Bigg Boss విన్నర్ ఎవరో తేలిపోయింది.. ఇంటి సభ్యులంతా కలిసి తీసుకున్న నిర్ణయం సరైనదేనా?

Bigg Boss 6 Winner బిగ్ బాస్ ఆరో సీజన్ ప్రస్తుతం ట్రెండ్ అవుతోంది. ఇందులోని కంటెస్టెంట్ల గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతోంది. రకరకాల జనాలున్నారు ఇందులో. సగం రోజులు గడిచినా సరైన కంటెస్టెంట్ వీళ్లే అని ఒక్కరినీ కూడా జనాలు చెప్పుకోలేకపోతోన్నారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 23, 2022, 10:32 AM IST
  • బిగ్ బాస్ ఇంట్లో ఏడో వారం
  • బిగ్ బాస్ విజేత ఎవరంటే?
  • శ్రీహాన్‌కే బిగ్ బాస్ ఇంటి సభ్యుల ఓటు
Bigg Boss విన్నర్ ఎవరో తేలిపోయింది.. ఇంటి సభ్యులంతా కలిసి తీసుకున్న నిర్ణయం సరైనదేనా?

Bigg Boss 6 Winner : బిగ్ బాస్ ఆరో సీజన్ విన్నర్ అయ్యే అర్హత ఎవరికి ఉంది? అని అడిగితే.. ఆన్సర్ చెప్పడం అందరికీ కష్టమే. విన్నర్ అయ్యే పూర్తి అర్హతలు ఎవ్వరికీ లేవు. బిగ్ బాస్ అంటే కేవలం ఆట మాత్రమే కాదని తెలుసుకోలేకపోతోన్నారు కొంత మంది కంటెస్టెంట్లు. బాలాదిత్య భాషలో చెప్పాలంటే.. ఆట తీరు, మాట తీరు, మనిషి తీరు ఇలా అన్ని పర్ఫెక్ట్‌గా ఉండాలి. కానీ ఈ మూడు కలిసి ఉన్న కంటెస్టెంట్ ఈ సీజన్లో కనిపించడం లేదు. కానీ నిన్నటి ఎపిసోడ్‌తో కంటెస్టెంట్లలోని మనసులో ఉన్న విషయాలు బయటకు వచ్చాయి.

కంటెస్టెంట్ల దృష్టిలో అర్హులు, అనర్హులు ఎవరో తేలింది. మెరినా అనర్హురాలని ఎక్కువ మంది ఓటేశారు. శ్రీహాన్ అర్హుడని ఎక్కువ మంది ఓటేశారు. ఆ తరువాత గీతూ, సూర్య, రేవంత్‌లు కూడా అర్హులే అని వచ్చింది. కానీ బాలాదిత్యకు మాత్రం ఒకరిద్దరే ఓటు వేశారు. ఇలా మొత్తానికి ఇంటి సభ్యుల దృష్టిలో శ్రీహాన్, గీతూ, సూర్య, రేవంత్‌లు అర్హులన్న మాట. అయితే బయట జనాల దృష్టిలోనూ దాదాపు ఇదే అభిప్రాయం ఉంది. అందులో బాలాదిత్య కూడా ఉంటాడు.

కానీ ఈ ఐదుగురిలో చాలా లోపాలున్నాయి. వాటిని వారు అధిగమిస్తే తప్పా.. టైటిల్ గెలవలేరు. శ్రీహాన్ అన్నింట్లోనూ దాదాపు పర్ఫెక్టే. మాట తీరు బాగానే ఉంటుంది. కానీ కొన్ని సార్లు కాస్త ఓవర్ చేసినట్టు అనిపిస్తోంది. ఇనయతో శ్రీహాన్ పెట్టుకున్న గొడవల్లో శ్రీహాన్‌కే బ్యాడ్ అయింది. తనకంటూ ఓ స్టాండ్ తీసుకోవడం లేదని అనిపిస్తోంది. శ్రీహాన్ ఆ ఒక్క విషయంలో మెరుగుపడాల్సి ఉంటుంది. ఇక రేవంత్ తన నోటిని అదుపులో పెట్టుకుంటే విన్నర్ అవుతాడు. గీతూ అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ విన్నర్ అవ్వదనిపిస్తోంది. చివరి వరకు ఉండి.. టాప్ 5 అవుతుందేమో గానీ.. విన్నర్ అయ్యే అర్హత ఆమెకు లేదనిపిస్తుంది. బిగ్ బాస్ అంటే కేవలం ఆటలు మాత్రమే అనే భ్రమలోఉంది. ప్రవర్తన ముఖ్యమని తెలుసుకోవడం లేదు.

బాలాదిత్య అయితే మిస్టర్ పర్ఫెక్ట్.. మోస్ట్ మెచ్యూర్డ్ పర్సన్. బాలాదిత్యకు విన్నర్ అయ్యే అవకాశాలున్నాయి. కానీ ఆటల్లోనూ కాస్త ముందుండాలి. అప్పుడే విన్నర్ కాగలడు. ఇక సూర్య అయితే మంచికి మారుపేరులా ఉంటున్నాడు. కానీ పులిహోర రాజా అనే ట్యాగ్ తెచ్చుకున్నాడు. ఇలా ఒక్కొక్కొరికి ఒక్కో లోపం ఉంది. విన్నర్ అయ్యేందుకు ఎక్కువ చాన్స్ ఈ ఐదుగురికి ఉంది. కానీ వీరిలో విన్నర్ ఎవరు అవుతారన్నది చూడాలి.

Also Read : Bigg Boss 7th Week Elimination : బిగ్ బాస్ షాకింగ్ నిర్ణయం.. లవ్ ట్రాక్‌కు పుల్ స్టాప్.. అతడే అవుట్?

Also Read : Bigg Boss Geetu : అడిగి మరీ పరువుతీసుకోవడం అంటే ఇదే.. గీతూ అతి ఇక మారదా?

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News