Deepthi Sunaina : బ్లాక్ చేశాడంటూ ఎమోషనల్.. వేడుకుంటోన్న దీప్తి సునయన

Deepthi Sunaina Blocking దీప్తి సునయన ఎప్పుడూ ఏదో ఒక వార్తతో సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంటుంది. దీప్తి సునయన చేసే అల్లరికి నెటిజన్లు ఫిదా అవుతుంటారు. అయితే ఒక్కోసారి మాత్రం దీప్తి సునయన చిరాకు పుట్టించేలా చేస్తుంటుంది.

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 20, 2023, 07:54 AM IST
  • నెట్టింట్లో దీప్తి సునయన సందడి
  • షన్ను దీప్తిలపై అభిమానుల కామెంట్లు
  • బ్లాక్ చేశాడంటూ దీప్తి సునయన ఎమోషనల్
Deepthi Sunaina : బ్లాక్ చేశాడంటూ ఎమోషనల్.. వేడుకుంటోన్న దీప్తి సునయన

Deepthi Sunaina Blocking దీప్తి సునయన ఇప్పుడు సింగిల్ లైఫ్‌ను ఎంజాయ్ చేస్తోన్న సంగతి తెలిసిందే. ఎలాంటి రిలేషన్‌లోనూ దీప్తి సునయక కనిపించడం లేదు. షన్నుని బ్లాక్ చేసి, పబ్లిక్‌గా బ్రేకప్ నోట్‌ను షేర్ చేసింది దీప్తి సునయన. బిగ్ బాస్ ఇంట్లో షన్ను వేసిన వేషాలకు దీప్తి సునయన హర్ట్ అయినట్టుగా ఉంది. అందుకే బిగ్ బాస్ షో ముగిసి రన్నర్‌గా షన్ను బయటకు వచ్చిన తరువాత దీప్తి సునయన బ్రేకప్ చెప్పేసింది. మళ్లీ కలిసి పోతారేమో అని అంతా అనుకున్నారు. కానీ ఇంత వరకు అలాంటిదేమీ జరగలేదు.

ఇక షన్ను అయితే దీప్తి సునయన కోసం ఇంకా ఎదురుచూస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇవన్నీ పక్కన పెడితే దీప్తి సునయన మాత్రం ఇప్పుడు తన లైఫ్‌ను ఫుల్లుగా ఎంజాయ్ చేస్తున్నట్టుగా కనిపిస్తోంది. దీప్తి సునయన తన అభిమానులతో ఎప్పుడూ టచ్‌లోనే ఉంటుంది. దీప్తి సునయన తన అభిమానులతో చిట్ చాట్ చేస్తూ వారు అడిగే ప్రశ్నలకు సమాధానం ఇస్తుంటుంది.

ఎక్కువగా ఆమె స్కిన్ కేర్, హెయిర్ కేర్‌కు సంబంధించిన ప్రశ్నలు వస్తుంటాయి. వాటికి దీప్తి సునయన ఓపిగ్గా తన సీక్రెట్లను చెబుతుంటుంది. తాజాగా పెట్టిన ముచ్చట్లలోనూ అవే ప్రశ్నలు వచ్చాయి. తన స్కిన్ అంత మెరిసిపోవడానికి కారణం చెప్పింది. అయితే ఈ క్రమంలోనే తన ఫ్రెండ్‌ తనను బ్లాక్ చేశాడంటూ సోషల్ మీడియాలో చెప్పుకొచ్చింది.

యూట్యూబ్ నటుడు, కారెక్టర్ ఆర్టిస్ట్ అయిన మన్నె ధనుష్ తనను బ్లాక్ చేశాడంటూ.. అన్ బ్లాక్ చేయమని చెప్పండి అంటూ దీప్తి సునయన తన అభిమానులను కోరింది. మరి ఈ ఇద్దరి మధ్య ఏం జరిగింది. ఎందుకు దీప్తి సునయనను బ్లాక్ చేశాడు? అసలు వీరిద్దరి మధ్య ఉన్న మ్యాటర్ ఏంటన్నది తెలియడం లేదు. దీప్తి షన్ను మళ్లీ కలిస్తే చూడాలని ఇరువురి అభిమానులు కోరుకుంటున్నారు. ఇది జరుగుతుందా? లేదా? అన్నది కాలమే చెప్పాలి.

Also Read:  Allu Arjun Telugu Pride : బన్నీ పెట్టిన మంట.. ట్విట్టర్‌లో ఫ్యాన్ వార్.. రెచ్చిపోతోన్న మెగా, నందమూరి ఫ్యాన్స్

Also Read: Anasuya Bharadwaj Family : ఫ్యామిలీతో కలిసి చిల్.. వీకెండ్‌లో అనసూయ సందడి.. పిక్స్ వైరల్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News