Bigg Boss 6 Telugu 4th week Elimination : బిగ్ బాస్ ఇంట్లో నాలుగో వారం నామినేషన్ ప్రక్రియ ఎంత బలంగా జరిగిందో అందరికీ తెలిసిందే. ఒకరిపై ఒకరు వాగ్వాదాలు, ఆరోపణలు చేసుకున్నారు. మొత్తానికి పది మంది కంటెస్టెంట్లు నాలుగో వారంలో నామినేట్ అయ్యారు. అందులో గీతూ రేవంత్ శ్రీహాన్ వంటి వారు ఎలిమినేట్ అవ్వరని అందరికీ తెలిసిందే. ఈ సారి నామినేట్ అయిన కంటెస్టెంట్లలో సుదీప, ఆరోహి, ఇనయ వంటి వారు ఎక్కువగా డేంజర్ జోన్లో ఉంటారని అంతా భావించారు. అయితే ఇప్పుడు జనాలు ఎవరిని బయటకు పంపించేశారా? అనేది ఆసక్తికరంగా మారింది. అయితే రాజ్, కీర్తి వంటి వారు కూడా ఎలిమినేట్ అయ్యే చాన్స్ ఉందని అంతా అనుకున్నారు.
ఇప్పుడు నాలుగో వారం ఎలిమినేషన్‌కు సంబంధించిన లీకులు మాత్రం ఎక్కువగా ట్రెండ్ అవుతోంది. సుదీప, ఆరోహిలు చివరి రెండు స్థానాల్లో ఉన్నట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగా ఆరోహి ఎలిమినేట్ అయి బయటకు వచ్చిందని సమాచారం అందుతోంది. ఇంకొంత మంది అయితే రాజ్‌ను సీక్రెట్ రూంలోకి పంపించేశారు అని కూడా అంటున్నారు. మరి కొందరు అయితే సుదీప ఎలిమినేట్ అయిందని చెప్పుకుంటున్నారు.
ఇలా లీకులు ప్రస్తుతం నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. ఆరోహి ఎలిమినేట్ అయిందని తెలియడంతో నెటిజన్లు మీమ్స్, ట్రోల్స్‌తో రచ్చ చేస్తున్నారు. సురోహి ట్రాక్ చూడలేక చచ్చిపోయాం.. సూర్య, ఆరోహిల ట్రాక్ దారుణంగా ఉందంటూ అందరూ కామెంట్లు పెడుతున్నారు. ఆరోహి ఎలిమినేషన్ వార్త విని.. అబ్బా సాయి రాం అనుకుంటున్నాం అంటూ ఇలా ట్వీట్లు పెడుతున్నారు.
తాజాగా రిలీజ్ చేసిన ప్రోమోలోనూ ఆరోహి కాస్త అతి చేసినట్టు అనిపించింది. సూర్య అనేవాడు బెస్ట్ ఫ్రెండ్ కంటే ఎక్కువట.. అంటే ఏంటి? అని నాగార్జున అన్నాడు. నందు అయితే లవ్ అని.. అది క్లారిటీ ఉందని, సూర్యతో మాత్రం చెప్పలేని బంధం అంటూ ఇలా ఏదేదో పిచ్చిగా వాగేసింది. అలా ఇప్పుడు ఆరోహి ఎలిమినేషన్ వార్త అయితే ఎక్కువగా ట్రెండ్ అవుతోంది. ఈ ఎలిమినేషన్ లీకుల వార్తల్లో ఎంత నిజం ఉందో తెలియాలంటే ఆదివారం నాటి ఎపిసోడ్ వరకు వేచి చూడాల్సిందే. ఈ నాలుగో వారంలో రేవంత్, ఇనయ, శ్రీహాన్, గీతూ, కీర్తి, అర్జున్ కళ్యాణ్, రాజ్ శేఖర్, ఆర్జే సూర్య, సుదీప, ఆరోహి నామినేట్ అయిన సంగతి తెలిసిందే.
Also Read : అందాలకు అడ్డుగా పెట్టేసింది.. శ్రియా ఫోటోలు వైరల్
Also Read : పవన్ కళ్యాణ్ బూట్ల రేట్లపై చర్చ.. పిక్స్ వైరల్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి