Bigg Boss Amit : ఐటం సాంగ్ పాడిన మంగ్లీ.. బిగ్ బాస్ అమిత్ కొత్త సినిమా అప్డేట్

Singer Mangli Songs సింగర్ మంగ్లీ ప్రస్తుతం ఫుల్ బిజీగా ఉంటోంది. ఆమె తాజాగా పాడిన ఐటం సాంగ్‌ వైరల్ అవుతోంది. బిగ్ బాస్ అమిత్ హీరోగా ఇప్పుడు అంతిమ తీర్పు అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతోన్నాడు. ఈ మూవీ నుంచి టిప్పా టిప్పా సాంగ్‌ను రిలీజ్ చేశారు.

Written by - ZH Telugu Desk | Last Updated : May 9, 2023, 04:17 PM IST
  • నెట్టింట్లో అమిత్ కొత్త సినిమా
  • ఐటం సాంగ్ పాడిన మంగ్లీ
  • టిప్పా టిప్పా అంటూ యూనిట్ హల్చల్
Bigg Boss Amit : ఐటం సాంగ్ పాడిన మంగ్లీ.. బిగ్ బాస్ అమిత్ కొత్త సినిమా అప్డేట్

Anthima Theerpu Tipaa Tippa Song బిగ్ బాస్ షోతో అమిత్ ఫేమస్ అయ్యాడు. ఆ తరువాత వెండితెరపై హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఇప్పుడు అంతిమ తీర్పు అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతోన్నాడు. ఈ సినిమాలో సాయి ధన్సిక, విమలారామన్‌, గణేష్‌ వెంకట్‌రామన్‌ వంటి వారు ముఖ్య పాత్రలను పోషించారు. 

ఈ సినిమాకు ఎ. అభిరాం దర్శకత్వం వహించాడు. ఈ మూవీని సిద్ధి వినాయక, డి.రాజేశ్వరరావు నిర్మించారు. తాజాగా ఈ మూవీ నుంచి ఓ ఐటం పాటను రిలీజ్ చేశారు. టిప్పా టిప్పా..టిప్ప.. టిప్పర్‌ లారీ నా ఒళ్లే.. రప్ప..రప్ప.. రప్ప వత్తే యాక్సిడేంటేలే అంటూ సాగే పాటను ఇటీవలే విడుదల చేశారు.

కోటి అందించిన సంగీతం,  కాసర్ల శ్యామ్‌ సాహిత్యం, మంగ్లీ గాత్రం హైలెట్ అవుతోంది.  ఈ పాటలోస్నేహా గుప్తా అందాలను ఆరబోసింది. ఈశ్వర్‌ పెంటి కంపోజ్ చేసిన స్టెప్పులు బాగున్నాయి. ఇక ఈ సినిమా గురించి దర్శకనిర్మాతలు మాట్లాడుతూ.. చక్కని కథాంశంతో రూపొందిన చిత్రమిదని అన్నారు.

ఇప్పటికే చిత్రీకరణ పూర్తయిందని, ‘టిప్పా టిప్పా’ సాంగ్‌ చక్కని డాన్స్‌ నంబర్‌ అవుతుందని అన్నారు. ఈ పాటను డాగ్‌ హౌస్‌లో నాలుగు రోజులపాటు చిత్రీకరణ చేశామని పేర్కొన్నారు. ఈ మూవీ ఆడియోను టి.సిరీస్‌ ద్వారా విడుదల చేశామని తెలిపారు. మ్యూజిక్ డైరెక్టర్ కోటి ప్రతి పాటకు చక్కని బాణీలను అందించారు.

Also Read:  Adipurush Trailer: ఆదిపురుష్ ట్రైలర్ రిలీజ్.. మా రాఘవుడి కథే రామాయణం.. ఆ ఒక్కటే మైనస్

ఇటీవల విడుదల చేసిన ఈ ఐటం పాటకు అద్భుతమైన స్పందన వస్తోంది. ఇదే ఉత్సాహంతో త్వరలో సెకెండ్‌ లిరికల్‌ సాంగ్‌, టీజర్‌ను విడుదల చేస్తామని ప్రకటించారు. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయని, త్వరలో రిలీజ్ డేట్‌ని ప్రకటిస్తామని అన్నారు.

Also Read:  HBD Sai Pallavi : నీ చెల్లిగా పుట్టినందుకు నేను లక్కీ.. మిస్ అవుతున్నా.. సాయి పల్లవి సిస్టర్ స్పెషల్‌ విషెస్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News