Chiranjeevi Help: మరోసారి చిరు మంచి మనసు.. తిండికి ఇబ్బందిపడుతున్న కెమెరామెన్ కు ఆర్ధిక సాయం!

Chiranjeevi Helps Cameraman P Devaraj: సీనియర్ సినిమాటోగ్రాఫర్ పి దేవరాజు ఇబ్బందికర పరిస్థితుల్లో ఉందనే విషయం ఒక యూట్యూబ్ ఛానల్ వెలుగులోకి తీసుకురాగా వారికి చిరంజీవి ఐదు లక్షలు ఆర్ధిక సాయం చేసినట్టు తెలుస్తోంది.

Written by - Chaganti Bhargav | Last Updated : Feb 2, 2023, 12:00 PM IST
Chiranjeevi Help: మరోసారి చిరు మంచి మనసు.. తిండికి ఇబ్బందిపడుతున్న కెమెరామెన్ కు ఆర్ధిక సాయం!

Chiranjeevi Helps Cameraman P Devaraj: మెగాస్టార్ చిరంజీవి గురించి తెలుగు ప్రేక్షకులు ఎవరికీ పరిచయం చేయాల్సిన అవసరమే లేదు. ఆయన నటుడుగా ఎంత ఎదిగినా ఒదిగే ఉంటూ తన అభిమానులతో పాటు ఆపదలో ఉన్న సినీ పరిశ్రమలో వారిని కూడా ఆదుకుంటూ ఉంటారు. తాజాగా సీనియర్ సినిమాటోగ్రాఫర్ పి దేవరాజు ఇబ్బందికర పరిస్థితుల్లో ఉందనే విషయం ఒక యూట్యూబ్ ఛానల్ వెలుగులోకి తీసుకువచ్చింది.

ఆయన విషయం తెలుసుకుని మెగాస్టార్ చిరంజీవి ఐదు లక్షలు ఆర్ధిక సాయం చేసినట్టు తెలుస్తోంది. ఒకప్పుడు ఎన్నో సినిమాలకు సూపర్ హిట్ సినిమాలకు సైతం సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరించిన దేవరాజ్ వృద్ధాప్య కారణాలతో ఇంటికే పరిమితమయ్యారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి ఏ మాత్రం బాలేదు, ఎంతో మందికి సాయం చేసిన తాను ఇప్పుడు కనీసం నడవలేని స్థితిలో ఉన్నానని సాయం కోసం అభ్యర్థిస్తున్నానని.

తనకు పూట గడవడం కూడా కష్టమవుతుంది అంటూ తాజాగా యూట్యూబ్ ఛానల్ లో ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తన స్నేహితుడైన రజనీకాంత్ నెలకు 5000 పంపిస్తారని, మురళీమోహన్ టాబ్లెట్ ల కోసం మూడు వేలు పంపిస్తారని ఆయన చెప్పుకొచ్చారు. అప్పట్లో తాను సినిమాల్లో నటించేందుకు జయప్రద, ప్రభ, విజయశాంతి లాగా అనేకమంది ఆర్టిస్టులను రికమెండ్ చేసి ఎంకరేజ్ చేశాను. కానీ ఇప్పటికీ తనకు సహాయం చేయడానికి ఎవరూ ముందుకు రావడం లేదని తనకు ప్రతినెలా ఇంటికి ఎనిమిది వేలు అద్ది చెల్లిస్తున్నామని అది కూడా ఇప్పుడు కట్టలేని పరిస్థితిలో ఉన్నానని అని చెప్పుకొచ్చారు.

తనకు అనారోగ్య రీత్యా ఆపరేషన్ చేయాలంటే ఏడు లక్షలు దాకా అవుతుంది కానీ అది చేయించుకునే స్తోమత కూడా తనకు లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.  ఎందుకు బతికున్నానో తెలియదు చచ్చిపోవాలని ఉంది అంటూ యూట్యూబ్ ఛానల్ లో ఆయన ఆవేదన వ్యక్తం చేయటంతో సదరు యూట్యూబ్ ఛానల్ యాంకర్ అప్పటికప్పుడే కొంత అమౌంట్ ఆయనకు అందించే ప్రయత్నం చేశారు.

తాజాగా దేవరాజు ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్న మెగాస్టార్ చిరంజీవి అప్పటికప్పుడే 5 లక్షల రూపాయలను దేవరాజుకు అందించే ఏర్పాటు చేశారు. అంతేగాక ఆయన అనారోగ్యం ఏమిటి ఆయనకు జరగాల్సిన ఆపరేషన్ ఏమిటి అనే విషయాలను కూడా మెగాస్టార్ చిరంజీవి వాకబు చేసినట్లు తెలుస్తోంది. సినీ పరిశ్రమ తరపున తాను అండగా ఉన్నానని, మెగాస్టార్ చిరంజీవి ఆయనకు హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.

Also Read: Pawan Kalyan Unstoppable: పవన్ ఎపిసోడ్ కోసం స్పెషల్ టీములు.. దిల్ రాజును వాడుకుంటూ ఆహా ప్రమోషన్స్!

Also Read: Bandla Ganesh Tweets: బ్రతికున్నప్పుడు గేటు దగ్గరకు వస్తే అపాయింట్ మెంట్ కుడా ఇవ్వం..బండ్ల గణేష్ ట్వీట్ల వర్షం!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

 
 

Trending News