Bigg Boss Telugu Season 7 : నామినేషన్ నుంచి ఎస్కేప్ అవుతోన్న కంటెస్టెంట్.. ఏకంగా 8 వారాలకు పైగా

Bigg Boss: నామినేషన్ అనేది బిగ్ బాస్ రియాలిటీ షోలో ప్రతివారం జరిగే ఒక ప్రక్రియ. కానీ 8 వారాల నుంచి ఈ సీజన్ లో ఒక కంటెస్టెంట్ నామినేషన్ నుంచి తప్పించుకుంటూ వస్తున్నారు. ఇలా ఎన్ని వారాలు ఈ కంటెస్టెంట్ తప్పించుకోవడం అందరిని ఆశ్చర్యపరుస్తోంది.‌ ఒకటి రెండు వారాలు అయితే సరే కానీ ఏకంగా 8 వారాలు అనేది ప్రతి ఒక్కరిని ఆశ్చర్యపరస్తోంది. మరి ఇది ఎలా సాధ్యమైందో ఒకసారి చూద్దాం..

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 20, 2023, 01:19 PM IST
Bigg Boss Telugu Season 7 : నామినేషన్ నుంచి ఎస్కేప్ అవుతోన్న కంటెస్టెంట్.. ఏకంగా 8 వారాలకు పైగా

Bigg Boss:

తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ సెవెన్ ఈ మధ్యనే మొదలైంది. ఈ సీజన్ మిగతా సీజన్ల తో పోలిస్తే భిన్నంగా ఉంటుంది అంటూ టాస్కులను కూడా అదే రకంగా పెడుతూ వస్తున్నారు బిగ్ బాస్. మొదటి ఐదు వారాలు క్యాప్టెన్సీ టాస్కులు లాంటివి ఏమీ లేకుండా నామినేషన్ నుంచి తమను తాను కాపాడుకోవడం కోసం బిగ్ బాస్ టాస్కులు ఆడించారు. ఇలా మొదటి వారంలోనే ప్రముఖ డాన్స్ కొరియోగ్రాఫర్ ఆట సందీప్ పవర్ అస్త్ర ను సాధించి ఐదు వారాలపాటు నామినేషన్స్ నుంచి తప్పించుకున్నారు.

మొదటి వారంలోనే పవర్ అస్త్ర ద్వారా నామినేషన్స్ నుంచి ఇమ్యూనిటీ సాధించడంతో ఆట సందీప్ ను ఐదు వారాలపాటు ఎవరు నామినేట్ చేయలేకపోయారు. ఇలా అయిదు వారాలపాటు సందీప్ ఒక్కసారి కూడా నామినేషన్స్ లోకి రాలేదు. హౌస్ మేట్ గా మారిపోయి బిగ్ బాస్ ఇంట్లోనే ఉండిపోయారు. ఇక ఐదు వారాల తర్వాత అయినా సందీప్ నామినేషన్స్ లోకి వస్తాడని అందరూ అనుకున్నారు.

అనుకున్నట్లుగానే ఆరవ వారం సందీప్ నామినేషన్స్ లోకి వచ్చారు. కానీ ముందు వారం ఎలిమినేట్ అయిన గౌతమ్ సీక్రెట్ రూమ్ లో ఉండి అప్పుడే తిరిగి బిగ్ బాస్ ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చారు. బిగ్ బాస్ ఇచ్చిన పవర్ మేరకు గౌతమ్ సందీప్ ను నామినేషన్స్ నుంచి కాపాడారు. దీంతో ఆరవ వారం కూడా సందీప్ నామినేషన్స్ లోకి వెళ్ళలేదు. మధ్యలో కొందరు కంటెస్టెంట్లు సందీప్ ని నామినేట్ చేయాలని అనుకున్నారు కానీ వారికి కూడా అవకాశం రాకుండా పోయింది.

ఇక ఏడవ వారం వచ్చేసరికి బిగ్ బాస్ ఇంట్లోకి కొత్త కంటెస్టెంట్లు కూడా రావడంతో చాలామంది వారికే నామినేషన్లు వేశారు. కేవలం పల్లవి ప్రశాంత్ మాత్రమే సందీప్ కి నామినేషన్స్ ఓటు వేశారు. కానీ కేవలం ఒక్క ఓటు మాత్రమే పడటంతో సందీప్ మళ్లీ ఏడవ వారం కూడా నామినేషన్స్ లోకి రాకుండా తప్పించుకున్నారు. ఇక ఖచ్చితంగా వచ్చేవారం సందీప్ నామినేషన్స్ లో ఉంటాడు అని అందరూ అనుకుంటున్న సమయంలో సందీప్ ఈవారం టాస్క్ లో గెలిచి కెప్టెన్ గా మారిపోయారు.

దీంతో వచ్చేవారం కూడా కెప్టెన్ సందీప్ ని ఎవరికీ నామినేట్ చేసే హక్కు లేదు. ఇలా వరుసగా ఎనిమిది వారాలపాటు సందీప్ బిగ్ బాస్ ఇంటికే పరిమితం అయిపోయారు. అతనిపై ఒక నామినేషన్ కూడా వెయ్యడానికి ఎవరికీ అవకాశం ఇవ్వలేదు. ఇప్పటిదాకా వరుసగా ఇన్ని వారాలపాటు నామినేషన్స్ లోకి వెళ్లకుండా సేవ్ అయిన వారు లేరు. తెలుగు బిగ్ బాస్ చరిత్రలోనే ఇది మొదటిసారి అని కూడా చెప్పుకోవచ్చు.

Also Read: CM Jagan: ఏపీలో అర్చకులకు శుభవార్త.. సీఎం జగన్ దసరా గిఫ్ట్  

Also Read:  King Cobra Viral Video: వీడి ధైర్యానికి దండేసి దండం పెట్టాల్సిందే.. కింగ్ కోబ్రాకు బాత్ రూమ్‌లో స్నానం  

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News