Acharya Trailer: తగ్గేదేలే.. ఆచార్య ట్రైలర్‌కు అప్పుడే 2 మిలియన్ వ్యూస్!

Acharya Movie Trailer gets 2M Views. ఆచార్య ట్రైలర్‌కు సోషల్‌ మీడియాలోల్ అద్భుత రెస్పాన్స్ వస్తోంది. మెగా అభిమానులే కాకుండా ప్రతిఒక్కరు కూడా ట్రైలర్‌ను చూసి ఎంజాయ్ చేస్తున్నారు. ఇప్పటికే ఆచార్య ట్రైలర్‌కు రెండు మిలియన్ వ్యూస్ వచ్చాయి. 

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 12, 2022, 10:54 PM IST
  • ఆచార్య ట్రైలర్‌ వచ్చేసింది
  • మెగాస్టారా మజాకా
  • ఆచార్య ట్రైలర్‌కు 2 మిలియన్ వ్యూస్
Acharya Trailer: తగ్గేదేలే.. ఆచార్య ట్రైలర్‌కు అప్పుడే 2 మిలియన్ వ్యూస్!

Chiranjeevi, Ram Charan starrer Acharya Movie Trailer gets 2M Views: మొన్నటివరకు 'ఆర్‌ఆర్‌ఆర్' సినిమా మేనియా నడవగా.. ఇప్పుడు 'ఆచార్య' హంగామా మొదలైంది. సినీ అభిమానులంతా ఎప్పుడెప్పుడా అని ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తోన్న ఆచార్య ట్రైలర్‌ వచ్చేసింది. మెగాస్టార్ చిరంజీవి ఫ్యాన్ ఫాలోయింగ్‌ను దృష్టిలో ఉంచుకుని తెలుగు రాష్ట్రాల్లోని ముఖ్యమైన థియేటర్లతో పాటు సోషల్‌ మీడియా వేదికగా కొద్దిసేపటి క్రితం చిత్ర బృందం ట్రైలర్‌ను రిలీజ్ చేసింది. మెగా అభిమానులు కోరుకునే అన్ని హంగులు సినిమాలో ఉన్నట్టు ట్రైలర్‌ చూస్తేనే ఇట్టే అర్థమవుతోంది. 

ఆచార్య సినిమా ట్రైలర్‌కు సోషల్‌ మీడియాలోల్ అద్భుత రెస్పాన్స్ వస్తోంది. మెగా అభిమానులే కాకుండా.. ప్రతిఒక్కరు కూడా ట్రైలర్‌ను చూసి ఎంజాయ్ చేస్తున్నారు. 2 నిమిషాల 32 సెకండ్ల నిడివి గల వీడియో ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంటోంది. ట్రైలర్‌ రిలీజ్ అయిన కొద్దిసేపట్లోనే రికార్డులు బద్దలుకొట్టింది. ఇప్పటికే ఆచార్య ట్రైలర్‌కు రెండు మిలియన్ వ్యూస్ వచ్చాయి. మరోవైపు 125K లైక్స్ కూడా వచ్చాయి. ట్రైలర్‌ నెట్టింట దుమ్మురేపుతోందని ఈ ఫిగర్స్ బట్టి అర్ధం చేసుకోవచ్చు.

'ఇక్క‌డ అంద‌రూ సౌమ్యులు.. పూజ‌లు, పుర‌స్క‌రాలు చేసుకుంటూ క‌ష్టాలు వచ్చినపుడు అమ్మోరు త‌ల్లి మీద భార‌మేసి బిక్కుబిక్కుమ‌ని ఉంటామేమోన‌ని పొర‌బ‌డి ఉండొచ్చు. ఆప‌దొస్తే ఆ అమ్మోరు త‌ల్లే మాలో ఆవ‌హించి ముందుకు పంపుద్ది' అంటూ రామ్ చరణ్ చెప్పే డైలాగ్‌తో ఆచార్య సినిమా ట్రైలర్‌ షురూ అయింది. 'పాద‌ఘ‌ట్టం వాళ్ల గుండెల మీద కాలేస్తే.. ఆ కాలు తీసేయాల‌ట‌ .కాక‌పోతే అది ఏ కాలా?' చిరంజీవి త‌నదైన శైలిలో చెప్పిన డైలాగ్ హైలెట్ అయింది. కామ్రేడ్స్ గెట‌ప్‌లలో చిరంజీవి, చ‌ర‌ణ్ మ‌ధ్య వ‌చ్చే యాక్షన్ సన్నివేశాలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. 

డైరెక్టర్ కొరటాల శివ, చిరంజీవి, రామ్‌ చరణ్‌ కాంబినేషన్‌లో వస్తున్న ఆచార్య మూవీపై అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి. ఈ సినిమాకు చరణ్‌ నిర్మాతగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. అనేకసార్లు వాయిదా పడుతూ వచ్చిన ఆచార్య  సినిమా.. ఎట్టకేలకు ఏప్రిల్‌ 29న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. మణిశర్మ సంగీతం అందించిన ఈ సినిమాలో పూజా హెగ్డే, కాజల్ అగర్వాల్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. 

Also Read: Ranbir Kapoor-Alia Bhatt wedding: మరోసారి అలియా, ర‌ణ్‌బీర్‌ పెళ్లి వాయిదా.. కొత్త డేట్ ఇదే!

Also Read: Deepak Chahar: వరుస ఓటముల్లో ఉన్న చెన్నైకి భారీ ఎదురుదెబ్బ.. ఐపీఎల్ 2022 నుంచి స్టార్‌ ఆల్‌రౌండర్‌ ఔట్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News