Chaitanya Rao : హీరోగా 31 వెడ్స్ 20 చైతన్య రావ్.. ‘వాలెంటైన్స్ నైట్’ కథాకమామీషు ఏంటంటే?

Chaitanya Rao Valentine's Night కరోనా సమయంలో వచ్చిన 31 వెడ్స్ 20 అనే వెబ్ సిరీస్‌తో చైతన్య రావుకు మంచి పేరు, ఇమేజ్ వచ్చింది. ఇప్పుడు అతను హీరోగా వాలెంటైన్స్ డే అనే సినిమా వచ్చింది. ఈ సినిమా ఎలా ఉందో ఓ సారి చూద్దాం.

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 27, 2023, 10:12 AM IST
  • హీరోగా 31 వెడ్స్ 20 నటుడు
  • చైతన్య రావ్‌కు లక్ కలిసి వచ్చేనా?
  • వాలెంటైన్స్ నైట్ ఎలా ఉందంటే?
Chaitanya Rao : హీరోగా 31 వెడ్స్ 20 చైతన్య రావ్.. ‘వాలెంటైన్స్ నైట్’ కథాకమామీషు ఏంటంటే?

Valentine's Night Movie Review 31 వెడ్స్ 20తో గుర్తింపు తెచ్చుకున్న చైతన్య రావు హీరోగా, లావణ్య హీరోయిన్‌గా నటించిన నటించిన చిత్రం ‘వాలెంటైన్స్ నైట్’. సునీల్‌, శ్రీ‌కాంత్ అయ్యంగార్‌, అవినాష్  వంటి వారు ముఖ్య పాత్రలను పోషించారు. అనీల్ గోపిరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రానికి తృప్తి పాటిల్‌, సుధీర్ యాలంగి, మ‌హీంధ‌ర్ ఎంఒ నారాల నిర్మాత‌లు. జ‌న‌వ‌రి 26న ఈ చిత్రం ప్రేక్షకుల ముందకు వచ్చింది. డ్రగ్స్, డబ్బు ప్రధానంగా తెరకెక్కిన ఈ చిత్రం... ఆడియన్స్ ని ఎలా ఆకట్టుకుందో  ఓ సారి చూద్దాం.

అజయ్(చైతన్య రావు) ఆర్జేగా పనిచేస్తుంటాడు. అతడు ప్రియ(లావణ్య)తో ప్రేమలో ఉంటాడు. అయితే వీరిద్దరికీ అనుకోకుండా బ్రేకప్ అవుతుంది. అలాగే డ్రగ్ మాఫియా లీడర్‌గా (శ్రీకాంత్ అయ్యంగార్) సిటీలో చెలామణి అవుతుంటాడు. ఆ డ్రగ్ మాఫియా ఆటకట్టించే పనిలో కృష్ణ మోహన్(సునీల్) ఒక్కొక్కరి పని పడుతూ ఉంటాడు. ఈ క్రమంలో డ్రగ్ వ్యాపారం చేస్తూ పెడదోవ పట్టిన ఆలీ(ముక్కు అవినాష్) అనే కుర్రాణ్ని మారుస్తాడు. అదే సమయంలో వేద(దివ్య)అనే అమ్మాయి డ్రగ్ అడిక్ట్ మారి... జీవితాన్ని నాశనం చేసుకుంటుంది. అజయ్, ప్రియ మళ్లీ కలుసుకున్నారా? డ్రగ్ వ్యాపారి కథ ఎలా ముగిసింది? వేద చివరకు ఏం అవుతుంది. ఆలీ ఏం చేస్తాడు? కృష్ణ మోహన్ తీసుకున్న చర్యలేంటి? అనేది కథ.

వాలెంటైన్ నైట్... సామాజిక సందేశాన్ని అందించే ఓ యూత్ ఫుల్ లవ్ స్టోరీ. మత్తు మందుకు అలవాటు పడితే వచ్చే సమస్యల ఇతి వృత్తంగా ఈ చిత్రం సాగుతుంది. నలుగురు కథల చుట్టూ తిరిగే ఈ సినిమాలో కథనం ఎంతో ఆసక్తికరంగా అనిపిస్తుంది. ఈ చిత్రంలో పాత్రల తీరు తెన్నులు ఇలా ఉంటాయి.

