu Reddy❤️ (@ashu_uuu)

టెలివిజన్ షోలతో బిజీ

హ్యపీ డేస్ అనే టీవీ షోతో యాంకర్ గా మారిన అషు రెడ్డి.. ఆ తర్వాత అనేక టెలివిజన్ షోలలో పాల్గొంది. ఈ మధ్య యాంకర్ రవితో కలిసి ఓ షోలో హోస్ట్‌గా తన ప్రతిభను చాటుకొనే ప్రయత్నం చేసింది. ఆ తర్వాత 'కామెడీ స్టార్స్' లాంటి షోలు, 'జబర్దస్త్', 'శ్రీదేవి డ్రామా కంపెనీ' లాంటి టెలివిజన్ కార్యక్రమాలలో తరచు కనిపిస్తుంటుంది. వీటితో పాటు అనేక సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది.  

Also Read: SS Thaman on Bheemla Nayak: పవన్ కల్యాణ్ కెరీర్ లోనే ది బెస్ట్ మూవీ భీమ్లా నాయక్: తమన్

Also Read: Ketika Sharma Photos: హాట్ హాట్ అందాలతో ఊరిస్తోన్న ఢిల్లీ బ్యూటీ కేతికా శర్మ

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News