Bigg Boss 6 : శ్రీహాన్ మీదకు ఎక్కేసిన శ్రీసత్య.. పాపం అర్జున్ బక్రా అయ్యాడుగా.. అప్పుడలా ఇప్పుడిలా

Sri Satya With Shrihan బిగ్ బాస్ ఇంట్లో శ్రీ సత్య వ్యవహారం ఏదో తేడా కొడుతోందే అన్నట్టుగా సాగుతోంది. ఈ మధ్య శ్రీ సత్య యవ్వారాలు చూస్తుంటే చీ సత్య అనేట్టుగా ఉంది. నిన్నటి ఎపిసోడ్‌లో కెప్టెన్‌గా టాస్క్ గెలవడంతో.. శ్రీహాన్, శ్రీ సత్యలు హగ్గులతో రెచ్చిపోయారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 5, 2022, 10:24 AM IST
  • బిగ్ బాస్ ఇంట్లో శ్రీ సత్య రచ్చ
  • అర్జున్ కళ్యాణ్‌కు దూరంగా సత్య
  • శ్రీహాన్ మీదకు ఎక్కేసిన చీ సత్య
Bigg Boss 6 : శ్రీహాన్ మీదకు ఎక్కేసిన శ్రీసత్య.. పాపం అర్జున్ బక్రా అయ్యాడుగా.. అప్పుడలా ఇప్పుడిలా

Sri Satya-Arjun Kalyan-Shrihan : బిగ్ బాస్ ఇంట్లో మాట్లాడే ప్రతీ మాట, చేసే ప్రతీ చేష్టలను జనాలు నిశితంగా గమనిస్తుంటారు. శ్రీ సత్య మొదట్లో చెప్పిన మాటలకు ఇప్పుడు ఉంటున్న తీరుకు అందరూ షాక్ అవుతున్నారు. తనను ఎవరైనా పట్టుకున్నా, ముట్టుకున్నా చిరాగ్గా ఉంటుందని, నచ్చదని చెప్పుకొచ్చింది శ్రీ సత్య. ప్రేమగా అర్జున్ కళ్యాణ్‌ తాకబోయినా కూడా దాన్ని కూడా పెద్ద రాద్దాంతం చేసింది. అదేదో బ్యాడ్ టచ్ అన్నట్టుగా ప్రొజెక్ట్ చేసింది. అర్జున్ కళ్యాణ్‌ పరువుతీసింది.

రేవంత్ అయితే సత్యను చెల్లి అనే పిలుస్తాడు. రేవంత్ కూడా భుజాల మీద చేయి వేస్తే.. నచ్చలేదట. అలా శ్రీ సత్య మొదట్లో అలాంటి మాటలు చెప్పింది. కానీ ఇప్పుడు అయితే శ్రీహాన్‌తో హద్దులు దాటేస్తోంది. చేతుల్లో చేతులు వేసుకుని నలిపేసుకున్నారు. ఇక నిన్నటి ఎపిసోడ్‌లో అయితే సత్య మరింతగా రెచ్చిపోయింది. కెప్టెన్సీ టాస్క్ ఎంతటి తుప్పాస్ టాస్కో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

ఈ సారి ఇంట్లోని ఆడవాళ్లందరూ కెప్టెన్సీ టాస్కులోకి రావడంతో.. పిచ్చి టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. ఆది కూడా వారంతా మరింత దరిద్రంగా ఆడుతున్నారని వార్నింగ్ ఇచ్చాడు. బెలూన్లను ఇచ్చి.. వాటిని పగలగొట్టాలని, చివరి వరకు ఎవరి చేతులో అయితే బెలూన్ ఉంటుందనే వారే విజేతలని అన్నాడు. ఈ టాస్క్‌ని కూడా అష్టదరిద్రంగా ఆడేశారు.

అదో ఓ చెత్త టాస్క్ అంటే.. అందులో సత్య గెలిచి నానా హంగామా చేసింది. అదేదో కష్టపడి ఆడి, ఓలింపిక్స్ మెడల్ సాధించినట్టుగా బిల్డప్ ఇచ్చింది. మన శ్రీహాన్ కూడా తక్కువ తిన్నాడా? అన్నట్టుగా రెచ్చిపోయాడు. సత్య కెప్టెన్సీ టాస్క్ గెలిచిందని తెలియడంతో.. వచ్చి వాటేసుకున్నాడు. ఇక సత్య అంతటితో ఆగలేదు. శ్రీహాన్ మీదకు ఎక్కేసింది. గాలి దూరనంత గట్టిగా హత్తుకున్నారు.

 

ఈ సీన్ చూసి అర్జున్ మాత్రం చాలా బాధపడి ఉంటాడేమో. తనను మాత్రం కనీసం చేత్తో కూడా టచ్ చేయనివ్వని సత్య.. ఇప్పుడు ఇలా శ్రీహాన్‌తో పిచ్చెక్కిస్తోందని బాధపడి ఉంటాడు. నిజానికి ఈ సీజన్‌లో సత్య వల్లే బక్రా అయింది అర్జున్ మాత్రమే. సత్యకు ఈ వారం నోటిదూల ఎక్కువైంది. వెక్కిరింతలు కూడా ఎక్కువయ్యాయి. ఈ వారం ఎలిమినేట్ అవుతుందని జనాలు అభిప్రాయ పడుతున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.

Also Read : Jabardasth New Anchor : జబర్దస్త్ కొత్త యాంకర్.. ఆ ఈవెంట్‌లోనే పట్టేసిన హైపర్ ఆది.. అది తక్కువైందట

Also Read : Rishab Shetty Kantara : కాంతారా కథను ముందుగా ఆ హీరోకు చెప్పాడట.. రిషభ్ శెట్టి ఇంట్రెస్టింట్ కామెంట్స్
 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

 

 

Trending News