RJ Surya and Aarohi : కష్టం, సుఖం పంచుకుంటాం.. సూర్యపై ఆరోహి కామెంట్స్.. బిగ్ బాస్ అనంతరం ఇలా

Bigg Boss RJ Surya and Aarohi Rao బిగ్ బాస్ ఇంట్లో ఆర్జే సూర్య, ఆరోహి చేసిన సందడి అందరికీ తెలిసిందే. చివరకు సురోహి ట్రాక్‌ మాత్రం అందరినీ ఆకట్టుకుంది. ఇప్పుడు ఆదివారం విత్ స్టార్ మా పరివారం షోలో బిగ్ బాస్ ఆరో సీజన్ టీం మొత్తం సందడి చేసింది.

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 9, 2022, 07:45 PM IST
  • నెట్టింట్లో బిగ్ బాస్ కంటెస్టెంట్ల సందడి
  • ఆదివారం విత్ స్టార్ మా పరివారం
  • మరోసారి చర్చలోకి సురోహి ట్రాక్
RJ Surya and Aarohi : కష్టం, సుఖం పంచుకుంటాం.. సూర్యపై ఆరోహి కామెంట్స్.. బిగ్ బాస్ అనంతరం ఇలా

Bigg Boss RJ Surya and Aarohi Rao బిగ్ బాస్ ఆరో సీజన్ ప్రస్తుతం చివరి దశకు వచ్చేసింది. ఇంకొన్ని రోజుల్లో ఈ సీజన్ సమాప్తం కానుంది. విన్నర్‌గా ఎవరు అవుతారు అనే చర్చ మాత్రం గట్టిగానే సాగుతోంది. ఇక ఈ సీజన్ కంటెస్టెంట్ల సందడి మాత్రం నెట్టింట్లో ఇంకా కొనసాగుతూనే ఉంది. తాజాగా బిగ్ బాస్ ఆరో సీజన్ ఎలిమినేటెడ్ కంటెస్టెంట్లతో శ్రీముఖి ఆటలు ఆడించింది. ఆదివారం విత్ స్టార్ మా పరివారం అనే షోలో బిగ్ బాస్ ఆరో సీజన్ల కంటెస్టెంట్లు పాల్గొన్నారు.

బిగ్ బాస్ ఇంట్లో ఆర్జే సూర్య, ఆరోహి ట్రాక్ ఎలా వైరల్ అయిందో అందరికీ తెలిసిందే. సూర్య, ఆరోహిని కలిసి సురోహి చేసేశారు నెటిజన్లు. బిగ్ బాస్ ఇంట్లోకి రాకముందే ఆరోహి, సూర్య స్నేహితులు. ఒకే సంస్థలో మూడేళ్లుగా కలిసి పని చేస్తూ వచ్చారు. అలాంటి వారు బిగ్ బాస్ ఇంట్లోనూ కలిసి ఉంటే.. ఇంకెలా ఉంటుంది? అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇక బిగ్ బాస్ టీం కూడా ఈ ట్రాక్ మీద బాగానే ఫోకస్ పెట్టేసింది. ఈ ఇద్దరి రొమాంటిక్ యాంగిల్ ఫోటోలను కూడా సపరేట్‌గా క్యాప్చర్ చేసింది బిగ్ బాస్ టీం.

 

ఇలా మొత్తానికి సురోహి ట్రాక్‌ను బిగ్ బాస్ టీం బాగానే ఎంకరేజ్ చేసినట్టు అనిపించింది. కానీ ఆరోహి నాల్గో వారంలోనే ఎలిమినేట్ అయి బయటకు వచ్చింది. ఆ తరువాత సూర్య, ఇనయ ట్రాక్ పట్టాలెక్కింది. అయితే ఇప్పుడు మాత్రం ఆదివారం విత్ స్టార్ మా పరివారంలో మరోసారి సురోహి ట్రాక్ సందడి చేసింది.

సూర్య, ఆరోహిలను టార్గెట్ చేస్తూ శ్రీముఖి వేసిన పంచ్‌లు వైరల్ అవుతున్నాయి. శ్రీముఖి ఐలవ్యూ అని ఆరోహి అరిచేసింది. శ్రీముఖి తీసి సూర్య పెట్టమ్మా.. అని శ్రీముఖి కౌంటర్ వేసింది. ప్రతీ లవ్ స్టోరీలో నేనే హీరోను.. అంటూ సూర్య చెప్పిన డైలాగ్‌కు ఆరోహి కౌంటర్ వేసింది. వాడు హీరో కాదు విలన్ అంటూ సెటైర్ వేసింది. దాందీ నాదీ ప్యూర్ ఫ్రెండ్ షిప్ అని సూర్య ఏదో చెప్పబోయాడు. ఎవడు అడిగాడు నిన్ను అని శ్రీముఖి గాలి తీసేసింది.

కష్టమైనా సుఖమైనా ఇద్దరం కలిసి పంచుకుంటాం కాబట్టి.. అంటూ ఆరోహి డైలాగ్ చెప్పింది. ఆ తరువాత కాకరకాయ రసాన్ని ఆరోహి, సూర్య కలిపి సగం సగం తాగేశారు. ఇలా మొత్తానికి బిగ్ బాస్ షో తరువాత సూర్య, ఆరోహి సందడి చేశారు.

Also Read : Mahesh Babu Wife : నాలో వేడి పుట్టించండంటోన్న మహేష్‌ బాబు భార్య.. కొత్త లుక్కుతో షాకిచ్చిన నమ్రత

Also Read : Jabardasth Anchor Sowmya : కనిపించని హైపర్ ఆది.. పెరిగిపోతోన్న జబర్దస్త్ యాంకర్ సౌమ్య క్రేజ్

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News