Chiranjeevi Sreeleela : మెగాస్టార్ లైనప్ ఇదేనా?.. శ్రీలీల నటిస్తుందా?

Chiranjeevi New Movies చిరంజీవి ప్రస్తుతం భోళా శంకర్ సినిమాతో బిజీగా ఉన్నాడు. అయితే చిరంజీవి చేతిలో ఈ ఒక్క ప్రాజెక్ట్ మాత్రమే ఉంది. ఇంకా నెక్ట్స్ ప్రాజెక్టులు మాత్రం కన్ఫామ్ చేయలేదు. తాజాగా చిరు నెక్ట్స్ ప్రాజెక్టుల మీద చర్చలు మొదలయ్యాయి. చిరు తదుపరి చిత్రాల గురించి చర్చలు జరుగుతున్నాయి.

Written by - ZH Telugu Desk | Last Updated : May 6, 2023, 09:40 PM IST
  • నెట్టింట్లో మెగాస్టార్ మూవీస్‌పై చర్చలు
  • మెగాస్టార్ కొత్త ప్రాజెక్టులపై రూమర్లు
  • సిద్దు, శ్రీలీల కలిసి నటిస్తారా?
Chiranjeevi Sreeleela : మెగాస్టార్ లైనప్ ఇదేనా?.. శ్రీలీల నటిస్తుందా?

Chiranjeevi New Movies మెగాస్టార్ చిరంజీవి తన నెక్ట్స్ సినిమాల మీద క్లారిటీ ఇవ్వడం లేదు. వాల్తేరు వీరయ్య సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా తన నెక్ట్స్ సినిమాల గురించి కాస్త హింట్ ఇచ్చాడు. తన కూతురు నిర్మాతగా గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్‌లో సినిమా చేస్తున్నాను అని చెప్పుకొచ్చాడు. అంతకు మించిన సమాచారం ఏమీ కూడా బయటపెట్టలేదు. తాజాగా చిరు లైనప్ గురించి కొన్ని రూమర్లు బయటకు వచ్చాయి. అవి ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటున్నాయి.

భోళా శంకర్ తరువాత చిరంజీవి కళ్యాణ్‌ కృష్ణ దర్శకత్వంలో పని చేస్తాడని తెలుస్తోంది. సోగ్గాడే, బంగార్రాజు వంటి ఫ్యామిలీ సినిమాలు తీసి మెప్పించిన కళ్యాణ్‌ కృష్ణతో చిరంజీవి పని చేయనున్నాడనే టాక్ ఇప్పుడు నెట్టింట్లో ట్రెండ్ అవుతోంది. అంతే కాకుండా ఈ సినిమాలో ఓ యువ జంట ఉంటుందట. దానికి సిద్దు జొన్నలగడ్డ, శ్రీలీలను తీసుకోవాలని అనుకుంటున్నారట. ఇక ఈ సినిమాను సుష్మిత కొణిదెల నిర్మించనుందని సమాచారం.

అయితే ఈ సినిమాను శ్రీలీల అంగీకరిస్తుందా? లేదా? అన్నది చూడాలి. ఎందుకంటే ఆమె చేతిలో ఇప్పుడు తొమ్మిది సినిమాలున్నాయి. ఆమె డైరీ అంతా కూడా నిండిపోయి ఉంది. ఇంత బిజీ షెడ్యూల్‌లో ఈ సినిమాకు డేట్స్ కేటాయించగలదా? లేదా? అన్నది అనుమానంగా మారిపోయింది. ఇక చిరంజీవి ఇంకో సినిమా డీటేల్స్ కూడా వైరల్ అవుతున్నాయి. యూవీ క్రియేషన్స్‌లో ఇంకో సినిమా చేయనున్నాడట. ఆ సినిమాకు బింబిసార వశిష్ట దర్శకత్వం వహిస్తాడని టాక్.

Also Read:  Ananya Nagalla : అనన్య తడి అందాలు.. చూస్తే వామ్మో అనాల్సిందే.. అందరి ఫోకస్ అక్కడే

చిరంజీవి నటిస్తోన్న భోళా శంకర్ సినిమా అజిత్ వేదాళంకు రీమేక్ అన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో కీర్తి సురేష్‌, తమన్నాలు నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్‌ కోల్ కత్తాలో జరుగుతోంది. రీసెంట్‌గానే చిరంజీవి, చిత్రయూనిట్ అంతా కూడా కోల్‌కత్తాకు వెళ్లింది. అక్కడ చిరు, తమన్నాల మీద కీలక సన్నివేశాలు షూట్ చేస్తున్నట్టుగా కనిపిస్తోంది. ఆగస్ట్ 9న ఈ సినిమాను రిలీజ్ చేయాలని చిత్రయూనిట్ భావిస్తున్న సంగతి తెలిసిందే.

Also Read:  Naga Chaitanya : పోతుందని తెలిసి కూడా ప్రమోషన్స్ చేయడం కష్టం!.. థాంక్యూపై నాగ చైతన్య

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News