Chiranjeevi Tweet: ఎంతో ఉపశమనాన్నిచ్చింది..ఆ డాక్టర్లకి ఆ భగవంతుడికి కృతజ్ఞతలు!

Chiranjeevi Tweet on Taraka Ratna: తారక రత్న ఆరోగ్య పరిస్థితి మీద మెగాస్టార్ చిరంజీవి స్పందించారు, తారకరత్న త్వరగా కోలుకుంటున్నారు ఇంకా ఏ ప్రమాదం లేదు అనే మాట ఎంతో ఉపశమనాన్ని ఇచ్చింది అంటూ ఆయన ట్వీట్ చేశారు. ఆ వివరాలు

Written by - Chaganti Bhargav | Last Updated : Jan 31, 2023, 10:17 AM IST
Chiranjeevi Tweet: ఎంతో ఉపశమనాన్నిచ్చింది..ఆ డాక్టర్లకి ఆ భగవంతుడికి కృతజ్ఞతలు!

Chiranjeevi Tweet on Taraka Ratna: నందమూరి తారకరత్న ప్రస్తుతానికి బెంగళూరులోని నారాయణ హృదయాలయ అనే ఒక కార్డియాక్ సెంటర్ లో చికిత్స తీసుకుంటున్న సంగతి తెలిసిందే. కొద్ది రోజుల క్రితం నారా లోకేష్ ప్రారంభించిన యువగళం పాదయాత్రలో భాగంగా తారకరత్న కూడా పాల్గొన్నారు. కొద్దిసేపు నడిచిన తర్వాత ఆయన సొమ్మసిల్లి పడిపోవడంతో తొలుత కళ్ళు తిరిగి పడిపోయారని అనుకున్నారు. కానీ తర్వాత కార్డియాక్ అరెస్ట్ అని తెలియడంతో కుప్పంలోని ఆసుపత్రికి తరలించారు.

అక్కడ మెరుగైన వైద్యం అందించిన సరే ఇంటెన్స్ కేర్ యూనిట్లో పెట్టాలని ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా మారుతుంది అనే విషయం తెలుసుకుని బెంగళూరు ముఖ్యమంత్రితో మాట్లాడే గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసి బెంగళూరు తరలించి నారాయణ హృదయాలయ హాస్పిటల్లో చికిత్స అందిస్తున్నారు. తాజాగా ఆయన ఆరోగ్యానికి సంబంధించి ఒక మీడియా బులెటిన్ ను కూడా రిలీజ్ చేసింది హాస్పిటల్ యూనిట్. ప్రస్తుతానికి తారకరత్న ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉందని ఆయనని ఇతర హయ్యర్ సపోర్ట్స్ అలాగే వెంటిలేటర్ సిస్టం మీద పెట్టామని చెప్పుకొచ్చారు.

అలాగే మీడియాలో వస్తున్న అనేక రిపోర్టులను ఖండిస్తూ ఆయనని ఎక్మో సపోర్ట్ మీద పెట్టలేదని వెల్లడించారు. అయితే ఆయన కుటుంబ సభ్యులకు ఎప్పటికప్పుడు ఆయన ఆరొగ్య పరిస్థితి గురించి వివరాలు అందిస్తూనే వచ్చామని ఈ సందర్భంగా డాక్టర్లు వెల్లడించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి విషయంలో ప్రస్తుతానికి ఎలాంటి మార్పులు లేవని, ఒకవేళ ఆయనకు ఇచ్చే చికిత్స మార్చినా సరే మీడియాకి వెల్లడిస్తామని వారు పేర్కొన్నారు.

అయితే తాజాగా తారకరత్న ఆరోగ్య పరిస్థితి గురించి మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. సోదరుడు తారకరత్న త్వరగా కోలుకుంటున్నారు ఇంకా ఏ ప్రమాదం లేదు అనే మాట ఎంతో ఉపశమనాన్ని ఇచ్చింది, నేను త్వరలో పూర్తిస్థాయిలో కోలుకొని ఇంటికి తిరిగి రావాలని కోరుకుంటున్నాను, ఈ పరిస్థితి నుంచి కాపాడిన డాక్టర్లకు భగవంతుడికి కృతజ్ఞతలు అని పేర్కొన్నారు. తారకరత్న నీ జీవితంలో మరింత ముందుకు వెళ్లాలని ఆరోగ్యంతో తిరిగి రావాలని కోరుకుంటున్నాను అంటూ మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ చేశారు.

Also Read: Kailash Kher Attacked: మొన్న మంగ్లీపై ఇప్పుడు కైలాష్ ఖేర్ పై.. బాషపై ప్రేమతో కన్నడిగుల దాడి!

Also Read: Nani's Dasara Teaser Talk:నీయవ్వ గెట్లైతే గట్లే..గుండు గు**లో లేపేద్దాం.. నాని నోట బూతు మాట!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook

 
 

Trending News