Balagam Director Venu: బలగం డైరెక్టర్ వేణును సన్మానించిన మెగాస్టార్.. రుణపడి ఉంటా అంటూ ట్వీట్!

Chiranjeevi Fecilitates Balagam Team:  బలగం సినిమా తెలంగాణ ప్రాంత వాసులందరికీ కనెక్ట్ అవ్వడంతో పాటు ఆంధ్ర ప్రాంత ప్రేక్షకులను సైతం ఆకట్టుకుంటుంది. ఈ సినిమా యూనిట్ ని పిలిపించుకున్న మెగాస్టార్ చిరంజీవి వారందరినీ సన్మానించారు.

Written by - Chaganti Bhargav | Last Updated : Mar 11, 2023, 08:20 PM IST
Balagam Director Venu: బలగం డైరెక్టర్ వేణును సన్మానించిన మెగాస్టార్.. రుణపడి ఉంటా అంటూ ట్వీట్!

Chiranjeevi Fecilitates Balagam Director Venu: బలగం సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు కమెడియన్ వేణు. చాలాకాలం నుంచి సినిమాలకు దూరంగా వ్యవహరిస్తున్న ఆయన బలగం అనే తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి ఒక్కసారిగా అందరికీ షాక్ ఇచ్చాడు. అప్పటివరకు చిన్న చిన్న కామెడీ పాత్రలలో కనిపిస్తూ ఉండే ఆయన ఇలాంటి ఒక సినిమాని డైరెక్ట్ చేశాడా అని అందరూ ఆశ్చర్యపోతున్నారు. ప్రియదర్శి, కావ్య కళ్యాణ్ రామ్ ప్రధాన పాత్రలలో దిల్ రాజు, కుమార్తె హన్షిత రెడ్డి నిర్మాణంలో దిల్ రాజు ప్రొడక్షన్ బ్యానర్ లో ఈ బలగం సినిమా రూపొందింది.

తెలంగాణలో ఒక వ్యక్తి చనిపోయినప్పుడు ఎలాంటి పరిస్థితులు ఏర్పడ్డాయి? అతని కుటుంబ సభ్యులు ఎలా ప్రవర్తించారు అనే కదాంశాన్ని తీసుకుని తెరకెక్కించిన ఈ సినిమా తెలంగాణ ప్రాంత వాసులందరికీ కనెక్ట్ అవ్వడంతో పాటు ఆంధ్ర ప్రాంత ప్రేక్షకులను సైతం ఆకట్టుకుంటుంది. దీంతో కేవలం చాలా తక్కువ బడ్జెట్ తో తక్కువ బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో రిలీజ్ చేసినా సరే భారీ వసూళ్లు సాధిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా యూనిట్ ని పిలిపించుకున్న మెగాస్టార్ చిరంజీవి వారందరినీ సన్మానించారు. ఈ సందర్భంగా వేణు తన సోషల్ మీడియా వేదికగా ఈ వీడియో షేర్ చేశారు.

షేర్ చేస్తూ ఇంకేం కావాలి నాకు 20 సంవత్సరాల సినీ ప్రయాణంలో మరిచిపోలేని రోజును చిరంజీవి గారు నాకు ఇచ్చారు థాంక్యూ సో మచ్ సార్ నా జీవితాంతం గుర్తిండి పోయే క్షణం నాకు, ఇది నా బలగం విజయం రుణపడి ఉంటాను చిరంజీవి గారికి అంటూ చిరంజీవి వేణుకి సన్మానం చేస్తున్న వీడియోని షేర్ చేశారు. ఇక ఈ వీడియోలో మనం పరిశీలిస్తే చిరంజీవి వేణుకు శాలువా కప్పడంతో పాటు నువ్వు ఇలాంటి షాకులు ఇస్తే ఎలా అయ్యా? ఇంత మంచి సినిమా తీస్తే ఎలా అంటూ ప్రశ్నించడం కనిపిస్తోంది.

మనసు హత్తుకునే విధంగా సినిమా ఉంది ఒక కమర్షియల్ ప్రొడ్యూసర్ చేసిన సినిమా అయినా నువ్వు మాత్రం సినిమా కథకే న్యాయం చేశావు, అని అంటూ ఒకప్పుడు జబర్దస్త్ లో నువ్వు చేసిన స్కిట్లు చూశాను అప్పుడే బుర్రకథలు లాంటివి కూడా జబర్దస్త్ ఇట్లా లో పెడుతూ ఉండేవాడివి. అప్పుడే ఏదో ఒక రోజు టాలెంట్ నిరూపించుకుంటావు అనుకున్నాను ఇప్పుడు ఇలా వచ్చావు అంటూ మెగాస్టార్ చిరంజీవి పేర్కొన్నారు

Also Read: Umair Sandhu on Pawan Kalyan: పవన్ పెద్ద ఉమనైజర్..ఆ టాప్ హీరోయిన్లతో అలా దొరికేసి!

Also Read: Satish Kaushik Death: నటుడు సతీష్ కౌషిక్ మృతిపై అనుమానాలు..ఆ మందులు వాడడం వల్లేనా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

 TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

 
 

Trending News