Bigg Boss Elimination: ఊహించని ఎలిమినేషన్... రిస్క్ తీసుకోలేకే ఆ కంటెస్టెంట్ ను సాగనంపిన బిగ్ బాస్

Bigg Boss Telugu 8th Week Elimination: బిగ్ బాస్ తెలుగు ఎనిమిదవ వారంలో ఒక షాకింగ్ ఎలిమినేషన్ జరిగింది. బిగ్ బాస్ యాజమాన్యం ఆ భయంతోనే ఎలిమినేషన్ చేయడానికి నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. ఆ వివరాలు 

Written by - Chaganti Bhargav | Last Updated : Oct 29, 2022, 06:02 PM IST
Bigg Boss Elimination: ఊహించని ఎలిమినేషన్... రిస్క్ తీసుకోలేకే ఆ కంటెస్టెంట్ ను సాగనంపిన బిగ్ బాస్

Bigg Boss Telugu 8th Week Elimination: ఇప్పటికే విజయవంతంగా ఐదు సీజన్లను పూర్తి చేసుకున్న బిగ్ బాస్ ఆరో సీజన్ కూడా తెలుగులో ప్రసారమవుతోంది. ప్రతి ఆదివారం ఒక కంటెస్టెంట్ ని నాగార్జున హోస్ట్ గా ఎంటరై ఎలిమినేట్ చేస్తారన్న సంగతి తెలిసిందే. అయితే ఆదివారం, శనివారాలకు సంబంధించిన రెండు ఎపిసోడ్ల షూటింగ్ శనివారం పూర్తి చేస్తారు నాగార్జున. ఈ నేపథ్యంలో ఆదివారం నాడు ఎవరు ఎలిమినేట్ అవ్వబోతున్నారు అనే విషయం ఒకరోజు ముందుగానే లీక్ అవుతుంది.

ప్రతి వారం లాగానే ఈ వారం కూడా ఎవరు లీక్ అవుతున్నారనే విషయం తెలిసిపోయింది. నిజానికి గత వారం బిగ్ బాస్ హౌస్ కి కెప్టెన్ కూడా లేకపోవడంతో హౌస్ లో ఉన్న 14 మంది ఎలిమినేషన్స్ కోసం నామినేట్ అయ్యారు. హౌస్ లో ఉన్న ఆదిరెడ్డి, బాలాదిత్య, గీతూ, రేవంత్, ఆర్జె సూర్య, రోహిత్, మెరీనా, వాసంతి, శ్రీ సత్య, ఇనయా సుల్తానా, శ్రీహాన్, ఫైమా రాజశేఖర్ కీర్తి వంటి వారంతా నామినేట్ అయ్యారు. ఈ అందరూ రేవంత్ ఓటింగ్లో టాప్ ఉండి మంచి మార్కులు సంపాదించాడు.

ఇక ఆ తర్వాత మిగతా వాళ్ళు కూడా దాదాపుగా మంచి పెర్ఫార్మన్స్ ఇచ్చారు. అయితే వాసంతి, శ్రీ సత్య, రోహిత్, ఫైమా, రాజశేఖర్, కీర్తి, ఆర్జే  సూర్య డేంజర్ జోన్లో ఉన్నారని ముందు నుంచి ప్రచారం జరిగింది. వీరిలో ముఖ్యంగా రాజశేఖర్, సూర్య,,రోహిత్, శ్రీ సత్య, ఫైమా ఎవరో ఒకరు ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయని అన్నారు. ఇక తాజాగా ఇనయా సుల్తానా, ఆర్జె సూర్య మధ్య జరుగుతున్న వ్యవహారాన్ని చూడలేకపోతున్న వీక్షకులు ఆర్జె సూర్యను  ఇంటికి పంపించేందుకు సిద్ధమయ్యారు.

నిజానికి ఆర్జే సూర్య చాలా టాలెంట్ ఉంది కానీ ఆరోహీ రావుతో కాస్త హద్దులు మీది ప్రవర్తించడం ఆమె వెళ్లిపోయిన తర్వాత ఇనయా సుల్తానా తో కూడా అదే రీతిలో ప్రవర్తించడంతో పాటు మునుపెన్నడూ లేనివిధంగా బావ మరదళ్ళుగా  వీరిద్దరూ హౌస్లో చలామణి అవుతున్న నేపథ్యంలో బిగ్ బాస్ యాజమాన్యమే ఈ విషయంలో సీరియస్ గా తీసుకున్నట్లు తెలుస్తోంది. గతంలో ఆరోహితో ఇలాంటి వ్యవహారమే వచ్చినప్పుడు ఆరోహిని పంపిస్తే సూర్య ఇలియా సుల్తానాని పట్టుకున్నాడు.

ఇప్పుడు ఆమెను పంపించినా ఈయన మరొకరిని ట్రై చేయడని నమ్మకం లేదు. ఇక దానికి తోడు కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి ఈ షో మీద వేసిన ఒక పిటిషన్ కారణంగా హైకోర్టు జడ్జిలు కూడా తాము ఎప్పుడో ఒకసారి బిగ్ బాస్ చూస్తామని కామెంట్ చేశారు. వాళ్ళు చూసినప్పుడు కనుక ఇలాంటి సీన్లు ప్రసారమైతే మొదటికే మోసం వస్తుంది, అవసరమైతే షో నిలిపివేసే ఛాన్స్ కూడా ఉందనే అనుమానాల నేపథ్యంలో సూర్యని ఈ వారం ఎలిమినేట్ చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఇందులో నిజానిజాలు ఎంతవరకు ఉన్నాయి అనేది రేపు సాయంత్రానికి పూర్తి అవగాహన వచ్చే అవకాశం కనిపిస్తుంది.

Also Read: Jr NTR to Assembly: సీఎం ప్రత్యేక ఆహ్వానం.. అసెంబ్లీకి వెళ్లనున్న జూనియర్ ఎన్టీఆర్

Also Read: Kantara OTT Date: 'కాంతార'కు పెద్ద షాక్.. అప్పుడే ఓటీటీలో రిలీజ్.. మామూలు దెబ్బ కాదుగా!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News