Bigg Boss Revanth : గుండెలు పిండేసిన బిగ్ బాస్.. సింగర్ రేవంత్‌ను పాపను చూపించి ఏడిపించేడుగా

Bigg Boss Surprise To Singer Revanth బిగ్ బాస్ ఇంట్లో రేవంత్‌కు స్వీట్ న్యూస్ చెప్పాడు బిగ్ బాస్. రేవంత్‌కు మొన్న రాత్రి పండంటి ఆడబిడ్డ పుట్టిన సంగతి తెలిసిందే. అయితే ఈ విషయాన్ని రేవంత్‌కు బిగ్ బాస్ టీం చేరవేసింది.

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 3, 2022, 05:03 PM IST
  • బిగ్ బాస్ ఇంట్లో రేవంత్ ఎమోషనల్
  • బిడ్డ పుట్టిందనే విషయాన్ని తెలుసుకున్న రేవంత్
  • బిడ్డను చూపించిడంతో కంటతడి పెట్టిన సింగర్
Bigg Boss Revanth : గుండెలు పిండేసిన బిగ్ బాస్.. సింగర్ రేవంత్‌ను పాపను చూపించి ఏడిపించేడుగా

Singer Revanth Blessed With baby Girl : బిగ్ బాస్ ఇంట్లో వాళ్లకి బయటి సంగతులేమీ తెలియవు. తమ ఫ్యామిలీ మెంబర్లకు ఎలా ఉందా? అనే టెన్షన్‌తో కంటెస్టెంట్లు ఆటలు ఆడుతుంటారు. కొందరు తల్లిదండ్రుల గురించి బాధపడుతుంటే.. కొందరు తమ పిల్లలు, భార్య గురించి ఆలోచిస్తుంటారు. ఇప్పుడు ఈ ఆరో సీజన్‌లో సింగర్ రేవంత్ మాత్రం మొదటి నుంచి తన భార్య గురించి ఆలోచిస్తూనే ఉన్నాడు. తన భార్య గర్భంతో ఉండటం, శ్రీమంతం, డెలివరీ వంటి సందర్భాల్లో తాను పక్కన ఉండలేకపోతోన్నాను అని బాధపడుతుంటాడు.

అలా రేవంత్‌ బాధపడకుండా ఉండేందుకు ఎప్పటికప్పుడు బిగ్ బాస్ అప్డేట్ ఇస్తూనే వచ్చాడు. రేవంత్ భార్య అన్వితకు సంబంధించిన శ్రీమంతం ఫోటోలను, వీడియోలను ప్లే చేసి చూపించాడు. ఇప్పుడు రేవంత్‌కు పండంటి బిడ్డ పుట్టించింది. ఈ విషయం బిగ్ బాస్ ఇంట్లో ఉన్న రేవంత్‌కు తెలియదు. దీంతో బిగ్ బాస్ సర్ ప్రైజ్ ఇచ్చాడు. ఆ ఎపిసోడ్‌ను నేడు ఆడియెన్స్‌కు చూపించబోతోన్నాడు. కన్ ఫెషన్ రూంకు పిలిపిచి రేవంత్‌కు అసలు విషయాన్ని చెప్పాడు బిగ్ బాస్.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News