Bigg Boss contestants remuneration: నాగార్జున హోస్ట్ గా.. తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 8 వైభవంగా మొదలైంది. ఇంతకుముందుతో పోలిస్తే ఈసారి తక్కువ మంది కంటెస్టెంట్లను మాత్రమే తీసుకున్నారు. బిగ్ బాస్ సీజన్ 8 ఇంటిలోకి 14 కంటెస్టెంట్లు వెళ్లారు. ఇక వెళ్ళిన మొదటి రోజు నుంచే ఎవరికి వాళ్ళు గేమ్ మొదలుపెట్టేసారు. ఇంకా మొదటి వారం కూడా పూర్తి కాలేదు కానీ అప్పుడే బోలెడు గొడవలు జరుగుతున్నాయి.
అయితే తాజాగా ఇప్పుడు ఒక్కొక్క ఇంటి సభ్యుడు తీసుకుంటున్న రెమ్యూనరేషన్ ఎంత అని సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. బిగ్ బాస్ అంటేనే సెలబ్రిటీలు ఒక ఇంట్లో కలిసి ఉండటం. అయితే వారి వారి పాపులారిటీ ని బట్టి రెమ్యూనరేషన్ మారుతూ ఉంటుంది.
ఎక్కువ పాపులారిటీ ఉన్న సెలబ్రిటీలకు ఎక్కువ రెమ్యూనరేషన్ వస్తుంది. అసలు పేరు కూడా సరిగ్గా తెలియని సెలబ్రిటీలకి.. మిగతా వారితో పోలిస్తే తక్కువ రెమ్యూనరేషన్ వస్తుంది. అంటే కనీసం ఎపిసోడ్ కి లక్ష ప్రతి కంటెస్టెంట్ కి వస్తుంది.
బిగ్ బాస్ ఇంట్లో ఉన్న కంటెస్టెంట్ లు అందరిలో.. ఆదిత్య ఓం అత్యధిక రెమ్యూనరేషన్ అందుకుంటున్నారు. ఒక్కో ఎపిసోడ్‌కు ఆదిత్య ఏకంగా 5 లక్షలు సంపాదిస్తున్నారు. ఆదిత్య తర్వాత అత్యధిక రెమ్యూనరేషన్ అందుకుంటున్న రెండవ కంటెస్టెంట్ యాంకర్ విష్ణుప్రియ భీమినేని. ఆమె ఎపిసోడ్‌కు 4 లక్షలు సంపాదిస్తున్నట్టు టాక్.
బిగ్ బాస్ తెలుగు 8 కంటెస్టెంట్ల రెమ్యూనరేషన్:
- ఆదిత్య ఓం: రూ. 5 లక్షలు
- విష్ణుప్రియ భీమినేని: రూ. 4 లక్షలు
- యశ్మి గౌడ: రూ. 2.5 లక్షలు
- నిఖిల్ మలియక్కల్: రూ. 2 నుండి 2.25 లక్షలు
- శేఖర్ బాషా: రూ. 1.5 నుండి 2 లక్షలు
- అభయ్ నవీన్: రూ. 2 లక్షలు
- కిరాక్ సీత: రూ. 2 లక్షలు
- నబీల్ అఫ్రిది: రూ. 2 లక్షలు
- నైనికా: రూ. 1 నుండి 1.5 లక్షలు
- పృథ్విరాజ్ శెట్టి: రూ. 1 నుండి 1.25 లక్షలు
- బెజవాడ బేబక్కా: రూ. 1 లక్ష
- ప్రేరణ కంబం: రూ. 1 లక్ష
- నాగ మణికంఠ: రూ. 1 లక్ష
Also read: Floods Fear: విజయవాడలో మళ్లీ వరద భయం, ఇళ్లు వదిలి లాడ్జీల్లో నివాసముంటున్న ప్రజలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.