Comedian vivek's health condition: గుండెపోటుతో ఆస్పత్రిలో చేరిన వివేక్.. తాజా హెల్త్ బులెటిన్ విడుదల

Comedian vivek's health condition: ప్రముఖ తమిళ కమెడియన్ వివేక్ గుండెపోటుతో ఇవాళ ఉదయం 11 గంటలకు చెన్నైలోని సిమ్స్ (SIMS) ఆస్పత్రిలో చేరిన సంగతి తెలిసిందే. నిన్న గురువారం కొవిడ్-19 వ్యాక్సిన్ తీసుకున్న వివేక్ ఇవాళ ఉన్నట్టుండి గుండెపోటుతో (Heart attack) ఆస్పత్రిలో చేరడం ఆయన అభిమానులను తీవ్ర ఆందోళనకు గురిచేసింది. తాజాగా వివేక్ ఆరోగ్య పరిస్థితిపై ఎస్ఆర్ఎం ఇనిస్టిట్యూట్ ఫర్ మెడికల్ సైన్సెస్ ఓ హెల్త్ బులెటిన్ (Health bulletin) విడుదల చేసింది.

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 16, 2021, 07:12 PM IST
  • గుండెపోటుతో ఆస్పత్రిలో చేరిన ప్రముఖ తమిళ కమెడియన్ వివేక్.
  • కొవిడ్-19 వ్యాక్సిన్ తీసుకున్న వివేక్‌కి ఇవాళ ఉన్నట్టుండి గుండెపోటు.
  • వివేక్ తాజా ఆరోగ్య పరిస్థితిపై Health bulletin విడుదల చేసిన సిమ్స్ ఆస్పత్రి (SIMS)
Comedian vivek's health condition: గుండెపోటుతో ఆస్పత్రిలో చేరిన వివేక్.. తాజా హెల్త్ బులెటిన్ విడుదల

Comedian vivek's health condition: ప్రముఖ తమిళ కమెడియన్ వివేక్ గుండెపోటుతో ఇవాళ ఉదయం 11 గంటలకు చెన్నైలోని సిమ్స్ (SIMS) ఆస్పత్రిలో చేరిన సంగతి తెలిసిందే. నిన్న గురువారం కొవిడ్-19 వ్యాక్సిన్ తీసుకున్న వివేక్ ఇవాళ ఉన్నట్టుండి గుండెపోటుతో (Heart attack) ఆస్పత్రిలో చేరడం ఆయన అభిమానులను తీవ్ర ఆందోళనకు గురిచేసింది. తాజాగా వివేక్ ఆరోగ్య పరిస్థితిపై ఎస్ఆర్ఎం ఇనిస్టిట్యూట్ ఫర్ మెడికల్ సైన్సెస్ ఓ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. ''అపస్మారక స్థితిలో ఉన్న వివేక్‌ని ఆయన కుటుంబసభ్యులు ఆస్పత్రికి తీసుకొచ్చారని, అనంతరం ఆయనకు కొరొనరి ఆంజియోగ్రామ్, ఆంజియోప్లాస్టి జరిగింది'' అని ఆస్పత్రి డైరెక్టర్ విజయ్ కుమార్ ఈ బులెటిన్‌లో పేర్కొన్నారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగానే ఉందని, ఐసియూలో ECMO సహాయంతో అత్యవసర చికిత్స పొందుతున్నారని విజయ్ కుమార్ తెలిపారు. 

Comedian-vivek-health-condition-Comedian-vivek-health-bulletin.jpg

కొవిడ్-19 వ్యాక్సిన్ (COVID-19 vaccine) తీసుకున్న మరునాడు వివేక్‌కి గుండెపోటు రావడంతో ఆ వ్యాక్సిన్‌కి ఈ గుండెపోటుకు ఏమైనా సంబంధం ఉందా అనే కోణంలో అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఇదే విషయంపై సిమ్స్ ఆస్పత్రి స్పందిస్తూ.. ''ఇది కొవిడ్-19 వ్యాక్సిన్ వల్ల ఎదురైన సమస్య కాకపోవచ్చని, దీనిని కార్డియాక్ షాక్‌తో వచ్చే అక్యూట్ కొరొనరి సిండ్రోమ్‌''గా స్పష్టంచేసింది. 

Also read : Pawan Kalyan: టాలీవుడ్ పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్‌కు కరోనా పాజిటివ్, ఆందోళనలో ఫ్యాన్స్

డబ్బింగ్ చిత్రాలతో తెలుగు ఆడియెన్స్‌కి సుపరిచితుడైన వివేక్ గురించి తెలుగు వారికి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈ నేపథ్యంలో వివేక్ అనారోగ్యంతో (Comedian Vivek) ఆస్పత్రిపాలయ్యారనే వార్త ఆయన అభిమానులకు కలవరపాటుకు గురిచేస్తోంది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News