Wayanad Landslide: కేరళకు మద్దతు పలికిన మెగా హీరోలు.. ముఖ్యమంత్రి సహాయ నిధికి మెగా విరాళం..!

Celebrities for Wayanad Landslide: కేరళలో వయనాడ్ లో జరుగుతున్న.. విపత్తు అందరినీ కలచివేస్తోంది. ఇప్పటికే చాలామంది సెలబ్రిటీలు వయనాడ్ బాధితుల పునరావాస కార్యక్రమాల కోసం భారీ విరాళం ఇస్తున్నారు. ఇప్పుడు మెగా హీరోలు కూడా ఈ జాబితాలో చేరారు.  

Written by - Vishnupriya Chowdhary | Last Updated : Aug 4, 2024, 03:31 PM IST
Wayanad Landslide: కేరళకు మద్దతు పలికిన మెగా హీరోలు.. ముఖ్యమంత్రి సహాయ నిధికి మెగా విరాళం..!

Chiranjeevi donation for Wayanad Landslide Victims: ఇటీవల కేరళలో జరిగిన ప్రకృతి విపత్తు గురించి తెలియని వారు ఉండరు. వయనాడ్‌ జిల్లాలో భారీ వర్షాల కారణంగా కొండ చరియలు విరిగిపడ్డాయి. దీంతో లోతట్టు ప్రాంతాలు నేలమట్టం అయ్యాయి. చాలామంది ప్రాణాలు కోల్పోయారు. వందల్లో ప్రజలు గాయపడ్డారు. చాలామంది నిరాశ్రయులయ్యారు.  

ఈ నేపథ్యంలో ప్రముఖులంతా కేరళ ప్రభుత్వానికి విరాళాన్ని ప్రకటిస్తున్నారు. మలయాళం మాత్రమే.. కాక భాషలకు చెందిన హీరోలు కూడా ఒకరి తర్వాత ఒకరు తమకు తోచినంత ఆర్థిక సాయాన్ని అందిస్తూ వస్తున్నారు. తాజాగా ఇప్పుడు ఈ జాబితాలో మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా చేరారు. ఏకంగా కోటి రూపాయల భారీ మెగా విరాళాన్ని కేరళ ముఖ్య మంత్రి సహాయ నిధి కి ప్రకటించారు చిరు. 

"కేరళలోని వయనాడ్‌లో జరిగిన ప్రకృతి విపత్తు, జరిగిన విధ్వంసం చూసి నేను కలత చెందాను. వయనాడ్ బాధితులను చూస్తే నా గుండె తరుక్కుపోతోంది. కేరళ సీఎం రిలీఫ్ ఫండ్‌కు చరణ్‌, నేను కలిసి రూ.1 కోటి విరాళంగా అందజేస్తున్నాము. బాధలో ఉన్న వారందరూ కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను" అంటూ చిరంజీవి ట్వీట్ చేస్తూ విరాళం ప్రకటించారు.

 

కమల్ హాసన్, రజినీకాంత్ వంటి వారు కూడా దీని గురించి స్పందించారు. కోలీవుడ్ స్టార్ సూర్య 50 లక్షల భారీ విరాళాన్ని కేరళ ప్రభుత్వానికి ప్రకటించారు. మోహన్ లాల్ ఆర్థిక సాయాన్ని ప్రకటించడమే కాక వయనాడ్ వీధుల్లోకి వెళ్లి మరీ చేయగలిగిన సహాయాన్ని అందించారు. అల్లు అర్జున్ కూడా రూ. 25 లక్షల ఆర్థిక సాయాన్ని ప్రకటించారు. 

వయనాడ్ ఘటనకు చెందిన విజువల్స్ అందరి కంటా కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. ఇక మెగా కుటుంబ సభ్యులతో పాటు మిగతా టాలీవుడ్ హీరోలు కూడా ముందుకు వచ్చి తగిన సహాయం అందించాలని అభిమానులు కోరుకుంటున్నారు.

Read more:Snake vs Lizard: మానిటర్ బల్లిని కసితీరా కాటు వేసిన నల్ల పాము.. షాకింగ్ వీడియో వైరల్..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News