Chiranjeevi on Allu Arjun: అల్లు అర్జున్ మెగా టాగ్ మీద చిరు కామెంట్స్.. అవసరమే లేదంటూ!

Chiranjeevi Comments on Allu Arjun: మెగాస్టార్ చిరంజీవి అల్లు అర్జున్ గురించి చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అందుకు సంబందించిన వివరాల్లోకి వెళితే

Written by - Chaganti Bhargav | Last Updated : Jan 11, 2023, 07:29 PM IST
Chiranjeevi on Allu Arjun: అల్లు అర్జున్ మెగా టాగ్ మీద చిరు కామెంట్స్.. అవసరమే లేదంటూ!

Chiranjeevi Comments on Allu Arjun Not Mentioning Mega Tag: అల్లు అర్జున్ ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్ లో క్రేజ్ తెచ్చుకుంటున్నారు. కానీ ఎందుకో మెగా ట్యాగ్ వదిలించుకోవడానికి అల్లు అర్జున్ అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. తనకు తాను స్టైలిష్ స్టార్ అనే బిరుదును కూడా వదిలించుకుని ఐకాన్ స్టార్ గా మారేందుకు ఆయన చేస్తున్న ప్రయత్నాలు అన్నీ ఇన్నీ కావు. ఈ నేపథ్యంలోనే ఆయన మెగా ఫ్యామిలీ గురించి గానీ మెగా హీరోల గురించి కూడా తన సినిమా ఫంక్షన్స్ లో కామెంట్ చేయకపోవడం ఆసక్తికరంగా మారింది.

తాజాగా ఇదే విషయాన్ని మెగాస్టార్ చిరంజీవిని ప్రశ్నిస్తే ఆయన ఆసక్తికరంగా స్పందించారు. ప్రతిసారీ తన గురించి గానీ తన మెగా టాగ్ గురించి గానీ ప్రస్తావించాల్సిన అవసరం లేదని, ప్రతిసారి దాన్ని ప్రజల ముందు తీస్తూ ఉంటే వాళ్లకి అది ఇరిటేషన్ తెప్పించే అవకాశం ఉందని అన్నారు. నేను పవన్ కళ్యాణ్ పెరిగి పెద్దవాడై మంచి హీరో అవ్వాలనుకున్నానని, అలాగే రామ్ చరణ్, అల్లు అర్జున్ కూడా మంచి స్థాయికి వెళ్లాలనుకున్నానని, వాళ్లంతా ఆ స్థాయికి వెళ్లడంతో ప్రస్తుతం తాను ఎంజాయ్ చేస్తున్నానని చెప్పుకొచ్చారు.

ఇక కళ్యాణ్ గాని, చరణ్ గాని, బన్నీ గాని వీళ్లంతా చెయ్యి పట్టుకుని బుడిబుడి అడుగులు నేర్చుకున్నారని పేర్కొన్న చిరంజీవి ఇప్పుడు అందరూ మారథాన్ రేసులో పరిగెత్తుతున్నారని ఇప్పుడు మళ్ళీ నా చెయ్యి పట్టుకుని నడవాల్సిన అవసరం వాళ్లకు లేదని అన్నారు. ఇప్పుడు నేను కూడా ఆడియన్స్ లాగా వాళ్లని చూస్తానని మెగాస్టార్ చిరంజీవి పేర్కొన్నారు.

ఇక ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన వాల్తేరు వీరయ్య సినిమా సంక్రాంతి సందర్భంగా జనవరి 13వ తేదీన విడుదలవుతోంది. ఈ నేపథ్యంలోనే ఆయన పలు యూట్యూబ్ ఛానల్స్ కు, మీడియా ఛానళ్లకు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఈ ఇంటర్వ్యూలలోనే ఆయన అల్లు అర్జున్ గురించి ఈ మేరకు కామెంట్ చేశారు.

Also Read: Sreemukhi Hot Photos: ఎల్లో కలర్ షార్ట్ డ్రెస్సులో రెచ్చిపోయిన శ్రీముఖి.. అందాలు చూడతరమా?

Also Read: Hidma: చత్తీస్గడ్-తెలంగాణ బోర్డర్లో భీకర ఎన్ కౌంటర్..మావోయిస్టు కీలక నేత హిడ్మా మృతి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

 
 

Trending News