ఆకట్టుకుంటున్న 'చెట్టు కింద డాక్టర్' లిరికల్ సాంగ్

దేవదాస్ సినిమా నుంచి చెట్టు కింద డాక్టర్ లిరికల్ సాంగ్ 

Last Updated : Sep 6, 2018, 09:53 AM IST
ఆకట్టుకుంటున్న 'చెట్టు కింద డాక్టర్' లిరికల్ సాంగ్

నాగార్జున, నాని నటించిన మల్టీస్టారర్ దేవదాస్ మూవీ విడుదలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో ఒకదానితర్వాత మరొకటిగా లిరికల్ వీడియో సాంగ్స్ ను విడుదల చేస్తూ తమ సినిమాను ప్రమోట్ చేసుకునే పనిలోపడిన మేకర్స్.. తాజాగా చెట్టు కింద డాక్టర్ అనే లిరికల్ సాంగ్ ను లాంచ్ చేశారు. చెట్టు కింద ప్లీడర్ అనే పాత సినిమా టైటిల్ ని గుర్తుచేసేలా ఉన్నప్పటికీ.. ఈ పాట లిరిక్స్ మాత్రం కొంత విభిన్నంగానే ఉన్నాయి. "చిందరవందర సుందర వదన అయ్యయ్యో... ఇది నువ్వేనా.... గందరగోళపు మందల వలన తగులుకుందా హైరానా... ఇదొక వింత ఘటనా... నీకేమో రాదు నటనా" అంటూ సాగిన లిరిక్స్ ఆడియెన్స్‌ని ఆకట్టుకుంటున్నాయి. రామజోగయ్య శాస్త్రి రచించిన పాటకు మణిశర్మ కంపోజ్ చేసిన మ్యూజిక్ అదిరిపోగా ఆ పాటను నేపథ్యగాయని పద్మలత కూడా అంతే క్రేజీగా పాడటం విశేషం.

Trending News