Brahmamudi October 2nd Episode: ఎక్స్‌పోలో రాజ్‌కు ఎదురుపడిన కావ్యను ఎలా ఉన్నావమ్మా? అంటూ రాజ్ తండ్రి కావ్యను అడుగుతాడు. దీనికి వెటకారంగా మాట్లాడుతుంది రుద్రాణీ. ఎందుక వచ్చిందంట? అని రాజ్ అడుగుతాడు. మాటిమాటికి ఎదురు పడితే నిన్ను కాపురానికి తీసుకువెళ్తాడు అనుకున్నావా? అంటుంది రుద్రాణీ. నేనిక్కడికి ఎవరినీ చూడటానికి రాలేదు, ఎవరినీ కలవడానికి రాలేదు అంటుంది కావ్య. ఈ వంకతో మాటిమాటికి ఎదురుపడి రాజ్ మనస్సు మార్చాలని చూస్తున్నావా? అంటుంది రుద్రాణీ వాడు ఎప్పటికీ క్షమించడు రాజ్ నాకు చాలా అవమానంగా ఉంది. ఈ ఎక్స్‌పోలో పెద్దపెద్దవారు వస్తారు. కుండలకు రంగువేసేవారు కూడా వస్తే ఎలా రాజ్ అని రుద్రాణీ వెటకారం చేస్తుంది.స్టాయిని నిర్ణయించేది కుండలు క్యాన్ వాస్‌లు కాదు కళకు సంబంధించిన నైపుణ్యం అంటుంది. అలాగని కుండలు కొండలతో ఢీకొంటే ఎలా అంటుంది రుద్రాణీ ఇంటికి రమ్మంటే ఎందుకు రాలేదు అంటాడు. మీ ఇంటికి రాడానికి నెలకింద ఖరీదు కట్టే షరాబులు ఇక్కడ ఉండరని అనుకున్నాను అంటుంది కావ్య. దీనికి కావ్య మామ ఎంటమ్మా ఎమంటున్నావ్ అంటాడు మీ అబ్బాయి గారినే అంటాడు దీనికి రాజ్ ఖంగుతింటాడు.
ఏం లేదు డాడి, కొన్ని పీడకలలు నిద్ర లేవగానే మర్చిపోవాలి అంటాడు. ఎదుటివారి ఆలోచనలను కలలను మర్చిపోవాల్సిందేనా? అంటుంది కావ్య. దీనికి రాజ్ నీ కళ ను గుర్తించిందే నేను, ఎంకరేజ్చేసిందే నేను అంటాడు. డిజైనర్‌ను చేసిందే నేను అంటాడు అహంకారంగా.. అయితే, కళను కూడా నేర్పింది మీరేనా? అంటుంది కావ్య. దీనికి స్వప్న కలిశారు కదా ఎందుకు గొడవపడుతున్నారు అంటుంది. ఎప్పటికీ నన్ను కలవను అన్నాడు కదా అక్క అంటుంది. మరి ఇక్కడికి ఎందుకు వచ్చావే అని స్వప్న అడుగుతుంది. పుట్టింట్లో ఉన్నాను కదా అక్క భారం కాకూడదని ఏదో బతుకు దెరువు వెతుక్కుంటూ వచ్చా అంటుంది కావ్య. ఇవన్నీ సాకులు అంటుంది రుద్రాణీ. అవార్డు ఫంక్షన్‌కు అందరూ వస్తారని వారికి ఎదురుపడితే ఇటునుంచి ఇటే కాపురానికి తీసుకువెళ్తారని వచ్చింది అంటుంది రుద్రాణీ, ఈ కావ్య కుండలో పడకు రాజ్ అంటుంది. దీనికి కావ్య కాపురాలు కూల్చే మీరుండగా ఎలా తీసుకెళ్తాడు అంటుంది. ఎప్పటికీ ఆ పొగరు తగ్గదు వెళ్దాం పదండి అంటుంది. దీనికి రాజ్ తండ్రి ఎలా ఉన్నావమ్మ మీ అత్తయ్య నీగురించే బాధపడుతుంది అంటాడు. నాకు తెలుసు మావయ్య ఆ ఇంట్లో ఎవరు నాగురించి ఎదురు చూస్తారో ఎవరు రాకూడదో అని అంటుంది. రాజ్‌ను అర్ధం చేసుకోలేదు ఎందుకు అంటాడు. ఆయన పుస్తకంలో నాగురించి లేదు ముసిన పుస్తకం అంటుంది కావ్య. అక్కడి నుంచి ఎక్స్‌పోలోకి వెళ్తారు.
