Bigg Boss 5 Telugu: మెగాస్టార్ సినిమాలో బిగ్‌బాస్‌ కంటెస్టెంట్‌..ఎవరంటే..

Bigg Boss 5: బిగ్ బాస్ కంటెస్టెంట్, టాప్ కొరియోగ్రాఫర్ అయిన యానీమాస్టర్ మెగాస్టార్ చిరంజీవి సినిమాలో ఛాన్స్ కొట్టేశారు. వివరాల్లోకి వెళితే..  

Edited by - ZH Telugu Desk | Last Updated : Dec 23, 2021, 08:06 PM IST
Bigg Boss 5 Telugu: మెగాస్టార్ సినిమాలో బిగ్‌బాస్‌ కంటెస్టెంట్‌..ఎవరంటే..

Anee Master: బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ ఐదో సీజన్(Bigg Boss 5 Telugu)ను విజయవంతంగా ముగించుకుంది. ఈ షోలో పాల్గొన్న కంటెస్టెంట్లకు బయట విపరీతమైన ఫాలోయింగ్ వచ్చేసింది. అంతేకాకుండా సినిమా అవకాశాలను కూడా అందిపుచ్చుకుంటున్నారు. టాలీవుడ్ టాప్ కొరియోగ్రాఫర్ యానీ మాస్టర్(Anee Master) బిగ్ బాస్ షోలో పాల్గొని..11 వారం ఎలిమినేట్ అయ్యింది. హౌస్‌లో ఉన్నన్ని రోజులు రెమ్యునరేషన్ అందుకున్న యానీ..తాజాగా మెగాస్టార్ చిరంజీవి సినిమాలో ఛాన్స్ కొట్టేసింది. అది కూడా నటిగా. 

మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న చిత్రం బోళా శంకర్(Bhola Shankar‌). తాజాగా ఈ సినిమాలో యానీ మాస్టర్‌(Anee Master)కు అవకాశం వచ్చింది. ఈ విషయాన్ని స్వయంగా ఆమె తన ఇన్ స్టా స్టోరీస్ లో షేర్ చేశారు. అయితే నిజానికి బిగ్‌బాస్‌ హౌస్‌లోకి వెళ్లడానికి ముందే యానీ మాస్టర్‌ ఈ ఆఫర్‌ను సొంతం చేసుకున్నట్లు తెలిపారు. ఈ చిత్రంలో చిరంజీవి(Chiranjeevi), వెన్నెల కిషోర్‌ల పక్కనే తాను ఉంటానంటూ తన పాత్ర గురించి చెప్పేసింది యానీ. తనకు ఈ అవకాశం ఇచ్చినందుకు గాను దర్శకుడు మెహర్‌ రమేశ్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఇదిలా ఉంటే ఈ సినిమాలో యానీ మాస్టర్‌ కేవలం నటనకే పరిమితం కాకుండా.. కొరియోగ్రాఫర్‌గా కూడా చేస్తున్నట్లు ఆమె చెప్పుకొచ్చింది. ఇక ఈ సినిమాలో బిగ్‌బాస్‌ కంటెస్టెంట్‌ లోబో కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే.

Also Read: Radhe Shyam: ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఐమ్యాక్స్‌ స్క్రీన్ పై 'రాధేశ్యామ్' స్పెషల్‌ షోస్‌..అడ్వాన్స్‌ బుకింగ్‌ ప్రారంభం..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

 

Trending News