Bigg Boss Telugu 8: బిగ్‌బాస్ తెలుగు సీజన్ 8..14 వారం మరి కొద్ది గంటల్లో పూర్తి కానుంది. అవినాష్ తప్ప మిగిలినవారిలో ఎవరు ఈ వారం బిగ్‌బాస్ ఇంటి నుంచి బయటకు వెళ్లనున్నారో తేలనుంది. ఓటింగ్ ప్రక్రియలో ఎవరు టాప్‌లో ఉన్నారు, ఎవరు డేంజర్ జోన్‌లో ఉన్నారు, ఫైనల్ విజేత ఎవరనేది పరిశీలిద్దాం.
బిగ్‌బాస్ తెలుగు సీజన్ 8 చివరి దశకు చేరింది. వచ్చే వారం అంటే డిసెంబర్ 15న గ్రాండ్ ఫినాలే ఉంది. ప్రస్తుతం బిగ్‌బాస్ తెలుగు సీజన్ 8 ఈ వారం అవినాష్ తప్ప అందరూ అంటే నబీల్, ప్రేరణ, విష్ణుప్రియ, నిఖిల్, గౌతమ్, రోహిణిలు నామినేషన్‌లో ఉన్నారు. గ్రాండ్ ఫినాలే టికెట్ రేసు గెల్చుకుని ఫైనల్‌కు చేరిన అవినాష్ సేవ్ అయ్యాడు. దాంతో ఈ వారం అంటే 14వ వారంలో నబీర్, ప్రేరణ, విష్ణుప్రియ, గౌతమ్, నిఖిల్, రోహిణిల్లో ఒకరు ఎలిమినేట్ కానున్నారు. ఇప్పటికే టాస్క్ గెలిచిన నబీల్, ప్రేరణ, విష్ణుప్రియలు ప్రేక్షకుల్ని ఓట్లు అభ్యర్ధించగా గౌతమ్‌తో జరిగిన పోటీలో గెలిచిన నిఖిల్ ఓట్లు అభ్యర్ధించారు.
ప్రస్తుతం సోషల్ మీడియాలో లీక్ అవుతున్న సమాచారం ప్రకారం గౌతమ్ 23.52 శాతం ఓటింగుతో అగ్రస్థానంలో ఉండగా 21 శాతం ఓటింగుతో నిఖిల్ రెండో స్థానంలో ఉన్నాడు. ఇక నబీల్ 16 శాతంతో మూడో స్థానం, ప్రేరణ 13 శాతంతో నాలుగో స్థానంలో ఉన్నారు. విష్ణుప్రియ 12.67 శాతం, రోహిణి 12.14 శాతంతో డేంజర్ జోన్‌లో ఉన్నారు. అంటే ఈ వారం రోహిణి వర్సెస్ విష్ణుప్రియలో ఒకరు ఎలిమినేట్ కానున్నారు. సోషల్ మీడియా ప్రచారం, పీఆర్ గట్టిగా ఉన్న విష్ణుప్రియ గట్టెక్కవచ్చని అంచనా. అదే జరిగితే బిగ్‌బాస్ ఇంటి నుంచి ఈ వారం బయటకు వచ్చేది రోహిణిగా తెలుస్తోంది. అయితే బిగ్‌బాస్ లెక్కలు వేరుగా ఉంటే మాత్రం విష్ణుప్రియ ఎలిమినేట్ కావచ్చు.
ఈ వారం ఎలిమినేషన్ పక్కనబెడితే తుది పోరులో విజేతగా నిలిచేందుకు గౌతమ్‌కు ఎక్కువ అవకాశాలున్నాయని తెలుస్తోంది. ఎందుకంటే ఓటింగులో ప్రస్తుతం రెండో స్థానంలో ఉన్న నిఖిల్ కంటే అందనంత ఎత్తులో ఉన్నాడు. ఇద్దరికీ మధ్య ఓటింగ్ శాతం చాలా తేడా ఉంది.
Also read: Babri Masjid Issue: బాబ్రీ మసీదు అడుగున ఏ రామమందిరం లేదు, జస్టిస్ నారిమన్ సంచలన వ్యాఖ్యలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.