New Movies: ఈ వారమే థియేటర్లలో గని.. ఓటీటీలో స్టాండప్​ రాహుల్​ విడుదల

New Movies: ఈ వారం తెలుగులో పెద్ద ఎత్తున కొత్త సినిమాలు విడుదలవనున్నాయి. గని, స్టాండప్​ రహుల్ వంటి సినిమాలు ఈ వారమే సందడి చేయనున్నాయి. మరి థియేటర్లలో, ఓటీటీలో వచ్చే మూవీస్​ ఏవో ఇప్పుడు చూద్దాం.

Written by - ZH Telugu Desk | Edited by - ZH Telugu Desk | Last Updated : Apr 5, 2022, 12:39 PM IST
  • తెలుగులో ఈ వారం కొత్త సినిమాల సందడి
  • థియేటర్లలో విడుదలవనున్న 'గని'
  • స్టాండప్​ రాహుల్ నేరుగా ఓటీటీలో విడుదల
New Movies: ఈ వారమే థియేటర్లలో గని.. ఓటీటీలో స్టాండప్​ రాహుల్​ విడుదల

New Movies: కొవడ్​ తగ్గుముఖం పట్టిన తర్వత దేశంలో కొత్త సినిమాల జోరు కొనసాగుతోంది. వరుసగా కొత్త మూవీస్​ రిలీజ్​ అవుతూ.. సనీ ప్రియులకు ఎంటర్​టైన్మెంట్​ ఇస్తున్నాయి. వారం వారం సరికొత్త సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. అలా ఈ వారం విడుదలవనున్న కొన్ని సినిమాల గురించి ఇప్పుడు చూద్దాం.

భారీ అంచనాలతో ఈ వారం విడుదలవుతున్న సినిమా 'గని'. బాక్సింగ్​ నేపథ్యంలో సాగే కథతో వస్తున్న ఈ మూవీలో మెగా హీరో వరుణ్​ తేజ్​ హీరోగా నటించారు. సయీ మంజ్రేకర్ హీరోయిన్​. ఈ మూవీకి కిరణ్​ కొర్రపాటి దర్శకత్వం వహించారు. ఏప్రిల్​ 8న ఈ మూవీ థియేటర్లలో విడుదలవనుంది. ఇటీవల బాక్సింగ్​ నేపథ్యంలో వస్తున్న సినిమాలకు మంచి ఆదరణ దక్కుతోంది. ఆర్య హీరోగా వచ్చిన 'సార్పట్ట' ఇందుకు మంచి ఉదాహరణగా చెప్పొచ్చు. మాస్​ ఆడియన్స్​కు కావాల్సిన ఫైట్స్​తో పాటు.. ఏమోషన్స్ వంటి ఎలిమెంట్స్​ వంటివి ఉండటం ఈ సినిమాల ప్రత్యేకత. ఇప్పుడు అదే కోవలో వస్తున్న 'గని' మూవీ మూవీ ఎలా ఉండనుందో తెలియాలంటే.. 8వ తేదీ వరకు ఆగాల్సిందే.

'స్టాండప్​ రాహుల్​'

థియేటర్లు పూర్తి స్థాయిలో తెరుచుకున్నప్పటికీ ఇంకా చాలా సినిమాలు నేరుగా ఓటీటీల్లోనే విడుదలవుతున్నాయి. ముఖ్యంగా చిన్న  సినిమాలకు మంచి రేటు దక్కుతుండటంతో నిర్మాతలు ఓటీటీలోనే నేరుగా సినిమాలు విడుదల చేస్తున్నారు. యువ కథానాయకుడు రాజ్​ తరుణ్​ నటించిన 'స్టాండప్​ రాహుల్​' మూవీ నేరుగా ఆహా ఓటీటీలో విడుదలవనుంది. ఏప్రిల్ 8నే ఈ మూవీ కూడా విడుదల కానుంది. ఈ మూవీలో వర్ష బొల్లమ్మ హీరోయిన్​గా నటించారు. కామెడీతో పాటు.. ఏమోషనల్​ కథాంశంతో ఈ సినిమాను తెరకెక్కించారు కొత్త దర్శకుడు శాంటో మోహన వీరంకి. వెన్నెల కిశోర్​, ఇంద్రజ, మురళీ శర్మ వంటి వారు ఈ మూవీలో నటించారు.

థియేటర్లలో 'మా ఇష్టం' (డేంజరస్​)

వివాదాలకు కేరాఫ్ అడ్రస్​గా పిలుచుకునే రామ్​ గోపాల్​ వర్మ కొత్త ప్రయోగం.. మా ఇష్టం డేంజరస్​ మూవీ ఈ నెల 8న థియేటర్లలో విడుదలవనుంది. అప్సరా రాణి, నైనా గంగూలీ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ మూవీ కథ స్వలింగ (ఇద్దరు యువతుల మధ్య ప్రేమ) సంపర్కుల మధ్య జరిగి క్రైమ్​, డ్రామాగా సాగనుంది. సక్సెస్​తో సంబంధం కొత్త కొత్త ప్రయోజనాలు చేసే రామ్​ గోపాల్ వర్మ.. ఈ సినిమాపై పెట్టుకున్న అంచనాలను అందుకుంటారో లోదే వేచి చూడాలి.

వీటితో పాటు.. తెలుగులో పలు చిన్న సినిమాలు కూడా నేరుగా థియేటర్లలో విడుదల కానున్నాయి. డస్టర్​, కథ కంచికి మనం ఇంటికి, రెడ్డిగారింట్లో రౌడీయిజం వంటి మూవీస్​ థియేటర్లలో సందడి చేయనున్నాయి.

Also read: Rajamouli Dance: ఆర్ఆర్ఆర్ సక్సెస్ పార్టీలో నాటు నాటు సాంగ్ కు రాజమౌళి స్టెప్పులు!

Also read: Ricky Kej Grammy: గ్రామీ అవార్డు దక్కించుకున్న భారతీయ మ్యుజీషియన్.. ప్రధాని మోదీ అభినందనలు!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News