BiggBoss 5 Telugu: సోనూసూద్ మద్దతు..సింగర్ శ్రీరామచంద్రకే, అభిమానుల సందడి

BiggBoss 5 Telugu: ప్రముఖ నటుడు, సోషల్ వర్కర్ సోనూసూద్‌కు హఠాత్తుగా బిగ్‌బాస్‌పై మనసు మళ్లినట్టుంది. బిగ్‌బాస్ 5 తెలుగులో ఆ కంటెస్టెంట్‌కు మద్దతు పలికాడు సోనూసూద్. అటు రాఖీ సావంత్ కూడా ఇదే విషయంపై స్పందించింది.  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Nov 10, 2021, 08:57 AM IST
  • బిగ్‌బాస్ 5 తెలుగుపై స్పందించిన హీరో సోనూసూద్
  • బిగ్‌బాస్ తెలుగు కంటెస్టెంట్ సింగర్ శ్రీరామచంద్రకు మద్దతు తెలిపిన సోనూసూద్
  • ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ అవుతున్న సోనూసూద్ మద్దతు వీడియో
 BiggBoss 5 Telugu: సోనూసూద్ మద్దతు..సింగర్ శ్రీరామచంద్రకే, అభిమానుల సందడి

BiggBoss 5 Telugu: ప్రముఖ నటుడు, సోషల్ వర్కర్ సోనూసూద్‌కు హఠాత్తుగా బిగ్‌బాస్‌పై మనసు మళ్లినట్టుంది. బిగ్‌బాస్ 5 తెలుగులో ఆ కంటెస్టెంట్‌కు మద్దతు పలికాడు సోనూసూద్. అటు రాఖీ సావంత్ కూడా ఇదే విషయంపై స్పందించింది.

BiggBoss 5 Telugu ప్రారంభమై అప్పుడే 66 ఎపిసోడ్‌లు పూర్తయ్యాయి. 19 మంది కంటెస్టెంట్ల నుంచి ఒక్కొక్కరిగా ఎలిమినేట్ అవుతూ ఇప్పుడు పదిమంది మిగిలారు. ఈ పదిమందిలో జెస్సీ చికిత్స నిమిత్తం సీక్రెట్ రూమ్‌లో ఉన్నాడు. ఇప్పుడున్న కంటెస్టెంట్లలో సింగర్ శ్రీరామచంద్ర, సన్నీ, యాంకర్ రవి, మానస్, యూట్యూబర్ షణ్ముఖ్, జెస్సీలతో పాటు సిరి, యానీ మాస్టర్, ప్రియాంక, కాజల్‌లు ఉన్నారు. రీల్ లైఫ్‌తో పాటు రియల్ లైఫ్‌లో హీరోగా మారిన ప్రముఖ నటుడు సోనూసూద్‌కు హఠాత్తుగా బిగ్‌బాస్ 5 తెలుగు గురించి వ్యాఖ్యలు చేసి సంచలనం రేపాడు. 

కరోనా సంక్షోభ సమయంలో లాక్‌డౌన్(Lockdown) నేపధ్యంలో నిరుపేదలకు బాసటగా నిలుస్తూ, కార్మికులకు అండగా ఉంటూ పేదప్రజల పాలిట పెన్నిధిగా మారాడు. రీల్‌లైఫ్ హీరోగా నిలిచాడు. సోనూసూద్ చేసే సేవలకు దేశం యావత్తూ ఫిదా అయింది. ప్రభుత్వాలు చేయలేని పనిని సోనూసూద్ చేస్తున్నాడంటూ ప్రశంసలు కురిపించారు. స్టార్ హీరోల కంటే ఎక్కువ పాపులారిటీ సంపాదించాడు. ఈ సోనూసూద్ బిగ్‌బాస్ కంటెస్టెంట్ గురించి మాట్లాడటం ఆసక్తి రేపుతోంది. తాజాగా ఈయన తెలుగు బిగ్‌బాస్‌ షోపై స్పందిస్తూ..సింగర్‌ శ్రీరామచంద్రకు(Sreerama chandra) తన మద్దతు ప్రకటించాడు. దీనికి సంబంధించిన ఓ వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో సందడి చేస్తోంది.

బిగ్‌బాస్‌ తెలుగు సీజన్‌ 5లో శ్రీరామ్‌ను చూస్తున్నారా? నేనూ చూస్తున్నాను. షోలో నీ బెస్ట్‌ ఇవ్వు శ్రీరామ్‌. అతడికివే నా ప్రేమాభినందనలు.. లవ్‌ యూ మ్యాన్‌ అని చెప్పుకొచ్చాడు సోనూసూద్(Sonu Sood). శ్రీరామచంద్ర ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో పోస్ట్‌ చేసిన ఈ వీడియో కింద బాలీవుడ్‌ నటి రాఖీ సావంత్‌(Rakhi Sawant).. వావ్‌ అంటూ కామెంట్‌ చేసింది. ఇక ఈ వీడియో చూసిన అభిమానులు తెగ ఆనందపడిపోతున్నారు. సోనూసూద్ మద్దతివ్వడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక బిగ్ బాస్ కప్పు శ్రీరామ్‌దేనని కామెంట్లు అందుకున్నారు. 

Also read: BiggBoss 5 Telugu: జెస్సీని వెంటాడుతున్న వర్టిగో వ్యాధి ఏంటి, లక్షణాలేంటి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook 

Trending News