BiggBoss 5 Telugu: జెస్సీని వెంటాడుతున్న వర్టిగో వ్యాధి ఏంటి, లక్షణాలేంటి

BiggBoss 5 Telugu నుంచి జెస్సీ బయటికొచ్చేశాడు. అనారోగ్యం కారణంగా హౌస్ నుంచి బయటకు పంపించేస్తున్నట్టు బిగ్‌బాస్ ప్రకటించాడు. మెరుగైన వైద్య చికిత్స అవసరమని వెల్లడించాడు. ఇంతకీ జెస్సీని వెంటాడుతున్న ఆ వ్యాధి ఏంటి, లక్షణాలేంటనేది తెలుసుకుందాం.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Nov 10, 2021, 07:49 AM IST
  • జెస్సీని వెంటాడుతున్న వర్టిగో వ్యాధి లక్షణాలేంటి
  • జెస్సీ బిగ్‌బాస్ సీక్రెట్ రూమ్‌లో ఎందుకున్నాడు
  • జెస్సీ సీక్రెట్ రూమ్ నుంచి ఇంటికి వెళ్తాడా, హౌస్‌లో వెళ్తాడా
 BiggBoss 5 Telugu: జెస్సీని వెంటాడుతున్న వర్టిగో వ్యాధి ఏంటి, లక్షణాలేంటి

BiggBoss 5 Telugu నుంచి జెస్సీ బయటికొచ్చేశాడు. అనారోగ్యం కారణంగా హౌస్ నుంచి బయటకు పంపించేస్తున్నట్టు బిగ్‌బాస్ ప్రకటించాడు. మెరుగైన వైద్య చికిత్స అవసరమని వెల్లడించాడు. ఇంతకీ జెస్సీని వెంటాడుతున్న ఆ వ్యాధి ఏంటి, లక్షణాలేంటనేది తెలుసుకుందాం.

బిగ్‌బాస్ 5 తెలుగు(BiggBoss 5 Telugu) నుంచి వారం కాకుండానే మరో కంటెస్టెంట్ బయటికొచ్చేశాడు. అయితే ఎలిమినేషన్ ప్రక్రియ ద్వారా కాకుండా అనారోగ్య కారణాలతో బయటకు రావల్సిన పరిస్థితి. బిగ్‌బాస్ 66వ ఎపిసోడ్‌లో హఠాత్తుగా బిగ్‌బాస్ జెస్సీని కన్ఫెషన్ రూమ్‌లో పిలిచాడు. అతడి అనారోగ్యం గురించి ఆరా తీసాడు. వైద్య నిపుణుల సూచన మేరకు మెడికల్ ట్రీట్‌మెంట్ అవసరమని బిగ్‌బాస్ వెల్లడించాడు. ఇంటి నుంచి బయటకు రావల్సిందిగా కోరడంతో..జెస్సీ దుఖాన్ని ఆపుకుని అందరి నుంచి వీడ్కోలు తీసుకున్నాడు. బిగ్‌బాస్ సభ్యులైతే జెస్సీ ఇంటికి వెళ్లిపోయాడనుకున్నాడు కానీ ఆశ్చర్యంగా సీక్రెట్ రూమ్‌లో ప్రత్యక్షమయ్యాడు. ట్రీట్‌మెంట్ కోసం సీక్రెట్ రూమ్‌లో ఉంచుతున్నట్టు బిగ్‌బాస్ తెలిపాడు. అయితే ఈ విషయం ఇంటి సభ్యులెవరికీ తెలియదు. 

గత కొద్దిరోజులుగా జెస్సీ(Jessie) అనారోగ్యంతో ఇబ్బందిపడుతున్నాడు. టాస్కుల్లో పాల్గొనడం కాదు గానీ..గట్టిగా ఎవరతోనూ మాట్లాడలేకపోతున్నాడు, కుదురుగా నడవలేకపోతున్నాడు. కారణం అతడికున్న వర్టిగో సమస్య. రోజులు గడుస్తున్నా అతని ఆరోగ్యం మెరుగవలేదు. రోజురోజుకీ అతడిని ఆ వ్యాధి ఇబ్బందిపెడుతూనే ఉంది. దాంతో చికిత్స నిమిత్తం జెస్సీని బిగ్‌బాస్ సీక్రెట్ రూమ్‌లో(BiggBoss Secret Room) ఉంచాడు. సీక్రెట్ రూమ్‌లోనే పూర్తి చికిత్స అందిస్తారా లేదా తిరిగి ఇంటికి పంపించేస్తారా అనేది తేలాల్సి ఉంది. 

వర్టిగో లక్షణాలేంటి (Vertigo Symptoms)

తల తిరగడాన్ని వైద్య పరిభాషలో డిజినెస్‌, గిడీనెస్‌, వర్టిగో అని పిలుస్తారు. ఈ వ్యాధి ఎక్కువగా మహిళలకు వస్తుంది. వర్టిగో వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉన్నవారికి రంగులరాట్నం మీద తిప్పి అక్కడినుంచి విసిరేసినట్లుగా ఉంటుంది. కళ్లు తిరగడం, బ్యాలెన్స్‌ అదుపు తప్పడం ఎదురవుతుంది. గాల్లో తేలినట్లుగా అనిపిస్తుంది. చుట్టూ ఉన్న వ్యక్తులు, వస్తువులు తిరుగుతున్నట్లుగా అన్పిస్తుంది. ఇందులో రెండు రకాలుంటాయి. సెంట్రల్‌ వర్టిగో, పెరిఫరల్‌ వర్టిగో అని రెండు రకాలుంటాయి. తరచూ తల తిరగడం, విపరీతంగా వాంతులు కావడం, సరిగా నడవలేకపోవడమనేది సెంట్రల్‌ వర్టిగో లక్షణం. సెంట్రల్‌ వర్టిగో లక్షణాలు ఉంటే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. ఒక వైపుకు తిరిగినప్పుడు లేదా ఒక వైపుకు పడుకున్నప్పుడే తల తిరుగుతూ ఉంటే పెరిఫెరల్‌ వర్టిగో అంటారు. చెవిలో ఒక్కోసారి హోరుమని శబ్ధం రావడం, ఒక్కోసారి సడన్‌గా వినికిడి శక్తి మందగించడం వంటి లక్షణాలు ఇందులో ఉంటాయి. డాక్టర్ ఇచ్చిన మెడిసిన్ సమయానికి తీసుకుంటూ తగిన వ్యాయామం చేస్తుంటే వర్టిగోను(Vertigo) అదుపులో ఉంచవచ్చు.

Also read: AP CM YS JAGAN: బ్రేకింగ్ న్యూస్, ముందస్తు ఎన్నికలకు వైఎస్ జగన్, ఇక నిత్యం ప్రజల్లోనే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook 

Trending News