అక్కడ అనామిక సామంత్‌తో కనిపిస్తుంది. రుద్రాణీ చూసి ఏమీ తెలియనట్టుగా నువ్వేందుకు వచ్చావు? నీకు ఏమీ కంపెనీలు లేవే అంటుంది. ఆ ఇంట్లో ఉన్నప్పుడు ఏమీ లేవు సామంత్తోపెళ్లి ఫిక్స్ అయ్యాక కంపెనీలో షేర్ కూడా వచ్చింది అంటుంది. దీనికి రాజ్ ఆశ్చర్యంగా చూస్తాడు. ఏంటి అంటుంది రుద్రాణీ. కాలేజీ రోజుల నుంచే నన్ను ప్రేమించాడు నాకు తెలియక కల్యాణ్‌ను పెళ్లి చేసుకున్న అంటాడు. దీనికి వెనుక అనామిక ఉందని నాకు ఇప్పుడు అర్థమైంది అంటాడు. ఇక నుంచి మా కంపెనీ అడుగడునుగా మీకు అడ్డుగా ఉంటుంది అంటాడు సామంత్. నువ్వు ఎందుకు అనామికను ఏరికోరి చేసుకున్నావో అంటాడు. నా కంపెనీ పతనం ప్రారంభమైందని కలలు కూడా కంటున్నావ్. అది చూద్దాం మిస్టర రాజ్ పెళ్లి ఫిక్స్ అయింది బావా అనలేను అంటాడు. అనామిక నా లైఫ్‌లో కాదు బిజినెస్‌లో కూడా పార్టనర్ అవుతుంది. చూద్దాం వంద సంవత్సరాలు ఉన్న మా కంపెనీకి వస్తుందా? మీకు వస్తుందా అంటుంది రుద్రాణీ. మేం అవార్డు తీసుకుంటే చప్పట్లు కొడదురు అంటుంది అనామిక తప్పకుండా కొడతాం దుగ్గిరాలవారి మాజీ కోడలు ఇంతగా దిగజారిపోయినందుకు చప్పట్టు కోడతాం. నన్ను ఇంట్లో నుంచి పంపించేసినట్లే కావ్యను కూడాపపించారట నెక్ట్స్ నువ్వే జాగ్రత్త అంటుంది అనామిక. వీటికి కంపెనీ ఉందని చేరవు. పాపం వీన్ని చేసుకుంటే కంపెనీ దివాళ తీస్తుంది అంటుంది స్వప్న.
ఇదీ చదవండి: Pawan Kalyan Second Daughter: పవన్ కళ్యాణ్ చిన్న కూతురును చూశారా.. ఎంత క్యూట్ గా ఉందో..!
కాసేప్పట్లో ఎవరూ ఊహించని బాంబ్ పేలుతుందని తెలియదు కదా అంటాడు సామంత్ బీ కూల్ అని చేయి వేస్తుంది రొమాంటిక్‌గా.. సరే పా అంటాడు సామంత్. మరోవైపు దుగ్గిరాల వారి ఇంట్లో మిగతా అందరూ కలిసి సీరియల్ చూస్తుంటారు. ఈ రోజు రాజ్ అవార్డు తీసుకుంటే అందరూ కలిసి టీవీలో చూడవచ్చు అనుకుంటారు. అక్కడ ధాన్యలక్ష్మితో వెటకారంగా మాట్లాడతాడు మతిమరుపు మొగుడు. ఈలోగా వార్తల్లో గత పదేళ్లుగా స్వరాజ్ గ్రూపుకే వస్తుంది. ఈసారి ఏమవుతుందో చూద్దం అని ప్రెజెంటర్ అంటుంది. ఈసారి కూడా మనకంపెనీకే వస్తుంది అనుకుంటారు. మరోవైపు ఎక్స్‌పోలో నా డిజైన్స్ ఎవరికో కావాలన్నారు ఆ క్లైంట్ ఎవరో చెబితే మాట్లాడి వెళ్తా అంటుంది కావ్య మేనేజర్‌తో.. అదేంటమ్మ ఇలా వచ్చి అలా వెళ్లిపోతే ఎలా? చాలాపెద్దవారు వస్తారు ఎవరికి అవార్డు వరిస్తుందో అని చూస్తున్నారు. ఎవరికి అవార్డు వస్తుందో చూడవా ఎలాగో ఇంత దూరం వచ్చావు కదా అందరూ ఫ్రీ అవుతారు ఇక్కడ కూర్చో రా అమ్మ అని కూర్చోబెడతాడు. రాజ్ కావ్యనే గమనిస్తుందటాడు.
