Brahmastra Streaming on OTT : ఓటీటీలో బ్రహ్మస్త్ర సినిమా.. రణ్‌బీర్ కపూర్‌ని అలియా భట్ ఎన్ని సార్లు పిలిచిందంటే?

Brahmastra Streaming on OTT బ్రహ్మస్త్ర సినిమా ప్రస్తుతం ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే ఓటీటీలో సినిమాను జనాలు ఎంత క్షుణ్నంగా చూస్తారో చెప్పడానికి ఉదాహరణగా బ్రహ్మస్త్ర సినిమా నిల్చింది.

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 6, 2022, 05:40 PM IST
  • ఓటీటీలో బ్రహ్మస్త్ర సందడి
  • శివ అంటూ జపం చేసిన అలియా భట్
  • రణ్‌బీర్ కపూర్‌ను ఎన్నిసార్లు పిలిచిందంటే?
Brahmastra Streaming on OTT : ఓటీటీలో బ్రహ్మస్త్ర సినిమా.. రణ్‌బీర్ కపూర్‌ని అలియా భట్ ఎన్ని సార్లు పిలిచిందంటే?

Brahmastra Streaming on OTT : ఓటీటీలో సినిమాలను జనాలు చూసే తీరు మారుతోంది. ప్రతీ చిన్న తప్పుని, ప్రతీ చిన్న విషయాన్ని పట్టించుకుంటున్నారు. ఆ మధ్య ఆచార్య సినిమా విషయంలోనూ ఇలాంటి ఓ విషయాన్ని పట్టించుకున్నారు. ఆచార్య సినిమాలో పాదఘట్టం అంటూ పదే పదే పలికి అందరికీ విసుగుతెప్పించారు. పాదఘట్టం అనే పదాన్ని సినిమా మొత్తంలో దాదాపు ఇరవై సార్ల కంటే ఎక్కువగా పలికారంటూ జనాలు లెక్క పెట్టి మరీ ట్రోల్స చేశారు.

 

ఇక ఇప్పుడు బ్రహ్మస్త్ర విషయంలోనూ అలాంటి ఓ విషయాన్నే జనాలు పసిగట్టారు. ఈ సినిమా టీం చెప్పుకున్నట్టుగా ఇదేమీ బ్లాక్ బస్టర్ హిట్ చిత్రం కాదు. పైగా ఈ సినిమా వల్ల మౌనీ రాయ్‌కి తప్పా మరొకరి మంచి గుర్తింపు రాలేదు. రణ్‌బీర్ కపూర్, అలియా భట్‌ల కెమిస్ట్రీ కూడా అంతగా వర్కౌట్అవ్వలేదు. పైగా అలియా భట్ ఈ సినిమాలో చేయడానికి ఏమీ లేకుండా పోయింది.

 

కేవలం శివ, శివ అంటూ రణ్‌బీర్ కపూర్‌ను పిలుస్తూ ఉండిపోతుంది. అయితే సినిమా మొత్తంలో శివ అని రణ్ బీర్ కపూర్‌ను అలియా భట్ ఎన్ని సార్లు పిలుస్తుందనే విషయాన్ని కొందరు నెటిజన్లు పసిగట్టేశారు. ఎంతో ఓపిగ్గా లెక్కపెట్టినట్టు కనిపిస్తోంది. దాదాపు 103 సార్లు శివ అని అలియా భట్ పిలుస్తుందట. ఇక అదే సమయంలో అలియా పాత్ర పేరైనా ఈషాను కూడా రణ్‌ బీర్ కపూర్ 103 సార్లు ఉచ్చరిస్తాడంటూ జనాలు ట్రోల్స్ చేస్తున్నారు.

 

మొత్తానికి బ్రహ్మస్త్ర సినిమా మాత్రం ఇప్పుడు ఓటీటీలో సందడి చేస్తోంది. బెస్ట్ విజువల్ ఎఫెక్ట్స్ అంటూ సినిమా టీం మీద నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇదిలా ఉంటే.. అలియా భట్, రణ్‌ బీర్ కపూర్ ఇంట్లో సంతోషాలు వెల్లివిరుస్తున్నాయి. అలియా భట్ పండంటి బిడ్డకు జన్మనివ్వడంతో బాలీవుడ్ సెలెబ్రిటీలంతా కూడా శుభాకాంక్షలు చెబుతున్నారు.

Also Read : Pooja Hegde Leg Injury : పూజా హెగ్డే కాలికి గాయం.. కోలుకుంటోన్న బుట్టబొమ్మ.. పిక్ వైరల్

Also Read : Bigg Boss Satya : సత్య, గీతూలకు ఇప్పటికైనా తెలిసి వస్తుందా?.. కళ్లు తెరుస్తారా?

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News