Pawan Kalyan: పవన్ కల్యాణ్​ హిట్టు సినిమాల్లో రీమేక్​లే ఎక్కువట!

Pawan Kalyan: పవన్ కల్యాణ్​ కెరీర్​ను మలుపుతిప్పిన సినిమాలు అంటే టక్కున గుర్తొచ్చేవి తమ్ముడు, గబ్బర్​ సింగ్​ వంటి పేర్లు గుర్తొస్తాయి. కానీ పవన్ కల్యాణ్​ హిట్టు సినిమాల్లో ఎక్కువ రీమేక్​లే అని తెలుసా?

Written by - ZH Telugu Desk | Edited by - ZH Telugu Desk | Last Updated : Mar 4, 2022, 12:23 PM IST
  • పవన్​ కల్యాణ్​ కెరీర్​కు రీమేక్​ల దన్ను
  • రీమేక్​ సినిమాతోనే సినీ రంగ ప్రవేశం
  • ప్రతి సినిమాలోనూ పవన్​ ప్రత్యేకత!
Pawan Kalyan: పవన్ కల్యాణ్​ హిట్టు సినిమాల్లో రీమేక్​లే ఎక్కువట!

Pawan Kalyan: పవన్​ కల్యాణ్​ ఈ పేరు వింటే ఫ్యాన్స్​కు పూనకాలే. పవన్ సినిమా రిలీజ్ అయ్యిందంటే.. థియేటర్ల దగ్గర సందడి మామూలుగా ఉండదు. సినిమాలతో ఎంత మంది ఆయన్ను ఇష్టపడతారో.. నిజ జీవితంలో అంతకన్నా ఎక్కువ మంది ఆయనకు ఫ్యాన్స్ ఉన్నారు.

ఆయన నటించిన సినిమాలు హిట్టయినా.. కాకపోయినా.. ఫ్యాన్స్​ మాత్రం ఆయనకు బ్రహ్మరథం పడతారు. ఆ మధ్యకాలంలో ఆయనకు వరుసగా ఫ్లాప్​లు పలకరించినా గబ్బర్​ సింగ్ సినిమాతో మళ్లీ ఫ్యాన్స్​లో జోష్​ నింపారు. ఆ తర్వాత అత్తారింటికి దారేది సినిమాతో ఘన విజయం సాధించారు. తాజాగా భీమ్లా నాయక్ సినిమాతో మరోసార్​ బ్లాక్​ బాస్టర్ హిట్​ కొట్టారు.

అయితే పవన్ కల్యాణ్​ సినీ ప్రస్థానం చూస్తే.. స్ట్రెయిట్​ సినిమాలతో పోలిస్తే.. రీమేక్​లతోనే రికార్డులు సృష్టించడం విశేషం. మరి పవన్ కల్యాణ్​ మొత్తం సినిమాల్లో రీమేక్​లు ఎన్నో చూద్దాం.

పవన్ కల్యాణ్​ హీరోగా పరిచయమైన సినిమా అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి. 1996లో ఈ మూవీ వచ్చింది. ఇది హిందీ సినిమా అయిన 'ఖాయ్​మత్​ సే ఖాయ్​మత్​ తక్'.

ఆ తర్వాత వచ్చిన గోకులంలో సీత, సుస్వాగతం వంటి సినిమాలు కూడా రీమేక్​లే కావడం గమనార్హం. అయితే ఇవి రీమేక్​లు అయినా పవన్ కల్యాణ్​ కెరీర్​ బిల్డ్ చేసుకోవడంలో చాలా ఉపయోగపడ్డాయి.

ఇక తమ్ముడు, ఖుషి, అన్నవరం, తీన్మార్​, గబ్బర్​ సింగ్​, కాటమరాయుడు, గోపాల గోపాల, అజ్ఞాతవాసి, వకీల్​ సాబ్​ సహా ఇటీవల రిలీజ్​ అయిన భీమ్లా నాయక్​ మూవీస్​ రీమేక్​లే.

నిజానికి ఖుషి మూవీ స్టోరీ పవన్ కల్యాణ్​ వద్దకే వచ్చింది. అయితే వేరే సినిమాల్లో బిజీగా ఉండటం వల్ల అనుకున్న సమయానికి తెరకెక్కలేదు. దీనితే అదే స్టోరీని డైరక్టర్​ తమిళ్​లో విజయ్​ని హీరోగా పెట్టి తీశారు. అక్కడ ఆ సినిమా విడుదలైన కొన్ని రోజులకే.. తెలుగులో పవన్ కల్యాణ్​ హీరోగా, భూమిక హీరోయిన్​గా ఖుషి తెరకెక్కి సూపర్ హిట్ విజయాన్ని అందుకుంది. అయితే తొలుత తమిళంలో ఈ సినిమా విడుదలైన కారణంగా టెక్నికల్​గా ఇది రీమేకనే చెబుతున్నారు విశ్లేషకులు.

ఇక పవన్​ కల్యాణ్​ తన అన్నయ్య, మెగా స్టార్ చిరంజీవి సినిమాల్లో గెస్ట్ రోల్స్​ కూడా చేశారు. శంకర్​ దాదా ఎంబీబీఎస్​, శంకర్​ దాదా జిందాబాద్ సినిమాల్లో కొన్ని క్షణాలపాటు కనిపించారు. ఆ రెండు సినిమాలు కూడా రీమేక్​లే కావడం గమనార్హం.

రీమేక్​ కాకుండా రికార్డు స్థాయి కలెక్షన్లతో బ్లాక్​ బాస్టర్​గా నిలిచిన పవన్​ కల్యాణ్​ సినిమా అత్తారింటికి దారేది. ఇక పవన్ కల్యాణ్​ కెరీర్​లో బెస్ట్​ మూవీస్​ గురించి చర్చ వస్తే.. ఖుషీ, తమ్ముడు, బద్రీ వంటి సినిమాలు ఆయనను స్టార్​ హీరోని చేశాయనడంలో సందేహం లేదు.

ఇక ప్రస్తుతానికి వస్తే.. పవన్ కల్యాణ్​ ప్రస్తుతం వినోదయ సీతం, థేరి వంటి సినిమాల రీమేక్​లలో నటించే అవకాశముంది.

Also read: Kareena and Kajol: సుదీర్ఘ కాలం తరువాత కలుసుకున్న కరీనా, కాజోల్, కౌగిలించుకుని, ముద్దులు కూడా

Also read: Bigg Boss Telugu OTT: బిగ్‌బాస్ నాన్‌స్టాప్‌లో ఎలిమినేట్ అయ్యేది మళ్లీ సరయూనేనా

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News