డ్రగ్స్ మాఫియా ముఠాలను ఆట కట్టించే ఓ పోలీస్ ఆఫీసర్. మాదక ద్రవ్యాల వ్యాపారంతో లింకులు ఉండే పాత బస్తీ క్యాబ్ డ్రైవర్. సమాజానికి ఉపయోగపడే సినిమాలనే తీస్తున్న బతికి చెడిన నిర్మాత. తండ్రి కోసం, కుటుంబం కోసం ప్రియురాలిని దూరం చేసుకోవడానికి సిద్దపడ్డ ఆర్జే. తల్లిదండ్రులను కోల్పోయి డ్రగ్స్ బానిస అయి డ్రగ్స్ పెడ్లర్‌గా మారిన ఒక కుర్రాడు. ప్రేమ కరువై డ్రగ్స్‌కు అలవాటు పడే అమ్మాయి. డబ్బే పరమావధిగా బతుకుతూ కుటుంబాన్ని పట్టించుకోని ఒక సంపన్న వ్యాపారవేత్త. 

ఇలా ప్రతీ పాత్ర చుట్టూ ఒక ఎమోషనల్ బాండింగ్ ఉంటుంది. ప్రతీ పాత్రకు ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. అయితే ఈ అందరి జీవితాలను కామన్‌గా కలిపి లింక్, ఒకరి జీవితాలను ఇంకొకరు ఎలా ప్రభావితం చేశారు అనే దాన్ని ఎంతో చక్కగా తెరకెక్కించారు. ఆ పాయింట్ ఇందులో చాలా ఇంట్రెస్టింగ్ గా  అనిపిస్తుంది. డ్రగ్స్ బారిన పడ్డ యువత ఎలా దారి తప్పుతుందో చూపిస్తూ.. తల్లిదండ్రులు తమ పిల్లలు ఏమి చేస్తున్నారు అనేది నిత్యం పరిశీలిస్తూ వుండాలనే సందేశాన్ని ఇచ్చాడు.

ఇలా ప్రతీ పాత్రతో తాను చెప్పదల్చుకున్న మెసెజ్‌ను ప్రేక్షకుడికి చేరవేశాడు దర్శకుడు అనిల్. ఇక తారాగణంలో చైతన్య రావు...ఆర్జే అజయ్‌గా ఆకట్టుకుంటాడు. ఆ పాత్ర చాలా డీసెంట్‌గా ఉంటుంది. ప్రియ పాత్రలో నటించిన లావణ్య పాత్ర కూడా చక్కగా ఉంటుంది. కుటుంబాన్ని వదిలేసి డబ్బు సంపాధనే ధ్యేయంగా బతికే శ్రీకాంత్ అయ్యంగార్ నటన ఆకట్టుకుంటుంది. అతని ఫ్రెండ్ గా నటించిన రవి వర్మ పాత్ర కూడా బాగుంది. సునీల్ అక్కడక్కడ కాసేపు కనిపిస్తూ తన మార్క్ చూపించాడు. మిగిలిన పాత్రలన్నీ తమ పరిధి మేరకు న్యాయం చేశాయి.

సాంకేతికంగా చూస్తే.. అనీల్ గోపిరెడ్డి ఇచ్చిన పాట‌లు, నేపత్య సంగీతం బాగుంది. సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ బాగుంది. దర్శకుడు తెరమీద చూపించిన కథ, కథనాలు బాగున్నాయి. నిర్మాతలు ఎక్కడా ఖర్చకు వెనకాడకుండా సినిమాని నిర్మించారు. సామాజిక సందేశంతో వచ్చిన చిత్రమే వాలెంటెన్స్ నైట్.

Also Read:  Hunt Telugu Movie Review : హంట్ రివ్యూ.. సుధీర్ బాబు డేరింగ్ స్టెప్ 

Also Read: Sharwanand Engagement: ఘనంగా హీరో శర్వానంద్‌ ఎంగేజ్‌మెంట్‌.. వైరల్ పిక్స్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News