Check movie collections: చెక్ మూవీ Box office result చెక్ చేశారా ?

Check movie first weekend collections: నితిన్ నటించిన లేటెస్ట్ సినిమా చెక్ మూవీ కలెక్షన్స్ ఫస్ట్ వీకెండ్ లోనే డల్ అవడం ఆ చిత్ర యూనిట్ వర్గాలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఫిబ్రవరి 26న రిలీజైన చెక్ మూవీ తొలి వారాంతంలో రూ. 7.50 కోట్ల షేర్ రాబట్టినట్టు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఫేమస్ Director Chandrasekhar Yeleti  డైరెక్ట్ చేసిన చెక్ మూవీ వాస్తవానికి ఈ వారం రిలీజైన చిత్రాల్లో ఫేవరైట్‌గా బరిలో నిలిచింది.

Last Updated : Mar 1, 2021, 08:20 PM IST
Check movie collections: చెక్ మూవీ Box office result చెక్ చేశారా ?

Check movie first weekend collections: నితిన్ నటించిన లేటెస్ట్ సినిమా చెక్ మూవీ కలెక్షన్స్ ఫస్ట్ వీకెండ్ లోనే డల్ అవడం ఆ చిత్ర యూనిట్ వర్గాలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఫిబ్రవరి 26న రిలీజైన చెక్ మూవీ తొలి వారాంతంలో రూ. 7.50 కోట్ల షేర్ రాబట్టినట్టు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఫేమస్ Director Chandrasekhar Yeleti  డైరెక్ట్ చేసిన చెక్ మూవీ వాస్తవానికి ఈ వారం రిలీజైన చిత్రాల్లో ఫేవరైట్‌గా బరిలో నిలిచింది. చెక్ మూవీ ట్రైలర్ చూశాకా ఆడియెన్స్ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. కానీ సినిమా రిలీజ్ అయ్యాక కనిపించిన ఫలితం మరోలా ఉంది.

లాజిక్ లేని కథనం, సన్నివేశాలు సినిమాను వీక్ చేశాయి. దీంతో చెక్ మూవీపై ఆడియెన్స్ పెట్టుకున్న అంచనాలను సినిమా అందుకోలేకపోయింది. ఫలితంగా ఫస్ట్ వీకెండ్‌లో 7.50 కోట్ల రూపాయల షేర్‌తోనే సరిపెట్టుకోవాల్సి వచ్చిందంటున్నారు ట్రేడ్ పండితులు. మరో రూ.10 కోట్లు షేర్ రాబడితే కానీ Check movie కోసం నిర్మాతలు పెట్టిన పెట్టుబడి వచ్చేలా లేదనే అంచనాలు వెలువడుతున్నాయి. కానీ ప్రస్తుతం క్యూలో ఇంకెన్నో సినిమాలు ఉండటంతో అంతమొత్తంలో షేర్ వసూలు చేయడం కష్టమేననే వాళ్లు కూడా లేకపోలేదు.

Also read : Check movie review: చెక్ మూవీ రివ్యూ, రేటింగ్

Nithiin, Actress Rakul Preet Singh ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన Check movie టాలీవుడ్ బాక్సాఫీస్ ఫుల్ రిజల్ట్ ఎలా ఉండనుందనేది ఈ వారాంతంలో తెలిసిపోనుంది అంటున్నాయి సినీవర్గాలు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News