Acharya Pre release Business : ఆచార్య మూవీ ప్రి రిలీజ్ బిజినెస్.. తొలి రోజు అంచనాలు ఎంతంటే..

Acharya Pre release Business : మెగాస్టార్ చిరంజీవి, రామ్‌ చరణ్‌ కలిసి నటిస్తున్న మూవీ ఆచార్య. కొరటాల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి. 140 కోట్ల రూపాయల భారీ బడ్జెట్‌తో తెరెకెక్కిన ఈ మూవీ తొలి రోజు రూ.25కోట్లు వసూలు చేస్తుందని అంచనాలున్నాయి.  

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 28, 2022, 06:39 PM IST
  • మే 29న థియేటర్లలో గ్రాండ్‌గా ఆచార్య విడుదల
  • మెగాస్టార్ చిరంజీవి, రామ్‌ చరణ్‌ కలిసి నటిస్తున్న మూవీ
  • తొలి రోజు రూ.25కోట్లు వసూలు చేస్తుందని అంచనా
Acharya Pre release Business : ఆచార్య మూవీ ప్రి రిలీజ్ బిజినెస్.. తొలి రోజు అంచనాలు ఎంతంటే..

Acharya Day1 Collections Expecteation : మెగాస్టార్ చిరంజీవి రాబోయే చిత్రం ఆచార్య సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంది. చిరంజీవి, రామ్‌ చరణ్‌ హీరోలుగా మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ ఆచార్య. కొణిదెల ప్రొడక్షన్స్ కంపెనీ సమర్పిస్తున్న ఈ చిత్రంలో రామ్‌ చరణ్‌ సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రం రేపు 29న థియేటర్లలో గ్రాండ్ గా విడుదల కానుంది.

తెలుగు రాష్ట్రాల్లో చిరు ఆచార్య టిక్కెట్లు హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్నాయి. రామ్ చరణ్, పూజా హెగ్డే ఆచార్యలో అతిథి పాత్రలో కనిపించనున్నారు. ఖైదీ నెం.150లో చరణ్ ఒక పాటలో కనిపించిన తర్వాత చిరంజీవి, చరణ్ మరోసారి స్క్రీన్ స్పేస్‌ను పంచుకోవడంతో ఈ ప్రాజెక్ట్‌పై అంచనాలు భారీగా ఉన్నాయి. ముఖ్యంగా ప్రేక్షకులకు, మెగా అభిమానులకు ఆచార్య విజువల్ ట్రీట్ కానుంది. టిక్కెట్ల అడ్వాన్స్ బుకింగ్‌ను పరిశీలిస్తే, ఆచార్య బాక్సాఫీస్ వద్ద తొలి రోజున రూ. 25 కోట్లు వసూళ్లు రాబట్టనున్నట్లు తెలుస్తోంది.

ఇక ఆచార్య చిత్రం ఇప్పటికే 130కోట్ల రూపాయల మేర ప్రి రిలీజ్ బిజినెస్ చేసింది. థియేట్రికల్ రైట్స్‌లో ఆంధ్రా హక్కులు రూ.52 కోట్లు, నైజాం రూ.38కోట్లు, సీడెడ్ 18 కోట్లు, రెస్టాఫ్ ఇండియా, ఓవర్సీస్ హక్కులు 22కోట్లకు అమ్ముడయ్యాయి. డిజిటల్, డబ్బింగ్ రైట్స్‌ రూపంలో మరో 80 కోట్ల రూపాయల వరకు బిజినెస్ చేసినట్లు తెలుస్తోంది. మూవీ రూ.140కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కింది. తొలి రోజు 25 కోట్ల రూపాయలు వసూళ్లు సాధిస్తుందని అంచనాలున్న నేపథ్యంలో ఈ మూవీ లాంగ్ రన్‌లో రికార్డు వసూళ్లు సాధించే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. చిరంజీవి, రామ్‌చరణ్‌(ram charan) ఇద్దరూ నటిస్తున్న మల్టీ స్టారర్ కావటం హై ఎక్స్‌పెక్టేషన్స్ క్రియేట్ చేసింది. ఈ చిత్రంలో సోనూ సూద్ ప్రతినాయకుడి పాత్రలో నటిస్తున్నాడు.

Also Read : Acharya Movie : ఆచార్య అంచనాలు అందుకుంటుందా.. అనుమానం ఎందుకంటే...

Also Read : Samantha Birthday: కరెక్ట్‌గా అర్ధరాత్రి 12 గంటలకు... సమంతకు బర్త్ డే విషెస్ చెప్పిన సాయి ధరమ్ తేజ్...

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News