Chinmayi Sripada on Nayanathara: నయనతార మీద అసభ్య కామెంట్లు.. ఆడపిల్లలు పుడితే వారి పరిస్థితి ఏంటి?

Chinmayi Sripada Slams Trollers : కనెక్ట్ సినిమా ప్రీమియర్ షోకి నయనతార తన భర్త విగ్నేష్ శివన్ తో కలిసి వెళ్లగా అక్కడి ఆమె ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ విషయం మీద కొందరు అసభ్య కామెంట్లు చేయడంతో వారిపై సింగర్ చిన్మయి ఫైర్ అయింది. ఆ వివరాలు 

Written by - Chaganti Bhargav | Last Updated : Dec 24, 2022, 05:45 PM IST
Chinmayi Sripada on Nayanathara: నయనతార మీద అసభ్య కామెంట్లు.. ఆడపిల్లలు పుడితే వారి పరిస్థితి ఏంటి?

Chinmayi Sripada Slams Trollers Commented Abusively on Nayanathara Photos: నయనతార ఈ మధ్యనే తాను ప్రేమించిన విగ్నేష్ శివన్ అనే దర్శకుడిని వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. వీరు వివాహం చేసుకున్న కొన్ని రోజులకే ఈ జంటకు సరోగసి ద్వారా పిల్లలు కూడా జన్మించారు. అయితే చాలాకాలం తర్వాత కనెక్ట్ అనే సినిమాతో నయనతార ప్రేక్షకుల ముందుకు వచ్చింది. లేడీ ఓరియెంటెడ్ సినిమా అయిన ఈ సినిమాని స్వయంగా విగ్నేష్ శివన్ నిర్మించడం గమనార్హం.

తాజాగా ఈ సినిమా ప్రీమియర్ షోలో విగ్నేష్ శివన్ తో కలిసి నయనతార సందడి చేసింది. వివాహం తరువాత అది కూడా తల్లిదండ్రులైన తర్వాత వీరిద్దరూ కలిసి కనిపించిన మొదటి పబ్లిక్ ఈవెంట్ కావడంతో ఫోటోగ్రాఫర్లు, వీడియో గ్రాఫర్లు వీరి ఫోటోలు వీడియోలు తీసి సోషల్ మీడియాలో షేర్ చేసేందుకు ఆసక్తి చూపించారు. దీంతో ఈ ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

అయితే నయనతార తన అభిమానులతో మాట్లాడుతున్న ఒక వీడియోని ఒక ఇంగ్లీష్ ఎంటర్టైన్మెంట్ వెబ్సైట్ సోషల్ మీడియా హ్యాండిల్ లో షేర్ చేయగా ఆ వీడియో మీద పలువురు అసభ్యకరమైన కామెంట్లు చేశారు. నయనతార ఎద భాగం గురించి వారంతా అ అసభ్యకరమైన కామెంట్లు చేయడంతో ఫెమినిస్ట్ గా పేరు తెచ్చుకున్న సింగర్ చిన్మయి వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇళ్లల్లోని ఆడవాళ్ళందరూ తమ ఆడపిల్లలను ఇలాంటి మగవాళ్లకు దూరంగా పెట్టాలని ఎందుకంటే వారు మంచివారు కాదు వాళ్ల వల్ల ఆడపిల్లలకు ఎలాంటి సంరక్షణ లేదు దానికి ఈ కామెంట్స్ ఏ నిదర్శనం అంటూ వారు నయనతార గురించి అసభ్యకరంగా రాసిన కామెంట్లను ఆమె షేర్ చేశారు. ఒక మహిళ శరీరాకృతి గురించి అసభ్యకరమైన, చెత్త కామెంట్లు చేసే ఇలాంటి వ్యక్తులకు ఆడపిల్లలు పుడితే వారి పరిస్థితి ఏమిటి అంటూ ఆమె ప్రశ్నించింది.

సమాజంలో మహిళల పట్ల కొంతమంది మగవాళ్ళ దృష్టి ఎలా ఉందో ఈ కామెంట్లు తెలియజేస్తున్నాయని ఆమె పేర్కొన్నారు. ఇక ఇదే విషయం మీద ఒక సెక్స్ ఎడ్యుకేటర్ తన సోషల్ మీడియా వేదికగా ప్రస్తావించిన కొన్ని విషయాలను కూడా సింగర్ చిన్మయి తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేసి ఈ విషయం మీద అవగాహన పెంచే ప్రయత్నం చేశారు. 

Also Read: Woman To Kill Husband: లవర్ను మేనమామగా పరిచయం చేసి భర్తను లేపేయడానికి భార్య సూపర్ స్కెచ్..కానీ!

Also Read: Reham Khan Third Marriage: ఇమ్రాన్‌ ఖాన్‌ రెండో భార్యకు మూడో పెళ్లి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook.

 
 

Trending News