Bigg Boss Elimination : బిగ్ బాస్ ఎలిమినేషన్.. పాపం ఫైమా.. ఇరుకున పెట్టేస్తారా?

Bigg Boss 6 Telugu 12th week Elimination బిగ్ బాస్ ఇంట్లో పన్నెండో వారం ఎలిమినేషన్ విషయంలో చివరి వరకు టెన్షన్ వాతావరణం నెలకొంది. ఎందుకంటే ఫైమా చేతిలో ఎవిక్షన్ పాస్ ఉండటంతో చివరి నిమిషంలో నిర్ణయాలు మారేట్టు కనిపిస్తోంది.

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 26, 2022, 04:42 PM IST
  • బిగ్ బాస్ ఇంట్లో పన్నెండో వారం
  • డబుల్ ఎలిమినేషన్ అంటూ రచ్చ
  • రాజ్‌ను ఎలిమినేట్ చేసిన బిగ్ బాస్ టీం
Bigg Boss Elimination : బిగ్ బాస్ ఎలిమినేషన్.. పాపం ఫైమా.. ఇరుకున పెట్టేస్తారా?

Bigg Boss 6 Telugu 12th week Elimination : బిగ్ బాస్ ఇంట్లో పన్నెండో వారం ఎలిమినేషన్ విషయంలో గందరగోళంగా మారింది. అసలే ఈ వారంలో రోహిత్, ఫైమా, సత్య, కీర్తి, రాజ్ ఇలా అందరూ డేంజర్ జోన్‌లోనే ఉన్నారు. ఇక ఫైమాకు ఎవిక్షన్ పాస్ ఉంది. ఆమె ఎలాగూ తప్పించుకుంటుందని అంతా అనుకుంటున్నారు. శ్రీ సత్యకు విపరీతమైన నెగెటివిటీ ఏర్పడింది. ఆమె ఎలిమినేట్ అవుతుందని అంతా భావిస్తున్నారు. రాజ్, కీర్తి, రోహిత్‌లు కూడా డేంజర్ జోన్‌లోనే ఉన్నారు.

అయితే తాజాగా వినిపిస్తున్న సమాచారం మేరకు ఈ పన్నెండో వారంలో డబుల్ ఎలిమినేషన్ ఉంటుందని తెలుస్తోంది.ఈ క్రమంలో రాజ్ ఎలిమినేట్ అయినట్టుగా లీకులు వస్తున్నాయి. మరి వీటిలో ఎంత నిజముంటుందో అనేది తెలియాలంటే ఆదివారం నాటి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే. ఫైమా కూడా డేంజర్ జోన్‌లోనే ఉందని, ఎలిమినేషన్ వరకు వచ్చిందని కానీ తన ఎవిక్షన్ ఫ్రీ పాస్ వాడుకుని బతికిపోయిందని తెలుస్తోంది.

ఈ వారం అంతా కూడా ఫ్యామిలీ ఎమోషన్స్‌ నడిచాయి. ఈ ఎపిసోడ్స్‌తో రేవంత్‌కు మాత్రమే ఫుల్ పాజిటివ్ ఇమేజ్ వచ్చింది. సత్య తల్లిని చూసి జనాలకు పాజిటివ్ అనిపించినా.. ఆమె తీరుతో అందరికీ విసుగు తెప్పించింది. ఆమె తండ్రి చెప్పినట్టుగా.. ముందు మొదటి వారాల్లో ఉన్న సత్య ఇప్పుడు లేదు.. మారిపోయింది. శ్రీహాన్‌తో ట్రాక్ వల్ల సత్య గ్రాఫ్ మరింతగా మారిపోయింది.

ఇక టాప్ 5లో ఇనయ చేరిపోయింది. ఆదిరెడ్డి, రేవంత్, శ్రీహాన్, ఫైమాలు టాప్ 5లో ఉంటారని అర్థమవుతోంది. మరి రానున్న రోజుల్లో ఎలాంటి ఘటనలైనా జరిగి.. ఎవరి గ్రాఫ్ అయినా పడిపోవచ్చు. పైకి లేవచ్చు. మరి ఏం జరుగుతుందన్నది చూడాల్సిందే.

Also Read : Love Today Day 1 Collections : అల్లరి నరేష్‌ను తొక్కి అవతల పారేసిన తమిళ డబ్బింగ్ సినిమా.. లవ్ టుడేకు దిమ్మ తిరిగే కలెక్షన్లు

Also Read : Matti Kusthi : మొదటి పెళ్లి అందుకే చెడింది.. గుత్తా జ్వాలాకు 24 గంటలు అదే పని.. విష్ణు విశాల్ కామెంట్స్

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

 

Trending News