అత్తా.. నువ్విక్కడికి రాజ్ అవార్డు తీసుకుంటే చూద్దామని వచ్చావా? అంటుంది. నేనెవ్వరికీ చెప్పను కానీ, ఎందుకు అంత పట్టుపట్టి మరీ వచ్చావు. ఇదొక్కటి అవులిస్తే ఎంఆర్ఐ స్కాన్ చేస్తుంది అనుకుంటుంది రుద్రాణీ, పోనీ నేను చెప్పనా.. అనామిక ఇక్కడకు వస్తుంది. రాజ్ కావ్య లు ఎక్కడ కలిపిపోతారో అని వచ్చావు అంటుంది. అప్పుడు రుద్రాణీ రాజ్ ఎందకు అంత కంగారు పడుతున్నావు అవార్డు మనకేవస్తుంది అంటాడు. కంపెనీ ఉన్న పరిస్థితుల్లో మనం ఈ అవార్డు గెలుచుకోవాల్సిందే, తాతగారికి ఇచ్చిన మాట పోతుంది అంటాడు. నువ్వే గెలుస్తావ్ అంటాడు జగదీష్. అప్పుడు కావ్య ఎందుకు వచ్చింది ఒకసారి తెలుసుకోవాలి అని స్వప్న కావ్య వద్దకు వెళ్తుంది. ఒసేయ్ నువ్వెరికి చెప్పినా చెప్పకపోయినా నువ్వురాజ్ కోసమే వచ్చావు కదా అంటుంది. దీనికి అంబుజాక్షి నువ్వు అవేశ పడకు.. నేను ఒక కంపెనీలో పనిచేస్తున్న మేనేజర్ క్లైంట్లను పరిచయం చేస్తాఅంటే వచ్చాను అంటుంది కావ్య. మా అత్తయ్య నువ్వు ఇక్కడికి వస్తావనే వచ్చింది. రాజ్ అవార్డు గెలిచి కిందకు వచ్చాక కంగ్రాట్స్ చెప్పు, గెలిచిన ఆనందంతో ఉంటాడు కాబట్టి సారీ కూడా చెప్పు అంటుంది స్వప్న.
ఏం మాట్లాడుతున్నావ్ అక్క అంటుంది కావ్య. నేను సారీ చెప్పడం ఏంటి? నేనేం తప్పు చేసాను అంటుంది. అబ్బా ఇప్పుడు తప్పొప్పులు గురించి మాట్లాడితే మొదటికే మోసం వస్తుంది నామాట విను ఒకసారి సారీ చెప్పు అన్నీ సమస్యలు తీరిపోతాయి అంటుంది స్వప్న. మాకు పెళ్లయిన తర్వాత మా పడకగదిలో లక్షసార్లు సారీ అడిగాను ఇక్కడ సారీ కాదు కావాల్సింది అంటుంది. ఇదిలా ఉండగా లాస్ట్ పదేళ్లుగా అవార్డు అందుకుంది స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీ మాత్రమే హోస్ట్ అంటాడు. దీనికి రాజ్ పొంగిపోతాడు. సామంత్ కంగారు పడుతుంటాడు. ఇక హోస్ట్ ఈసారి కొత్తగా ఏదైనా మిరాకిల్ జరగబోతుందా? స్వరాజ్ గ్రూప్ అందుకుంటుందా? కాసెప్పట్లో తెలుస్తుంది అంటాడు. అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తుంటే దిస్ అవార్డు గోస్ టూ అంటాడు హోస్ట్... ఇక రేపటి ఎపిసోడ్లోఅవార్డు ఎవరినీ వరిస్తుందో తేలిపోతుంది..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.